MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • అయ్యో.. అనుపమ సినిమాలకి దూరం కాబోతోందా ?.. షాకింగ్ డెసిషన్ తో ఫ్యాన్స్ లో గుబులు..

అయ్యో.. అనుపమ సినిమాలకి దూరం కాబోతోందా ?.. షాకింగ్ డెసిషన్ తో ఫ్యాన్స్ లో గుబులు..

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 22 2022, 09:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

క్యూట్ హీరోయిన్ అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 ఇండియా వ్యాప్తంగా సూపర్ సక్సెస్ సొంతం చేసుకోవడంతో ఈ యంగ్ బ్యూటీ గాల్లో తేలిపోతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది. శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.  

36

కార్తికేయ 2 సునామీ సక్సెస్ తర్వాత అనుపమ మరోసారి నిఖిల్ తో రొమాన్స్ చేస్తోంది. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు నిర్మించిన 18 పేజెస్ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. రేపు డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అనుపమ ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతోంది. 

46

తాజాగా అనుపమ 18 పేజెస్ ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ కి కంగారెత్తించే మ్యాటర్ చెప్పిందట. అనుపమకి ముందు నుంచి దర్శకత్వం పట్ల ఆసక్తి ఉంది. కానీ ఎప్పుడూ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. హీరోయిన్ గా పాపులారిటీ సొంతం చేసుకోవడంతో అనుపమ ఇలానే కంటిన్యూ అవుతోంది. కానీ ఆమె తాజాగా షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతోంది. అది కూడా హీరోయిన్ గా నటించడం మానేసి. 

56

దీనితో ఫ్యాన్స్ లో గుబులు మొదలైంది. 'అతి త్వరలో నేను దర్శకురాలిగా మారి ఒక సినిమా చేస్తాను. దర్శకత్వానికి కావలసిన టెక్నికల్ స్కిల్స్ నేర్చుకునేందుకు నటనకు ఒక ఏడాది పాటు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నా. నాకున్న ఆలోచనని దర్శకత్వంలో చూపిస్తా' అంటూ అనుపమ కామెంట్స్ చేసిందట. 

66

తన క్యూట్ లుక్స్, అద్భుతమైన నటనతో కట్టిపడేసే అనుపమ యాక్టింగ్ కి దూరం అవుతోంది అంటే ఫ్యాన్స్ కి కంగారు తప్పదు. యాక్టింగ్ కి ఏడాది గ్యాప్ ఇస్తే.. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం కష్టం అవుతుంది అని అభిమానులు ఈ మలయాళీ బ్యూటీని హెచ్చరిస్తున్నారు. 'మలయాళంలో 'మునియరయలియా అశోకన్' అనే చిత్రానికి అనుపమ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది. అనుపమ దర్శకత్వంపై మక్కువ చూపిస్తుండడంతో దుల్కర్ సల్మాన్ ఆమెని ఎంకరేజ్ చేస్తున్నారట. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved