- Home
- Entertainment
- సూపర్ స్టార్ కృష్ణకి హీరోగా ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా, ఆ సీక్రెట్ బయటపెట్టిన ఏఎన్నార్
సూపర్ స్టార్ కృష్ణకి హీరోగా ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా, ఆ సీక్రెట్ బయటపెట్టిన ఏఎన్నార్
సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. చిత్ర పరిశ్రమలో కృష్ణ ధైర్యానికి మారుపేరుగా నిలిచారు. తెలుగు సినిమాలో అనేక విప్లవాత్మక మార్పులు కృష్ణ వల్లే వచ్చాయి. అయితే కృష్ణకి హీరోగా తొలి అవకాశం ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు అనే ప్రశ్న వెనుక ఆసక్తికర సంఘటన ఉంది.

Krishna, ANR
సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. చిత్ర పరిశ్రమలో కృష్ణ ధైర్యానికి మారుపేరుగా నిలిచారు. తెలుగు సినిమాలో అనేక విప్లవాత్మక మార్పులు కృష్ణ వల్లే వచ్చాయి. కృష్ణ నటుడిగా 1961లో చిత్ర అడుగుపెట్టారు. చిన్న పాత్రల్లో కృష్ణకి అవకాశాలు వచ్చాయి. కానీ హీరోగా మారింది మాత్రం 1965లోనే.
SuperStar Krishna
అయితే కృష్ణకి హీరోగా తొలి అవకాశం ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు అనే ప్రశ్న వెనుక ఆసక్తికర సంఘటన ఉంది. ఈ విషయాన్ని లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు తెలిపారు. తన 90వ జన్మదిన వేడుకలకు సూపర్ స్టార్ కృష్ణ అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంలో ఏఎన్నార్.. కృష్ణకి హీరోగా అవకాశం ఎలా వచ్చింది అనే సీక్రెట్ బయటపెట్టారు.
Super Star Krishna
1964లో ఏఎన్నార్ కొన్ని నెలల పాటు అమెరికాకి వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో ఏఎన్నార్ వరుసగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు. 1964లో కూడా ఏఎన్నార్ తో ఆదుర్తి సుబ్బారావు ఒక చిత్రాన్ని ప్లాన్ చేశారు. కానీ నాకు అమెరికా వెళ్లే పని ఉందని, 5 నెలలు అందుబాటులో ఉండనని ఏఎన్నార్ చెప్పారు.
దీనితో ఆదుర్తి సుబ్బారావు.. ఈ గ్యాప్ లో కొత్త హీరోతో ఒక చిత్రాన్ని ప్లాన్ చేస్తానని చెప్పారట. కొత్త వాళ్ళకి అవకాశం వస్తే మంచిదేకదా.. నేను కూడా ఒకప్పుడు కొత్తవాడినే.. ఇప్పుడు పాతవాడిని అయ్యాను. అలాగే ప్రారంభించండి అని ఏఎన్నార్ చెప్పారట. ఆ నిర్మాణ సంస్థలో సావిత్రి, ఈఎన్నార్ కూడా మెంబర్స్ గా ఉన్నారు. కొత్త హీరో కావాలని ప్రకటన ఇస్తే ఆడిషన్స్ కోసం కొన్ని వందల మంది వచ్చారు.
వారిలో కృష్ణ కూడా ఒకరు. హీరో ఎంపిక ప్రక్రియలో ఏఎన్నార్ కూడా పాల్గొన్నారు. చూడడానికి ఎర్రగా బుర్రగా ఉన్నాడు. హీరోగా పనికొస్తాడు అని ఏఎన్నార్ అన్నారట. అయితే యాక్టింగ్ విషయం అని అడిగితే.. కొత్తవాడు కదా నేర్పిస్తే నేర్చుకుంటాడు అని ఏఎన్నార్ అన్నారు. ఆ విధంగా కృష్ణని తేనె మనసులు చిత్రం కోసం హీరోగా ఎంపిక చేశారు. ఆ చిత్రంలో సంధ్యారాణి హీరోయిన్ గా నటించారు. ఆ సమయంలో కృష్ణ ఇంత పెద్ద సూపర్ స్టార్ అవుతాడని తాను ఊహించలేదని ఏఎన్నార్ అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ తేనె మనసులు అనే టైటిల్ తోనే 1987లో మరో చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో సుహాసిని, జయప్రద హీరోయిన్లుగా నటించారు.