MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • నన్ను చెప్పి మరీ ఎలిమినేట్ చేశారు, పాడుతా తీయగా షోపై మరో సింగర్ బాంబు.. ప్రవస్తికి మద్దతు

నన్ను చెప్పి మరీ ఎలిమినేట్ చేశారు, పాడుతా తీయగా షోపై మరో సింగర్ బాంబు.. ప్రవస్తికి మద్దతు

పాడుతా తీయగా షో వివాదం ఇప్పట్లో తేలేలా లేదు. యువ గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలతో పెద్ద దుమారమే చెలరేగింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు ఎంతో ఆహ్లాదంగా జరిగిన పాడుతా తీయగా షోలో ప్రస్తుతం రాజకీయాలు, కుట్రలు, పక్షపాత ధోరణి కనిపిస్తోంది అంటూ ప్రవస్తి ఆరోపించింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 23 2025, 09:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Singer Neha

Singer Neha

పాడుతా తీయగా షో వివాదం ఇప్పట్లో తేలేలా లేదు. యువ గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలతో పెద్ద దుమారమే చెలరేగింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు ఎంతో ఆహ్లాదంగా జరిగిన పాడుతా తీయగా షోలో ప్రస్తుతం రాజకీయాలు, కుట్రలు, పక్షపాత ధోరణి కనిపిస్తోంది అంటూ ప్రవస్తి ఆరోపించింది. జడ్జీలు కీరవాణి, సునీత, చంద్రబోస్ తమకి ఇష్టమైన వారికి మాత్రమే మంచి మార్కులు ఇస్తున్నారని పేర్కొంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
singer pravasthi aradhya (Rtv)

singer pravasthi aradhya (Rtv)

సునీత తన గురించి ప్రతిసారీ నెగిటివ్ కామెంట్స్ చేస్తారని కూడా ప్రవస్తి ఆరోపించింది. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మంచి పాటలు ఇవ్వడం.. నచ్చని వారికి చెత్త సాంగ్స్ ఇచ్చి బాగా పాడలేదని కామెంట్స్ చేయడం, ఆపై ఎలిమినేట్ చేయడం జరుగుతోంది అని ప్రవస్తి పేర్కొంది. ప్రవస్తి వ్యాఖ్యలకు జ్ఞాపిక నిర్మాణ సంస్థ, సింగర్ సునీత రంగంలోకి దిగి కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. 

35
Singer Sunitha, Pravasthi

Singer Sunitha, Pravasthi

సునీత ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదం ఇక ముగుస్తుంది అనుకుంటే.. పాడుతా తీయగా షోపై మరో గాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సింగర్ పేరు నేహా. ఆమె ప్రవస్తికి మద్దతు తెలిపారు. నేహా మాట్లాడుతూ.. పాడుతా తీయగా షోలో ప్రవస్తి చెప్పిన సంఘటనలు జరుగుతున్నాయి అని అన్నారు. నాకు కూడా ఆ అనుభవం ఎదురైంది. 

45
singer pravasthi aradhya

singer pravasthi aradhya

మేము అడిగిన సాంగ్ ఇవ్వరు. కానీ వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్స్ కి మాత్రం మంచి సాంగ్స్ ఇస్తారు. ఈ సాంగ్ నా వాయిస్ కి సెట్ కాదు మార్చండి అని అడిగినా పట్టించుకోరు. నా వాయిస్ కి సెట్ కాని సాంగ్ ఇస్తే నేను ఎలా పాడాలి అని అడిగా. దీనికి వాళ్ళు ఎలాంటి సమాధానం ఇస్తారంటే.. ఆ సాంగ్ ని మీకు కీరవాణి గారు ఇవ్వమని చెప్పారనో, ఇంకొకరు ఇవ్వమని చెప్పారనో అంటారు. అప్పుడు మేము వెళ్లి కీరవాణి గారిని అడగగలమా అని నేహా తెలిపింది. 

55
Singer Neha

Singer Neha

వాళ్ళు ఇచ్చిన సాంగ్ నిజంగానే నా వాయిస్ కి సెట్ కాలేదు. దీనితో సరిగ్గా పాడలేకపోయా. రేపు నిన్ను ఎలిమినేట్ చేస్తున్నాం అని ముందురోజే నాకు చెప్పారు. చెప్పినట్లుగానే ఎలిమినేట్ అయ్యాను అని నేహా పేర్కొంది. అయితే ప్రవస్తి చెప్పినట్లు ఎక్స్ ఫోజింగ్ చేయమని నన్ను ఎవరూ అడగలేదు.. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎదురుకాలేదు అని నేహా పేర్కొన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసిన వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved