MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • అనుష్క నుండి అనసూయ వరకు... వేశ్య పాత్రలు చేసిన డేరింగ్ హీరోయిన్స్ ఎవరో తెలుసా?

అనుష్క నుండి అనసూయ వరకు... వేశ్య పాత్రలు చేసిన డేరింగ్ హీరోయిన్స్ ఎవరో తెలుసా?

అనసూయ, అనుష్క శెట్టితో పాటు కొందరు హీరోయిన్స్ వేశ్య పాత్రలు చేశారు. వీరిలో హోమ్లీ హీరోయిన్స్ కూడా ఉన్నారు. వేశ్య పాత్రలు చేసిన డేరింగ్ హీరోయిన్స్ ఎవరు? సదరు చిత్రాలు ఏమిటో? చూద్దాం...  

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 10 2024, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

కొన్ని పాత్రలు చేయాలంటే ధైర్యం ఉండాలి. ప్రేక్షకులు ఏమనుకున్నా పర్లేదనే తెగువ ఉండాలి. సమాజం తప్పుడు భావనతో చూసే వేశ్య పాత్ర చేయడం అంటే కత్తి మీద సామే.  వేశ్య పాత్రలో భిన్న షేడ్స్ ఉంటాయి. మితిమీరిన శృంగార సన్నివేశాల్లో నటించాల్సి రావచ్చు. తేడా కొడితే మొత్తంగా కెరీరే తిరగబడుతుంది. ఇవేమీ లెక్క చేయని కొందరు హీరోయిన్స్ ఛాలెంజ్ అంగీకరించారు. సాహసోపేతమైన వేశ్య పాత్రలో నటించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అనసూయ విమానం చిత్రంలో వేశ్య పాత్ర చేసింది. వెయ్యి రూపాయలు ఇస్తే ఎవడైనా ఓకే అంటూ బోల్డ్ రోల్ లో రచ్చ చేసింది. అనసూయ పాత్రకు ప్రశంసలు దక్కాయి. 
 

311
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన వేదం క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. అల్లు అర్జున్, మంచు మనోజ్ హీరోలుగా నటించిన ఈ మూవీలో అనుష్క వేశ్య పాత్ర చేసింది. 
 

411

వేశ్యగా నటించిన మరో స్టార్ లేడీ శ్రియా శరన్. కెరీర్ కొంచెం డౌన్ అయ్యాక శ్రియా వేశ్య పాత్ర చేశారు. పవిత్ర టైటిల్ తో తెరకెక్కిన మూవీలో శ్రియ వేశ్యగా నటించారు. 

511

హోమ్లీ హీరోయిన్ స్నేహ వేశ్యగా నటించి ఊహించని షాక్ ఇచ్చారు. 2006లో ధనుష్ హీరోగా విడుదలైన ధూల్ పేట్ మూవీలో స్నేహ వేశ్య పాత్ర చేశారు. 
 

611

దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ జ్యోతిలక్ష్మి. ఛార్మి ప్రధాన పాత్ర చేసింది. ఈ మూవీలో ఛార్మి కెరీర్లో ఫస్ట్ టైం వేశ్యగా కనిపించి అలరించారు. 

711

కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ పంచ తంత్రం. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ వేశ్య పాత్ర చేశారు. 
 

811

స్టార్ కిడ్ శృతి హాసన్ హిందీ మూవీ 'డి డే'లో బోల్డ్ సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చారు. మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ని ఉద్దేశిస్తూ తెరకెక్కిన డి డే మూవీలో శృతి హాసన్ పాకిస్తాన్ కి చెందిన వేశ్యగా నటించారు. 
 

911

బాలయ్య నటించిన భక్తిరస చిత్రం పాండురంగడు. దర్శకుడు కే రాఘవేంద్రరావు బాలయ్య-టబు మధ్య మితిమీరిన శృంగార సన్నివేశాలు తెరకెక్కించారు. ఆ మూవీలో టబు ది వేశ్య పాత్ర. 
 

1011


తెలుగు భామలు అంజలి, బిందు మాధవి వేశ్య పాత్రలు చేశారు. డేర్ మూవీలో అంజలి వేశ్యగా కనిపించారు. బిందు మాధవి సెగ చిత్రంలో వేశ్యగా నటించారు. 

1111

అలనాటి తారలు సైతం ఇలాంటి పాత్రలు చేయడానికి వెనుకాడలేదు. ప్రేమాభిషేకం మూవీలో జయసుధ, మేఘ సందేశం మూవీలో జయప్రద వేశ్య పాత్రలు చేశారు. ఈ రెండు చిత్రాల్లో ఏఎన్నార్ హీరోగా చేశారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
అనుష్క శెట్టి

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Recommended image2
Kiara Advani: ఒకప్పుడు రిజెక్ట్ అయ్యింది.. ఇప్పుడు టాక్సిక్ లో ఇరగ్గొట్టేసిందిగా..
Recommended image3
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved