MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫోన్ చేసి పిలిచి త్రివిక్రమ్ ముందు కూర్చోబెట్టారు..ఒక్క వారంలోనే దశ తిరిగింది, అనుపమ కామెంట్స్

ఫోన్ చేసి పిలిచి త్రివిక్రమ్ ముందు కూర్చోబెట్టారు..ఒక్క వారంలోనే దశ తిరిగింది, అనుపమ కామెంట్స్

అనుపమ పరమేశ్వరన్ కెరీర్ గురించి చెప్పాలంటే.. టిల్లు స్క్వేర్ చిత్రానికి ముందు తర్వాత అని చెప్పొచ్చు. టిల్లు స్క్వేర్ ముందు హోమ్లీ బ్యూటీ గా అలరించిన అనుపమ ఈ చిత్రంతో ఒక్కసారిగా బోల్డ్ హీరోయిన్ అయిపోయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 14 2024, 06:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అనుపమ పరమేశ్వరన్ కెరీర్ గురించి చెప్పాలంటే.. టిల్లు స్క్వేర్ చిత్రానికి ముందు తర్వాత అని చెప్పొచ్చు. టిల్లు స్క్వేర్ ముందు హోమ్లీ బ్యూటీ గా అలరించిన అనుపమ ఈ చిత్రంతో ఒక్కసారిగా బోల్డ్ హీరోయిన్ అయిపోయింది. టిల్లు స్క్వేర్ చిత్రంలో అనుపమ రొమాన్స్, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

 

26

టాలీవుడ్ లో అనుపమ కెరీర్ నెమ్మదిగా మొదలైంది. ఆమె నటించిన తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. టిల్లు స్క్వేర్ చిత్రం బల్క్ బస్టర్ హిట్ అయ్యాక అనుపమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అసలు టాలీవుడ్ లో కెరీర్ ఎలా మొదలైంది అని యాంకర్ అడగగా ఆ విశేషాలని అనుపమ వివరించింది. 

 

36

తాను బాగా చదువుకోవాలని నాన్న ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని మరీ కాలేజీలో చేర్పించారు. కాలేజీలో చేరిన రెండు నెలలకే ప్రేమమ్ చిత్రంలో అవకాశం వచ్చింది. అసలు ఆ చిత్రంలో చివరకి నా పాత్ర ఉంటోందో లేదో.. ఎడిటింగ్ లో లేపేస్తారేమో అనే అనుమానాలు ఉండేవి. దీనితో ఆఫర్ వచ్చిన విషయం కూడా ఇంట్లో చెప్పలేదు. పోస్టర్ లో నా ఫోటో కనిపించిన తర్వాత నమ్మకం వచ్చింది. అప్పుడు చెప్పా. 

 

46

ఆ మూవీ సక్సెస్ అయింది. ఆ తర్వాత డిగ్రీ చదువుతునప్పుడు సూర్యదేవర నాగవంశీ ఫోన్ చేశారు. ఒకసారి మాట్లాడాలి అన్నారు. నేరుగా తీసుకువెళ్లి నన్ను త్రివిక్రమ్ ముందు కూర్చోబెట్టేశారు. అప్పుడే త్రివిక్రమ్ గారు అ..ఆ చిత్రం గురించి చెప్పారు. అలా టాలీవుడ్ లో నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. 

 

56

ఆ వెంటనే దిల్ రాజు గారు పిలిచి ఓ చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు. అదే వారంలో ప్రేమమ్ తెలుగు వర్షన్ కి కూడా నన్ను ఫైనల్ చేశారు. ఆ విధంగా ఒక్క వారంలోనే టాలీవుడ్ లో నా దశ తిరిగింది. కానీ దిల్ రాజు చిత్రం ఆగిపోయింది. దీనితో దిల్ రాజు నన్ను గుర్తు పెట్టుకుని మళ్ళీ శతమానం భవతిలో ఛాన్స్ ఇచ్చినట్లు అనుపమ గుర్తు చేసుకుంది. 

 

66

అనుపమ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 8 ఏళ్ళు గడుస్తోంది. ఈ కెరీర్ లో అనుపమ కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ చిత్రంతో 100 కోట్ల చిత్రాన్ని ఖాతాలో వేసుకుంది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?
Recommended image2
నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?
Recommended image3
రాజాసాబ్ చేయకుండా తప్పించుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? ప్రభాస్ ను బుక్ చేశారుగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved