- Home
- Entertainment
- వాట్సాప్ నెంబర్ అడిగిన నెటిజన్‌కి అనుపమా పరమేశ్వరన్ ఊహించని ఝలక్.. మిడ్‌నైట్ ఫ్రీడమ్ ఇష్టమట..
వాట్సాప్ నెంబర్ అడిగిన నెటిజన్‌కి అనుపమా పరమేశ్వరన్ ఊహించని ఝలక్.. మిడ్‌నైట్ ఫ్రీడమ్ ఇష్టమట..
కుందనపు బొమ్మలా ఉంటుంది అనుపమా పరమేశ్వరన్. నిండైన ముఖంతో క్యూట్ అందాలతో కనువిందు చేస్తే ఈ భామ రౌడీ గర్ల్ కూడా ఉంది. తాజాగా దానికి పనిపెట్టింది. ఓ నెటిజన్ పెద్ద ఝలక్ ఇచ్చింది.

హీరోయిన్లు తరచూ తన అభిమానులతో, నెటిజన్లతో ఛాట్ చేస్తుంటారు. వీడియో ఛాట్‌లుగానీ, ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌గానీ ఇస్తుంటారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంటారు. అయితే వీరికి చాలా వరకు కొన్ని కొంటే ప్రశ్నలు, మరికొన్ని ఇరుకుపెట్టే ప్రశ్నలు, ఇంకొన్ని వివాదాస్పద ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వాటికి ఎలా రియాక్ట్ అవుతుంటారు, ఎలాంటి సమాధానం చెబుతారనేది ముఖ్యం. తేడా ఆన్సర్ ఇస్తే ట్రోల్స్ తప్పవు.
అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran) సోషల్ మీడియాలో తన అభిమానులతో ఛాట్ చేసింది. ఇందులో పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. తనకిష్టమైన ఫుడ్ గురించి చెప్పింది. తన మూడ్ బాగాలేకపోతే గట్టిగా బ్రీతింగ్ తీసుకుంటానని తెలిపింది. తన చిన్ననాటి స్కూల్ ఫోటో అడగ్గా ఓ మార్ఫింగ్ పిక్చర్‌ని షేక్ చేసి షాకిచ్చింది. దీంతో తూచ్ అంటున్నారు నెటిజన్లు.
ఈ క్రమంలో ఓ నెటిజన్ మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి అని ప్రశ్నించాడు. దానికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది అనుపమా పరమేశ్వరన్. తన వాట్సాప్ నెంబర్ ఇంకా కనుగొనలేదని, చూపించడం లేదని తెలిపింది. కొంటెగా ఓ ఎమోజీని పంపి ఝలక్ ఇచ్చింది. దీంతో సదరు నెటిజన్ ఒకే దెబ్బకి సైలెంట్ అయిపోయాడు.
హీరోయిన్లు, హీరోలుగానీ, పెద్ద సెలబ్రిటీలు ఎవరూ పబ్లిక్‌గా తన వ్యక్తిగత విషయాలను, ఫోన్ నెంబర్లని పంచుకోరు. ఆ విషయం అందరికి తెలిసిందే. కానీ కొందరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ, తారలను ఇబ్బంది పెడుతుంటారు. అయితే కొందరు మాత్రం వీటిని సరదాగా తీసుకుని అంతే సరదాగా పంచ్‌లు వేస్తుంటారు. అనుపమా పరమేశ్వరన్ సైతం అదే చేసి షాకిచ్చింది.
మరోవైపు తాను నటించిన చిత్రాల్లో ఇష్టమైన పాత్ర ఏదని అడిగిన ప్రశ్నకి, `మిడ్‌నైట్ ఫ్రీడమ్`లో నటించిన పాత్ర అని పేర్కొంది. ఇది ఆమె మలయాళ చిత్రం. ఓటీటీలో విడుదలైంది. ఇందులో అనుపమా పరమేశ్వరన్ చాలా బోల్డ్ రోల్ చేయడం విశేషం. తన పాత్రకి మంచి పేరు కూడా వచ్చింది.
ఇక హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది అనుపమా పరమేశ్వరన్. ఆమె తెలుగులో ఏకంగా మూడు సినిమాలు చేస్తుంది. నిఖిల్‌తో కలిసి `18 పేజెస్`, `కార్తికేయ 2` చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు `బట్టర్‌ఫ్లై` అనే మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తుంది.
క్యూట్ అందాల భామగా గుర్తింపు పొందిన అనుపమా పరమేశ్వరన్ తొలుత డీసెంట్ రోల్స్ చేసింది. అందంతో కట్టిపడేసింది. గ్లామర్ షోకి దూరంగా ఉంది. నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలే చేసింది. కానీ ఇప్పుడు రూట్ మార్చింది. గ్లామర్‌కి ఓకే అంటోంది. ఆమె సోషల్ మీడియాలో పంచకున్న హాట్ ఫోటో షూట్ పిక్సే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గ్లామర్‌కి సిద్ధపడితేనే లాంగ్ కెరీర్ ఉంటుందని భావించిందో ఏమో ఇప్పుడు హాట్ డోస్ పెంచుతూ తాను అన్నింటికి సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది అనుపమా పరమేశ్వరన్.