MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anupama Parameswaran: పెళ్లికి ముందే తల్లి అవుతా.. తన కోరిక బయటపెట్టిన అనుపమా పరమేశ్వరన్‌

Anupama Parameswaran: పెళ్లికి ముందే తల్లి అవుతా.. తన కోరిక బయటపెట్టిన అనుపమా పరమేశ్వరన్‌

Anupama Parameswaran: అనుపమా పరమేశ్వరన్‌ తన మనసులోని మాటని బయటపెట్టింది. పెళ్లికి ముందే తల్లి కావాలనుకుంటుంది. ఒక బేబీని కనాలని ఉందని చెప్పింది. ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 15 2026, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రేజీ కల్యాణంతో రాబోతున్న అనుపమా పరమేశ్వరన్‌
Image Credit : Asianet News

క్రేజీ కల్యాణంతో రాబోతున్న అనుపమా పరమేశ్వరన్‌

అనుపమా పరమేశ్వరన్‌.. కమర్షియల్‌ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ కూడా చేస్తోంది. ఈ మధ్య ఆమె ఎక్కువగా మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు `క్రేజీ కల్యాణం` అనే సినిమాలో నటించింది. ఆమె పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. ఇందలో సీనియర్‌ నరేష్‌, తరుణ్‌ భాస్కర్‌, అఖిల్‌ ఉడ్డెమారి(అఖిల్‌ రాజ్‌) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వంలో యారో సినిమాస్‌ పతాకంపై బూసం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం రేపు శుక్రవారం( అక్టోబర్‌ 16)న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అనుపమా పరమేశ్వరన్‌ మీడియాతో మాట్లాడుతూ, క్రేజీ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెళ్లికి ముందే తల్లి అవుతానంటోన్న అనుపమా పరమేశ్వరన్‌
Image Credit : Asianet News

పెళ్లికి ముందే తల్లి అవుతానంటోన్న అనుపమా పరమేశ్వరన్‌

`క్రేజీ కల్యాణం` సినిమా పెళ్లి నేపథ్యంలో సాగుతుంది. కూతురుకి పెళ్లి చేయాలనుకుంటాడు తండ్రి నరేష్‌. కానీ తనకు ఇష్టం లేదు. ఈ క్రమంలో చోటు చేసుకునే డ్రామానే మూవీ. కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా మూవీ సాగుతుందట. అయితే ఈ విషయాన్ని అనుపమా చెబుతూ, ఈ సినిమాలోలా మా ఇంట్లో నా పెళ్లి గురించి ఏమాత్రం ఒత్తిడి లేదు. నీకు ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే మా వాళ్లు అంటారు. నాకైతే పెళ్లికి ముందే ఒక బేబిని కనాలని ఉంది. మా కేరళ వివాహా వేడుకల్లో పూర్తిగా శాకాహారమే వడ్డిస్తారు. కానీ తెలంగాణ పెళ్లి వేడుకల్లో కొత్త కల్చర్ తెలుసుకున్నాను. మా కేరళలో ఇప్పుడు పెళ్లి వేడుకల్లో హల్దీ, మెహందీ అని కొత్త కొత్త కల్చర్స్ వస్తున్నాయి గానీ గతంలో ఎంగేజ్ మెంట్ , పెళ్లి ఈ రెండే వేడుకలు జరిపేవారు` అని చెప్పింది.

35
బద్రప్పలో సిన్సియారిటీ నచ్చి చేశా
Image Credit : Asianet News

బద్రప్పలో సిన్సియారిటీ నచ్చి చేశా

సినిమా గురించి చెబుతూ, `క్రేజీ కల్యాణం సినిమాలో మా క్యారెక్టర్స్ అన్ని స్ట్రగుల్ పడుతుంటాయి. మా కష్టాలు మీకు కామెడీగా అనిపిస్తాయి. మా పాత్రల ద్వారా, ఆ సందర్భాల ద్వారా ఆర్గానిక్ గా కామెడీ జెనరేట్ అవుతుంటుంది. స్క్రిప్ట్ చెప్పేందుకు వచ్చినప్పుడే డైరెక్టర్ గా బద్రప్పలోని సిన్సియారిటీ, కన్విక్షన్ చూశాను. ఆయన ఈ కథ చెబుతుంటే కొన్ని సార్లు నవ్వొచ్చింది, కొన్ని సీన్స్ కు ఎమోషనల్ అయ్యాను. బాలరాజు పాత్రతో సహా ఆయన కంప్లీట్ స్క్రిప్ట్ చెప్పారు. స్క్రిప్ట్ తో పాటు దర్శకుడిగా బద్రప్ప జెన్యూన్ అప్రోచ్ నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నాను. మా మూవీలో తరుణ్ భాస్కర్ చేసిన బాలరాజు క్యారెక్టర్ మనలో ఒకడు, మనం రోజు చూసే లైఫ్ లో నుంచి వచ్చిన పాత్ర అది. ఆ క్యారెక్టర్ లో చాలా ఫన్ ఉంటుంది. మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా కొంతవరకు బాలరాజు లే.

సినిమా చేస్తున్న ప్రాసెస్ లో ప్రతీది క్రేజీగా అనిపించాయి. దాంతో మా డైరెక్టర్ క్రేజీ కల్యాణం అని టైటిల్ పెట్టారు. ఇది ఫన్, ఎమోషన్ ఉన్న స్టోరీ. నరేష్ గారు, అఖిల్, తరుణ్ భాస్కర్..ఇలా వీళ్లంతా కాస్టింగ్ లో జాయిన్ అయ్యాక మరింత క్రేజీ ప్రాజెక్ట్ అయ్యింది. ఈ సినిమా కోసం నేను ఇంటెన్స్ ప్రమోషన్స్ చేశాను. పర్సనల్ గా హ్యాపీగా ఉన్నా కాబట్టి అంత ఎంజాయ్ చేస్తూ ప్రమోషన్స్ లో పాల్గొన్నాను. జగన్ మోహన్ రెడ్డి లాంటి క్రేజీ ప్రొడ్యూసర్ లేకుంటే ఈ సినిమా ఇంత బాగా మన ముందుకు వచ్చేది కాదు` అని వెల్లడించింది అనుపమా.

45
అందరం చర్చించుకొని నటించాం
Image Credit : X

అందరం చర్చించుకొని నటించాం

కథలో మా పాత్రలు పరిచయం అయ్యాక పెళ్లికి సంబంధించిన పాయింట్ వస్తుంది. ప్రేక్షకులు కథలోకి వెళ్లేందుకు పెద్దగా సమయం పట్టదు. పెళ్లి అనేది ఇద్దరు కలిసి సంతోషంగా జీవించడానికి చేసుకునేది కానీ అమ్మాయిని ఇంట్లో పని మనిషిని చేసేందుకు కాదు అనేది నా క్యారెక్టర్ కీర్తి ఉద్దేశం. వ్యక్తిగతంగా నా ఒపీనియన్ కూడా అదే. అందుకే ట్రైలర్ లో నేను వంట చేస్తే నువ్వు గిన్నెలు కడగాలి అనే డైలాగ్ పెట్టాం. అఖిల్ టాలెంటెడ్ యాక్టర్. అఖిల్ నటనలో ఎమోషనల్ హానెస్టీ ఉంటుంది, ఎమోషన్స్ ఆర్టిఫిషల్ గా అనిపించవు. కళ్లలో స్పార్క్ ఉంటుంది. ఆ క్వాలిటీస్ అన్నీ ఉదయ్ క్యారెక్టర్ కు కావాలి. కీర్తి స్ట్రిక్ట్ క్యారెక్టర్. ఆ పాత్రకు బ్యాలెన్స్ చేస్తూ సపోర్టివ్ గా ఉంటాడు ఉదయ్.

కొన్ని ప్రాజెక్ట్స్ లో మనం చెప్పేందుకు ఏమీ ఉండదు. వాళ్లు ఇచ్చిన క్యారెక్టర్ చేసుకుని వెళ్లిపోతాం. కానీ క్రేజీ కల్యాణం లాంటి సినిమాలకు నా అభిప్రాయాలు చెప్పి, మాట్లాడుకుని చేసే స్పేస్ ఉంది. డైరెక్టర్ బద్రప్పతో నాకు అనిపించిన ఆలోచనలు షేర్ చేసుకున్నాను. అలాగే నరేష్ గారు, అఖిల్, తరుణ్..ఇలా మేమంతా కలిసి డిస్కస్ చేసుకుని నటించాం. సీన్స్ మరింత బెటర్ గా వచ్చేందుకే ఈ ప్రయత్నమంతా చేశాం. ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడాను. యాస కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్స్ చేయలేదుగానీ డైరెక్టర్ చెప్పేదాన్ని అబ్సర్వ్ చేస్తూ డైలాగ్స్ చెప్పాను` అని చెప్పింది.

55
మా పేరెంట్స్ కి సినిమా నచ్చింది
Image Credit : Asianet News

మా పేరెంట్స్ కి సినిమా నచ్చింది

`నరేష్ గారి లాంటి సీనియర్ తో నటించడం ఎప్పుడూ ఇన్స్ పైర్ చేస్తుంటుంది. ఆయనకు నటన మీద ఉన్న ప్యాషన్ నన్ను చాలా ఇన్స్ పైర్ చేసింది. క్రేజీ కల్యాణంతో మేమొక మంచి సినిమా చేశామనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. మా పేరెంట్స్ క్రేజీ కల్యాణం సినిమా చూసి చాలా బాగుందని ప్రశంసించారు. తెలుగు భాష రాకున్నా వాళ్లకు సినిమాలోని ఎమోషన్ కనెక్ట్ అయ్యింది. ప్రేక్షకులకు మా సినిమా వాళ్ల ఇంటి కథలా అనిపిస్తుంది. పండుగ సీజన్ లో ఒక క్రేజీ ఫిలిం చూసిన ఫీల్ మీలో కలుగుతుంది.

నటిగా నేనెప్పుడూ వెర్సటైల్ గా ఉండాలని ప్రయత్నిస్తుంటాను. నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు అనుకోకూడదు. నా క్యారెక్టర్ చూసే సినిమా పేరు చెప్పాలి. అంత ప్రత్యేకంగా సినిమాలు ఉండేలా సెలెక్ట్ చేసుకుంటాను. క్రేజీ కల్యాణంలో కీర్తి పాత్ర కూడా అలా ప్రత్యేకంగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ప్రస్తుతం తమిళంలో, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నాను. అవన్నీ పూర్తిగా దేనికది భిన్నమైన చిత్రాలు` అని చెప్పింది అనుపమా పరమేశ్వర్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Salman Khan: పిల్లల్ని కంటా.. కానీ పెళ్లి చేసుకోను సల్మాన్ ఖాన్ సంచలన కామెంట్స్!
Recommended image2
Jailer 2 Release: జపాన్ నుంచి దుబాయ్ దాకా జైలర్ 2 ఫీవర్.. పూనకాలతో ఊగిపోతున్న రజనీకాంత్ ఫ్యాన్స్
Recommended image3
Jailer 2 Movie Review: జైలర్‌ 2 మూవీ రివ్యూ.. రజనీకాంత్‌ విశ్వరూపం.. బాక్సాఫీసు షేక్‌ అవ్వాల్సిందే
Related Stories
Recommended image1
Ranabaali Target: రణబాలి మూవీ హిట్‌ టార్గెట్‌, విజయ్‌ దేవరకొండ, రష్మిక ఎంత తీసుకున్నారంటే?
Recommended image2
Jailer 2 Movie Review: జైలర్‌ 2 మూవీ రివ్యూ.. రజనీకాంత్‌ విశ్వరూపం.. బాక్సాఫీసు షేక్‌ అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved