- Home
- Entertainment
- Anni Manchi Sakunamule Review:'అన్నీ మంచి శకునములే' ప్రీమియర్ టాక్.. సంతోష్ ఈసారైనా హిట్ కొట్టాడా
Anni Manchi Sakunamule Review:'అన్నీ మంచి శకునములే' ప్రీమియర్ టాక్.. సంతోష్ ఈసారైనా హిట్ కొట్టాడా
యువ హీరో సంతోష్ శోభన్ నటించిన లేటెస్ట్ మూవీ 'అన్నీ మంచి శకునములే'. ప్రముఖ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. చాలా కాలంగా మంచి ఎదురుచూస్తున్న సంతోష్ శోభన్, యంగ్ బ్యూటీ మాళవిక నాయర్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు.

యువ హీరో సంతోష్ శోభన్ నటించిన లేటెస్ట్ మూవీ 'అన్నీ మంచి శకునములే'. ప్రముఖ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. చాలా కాలంగా మంచి ఎదురుచూస్తున్న సంతోష్ శోభన్, యంగ్ బ్యూటీ మాళవిక నాయర్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కిజె మేయర్ ఈ చిత్రానికి సంగీతదర్శకులు.
ఈ సమ్మర్ కి ఆహ్లాదభరితమైన చిత్రంగా వస్తోంది అంటూ వస్తోంది అంటూ బజ్ సొంతం చేసుకుంది. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, గౌతమి, నరేష్ , తొలిప్రేమ వాసుకి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నేడు ఈ చిత్రం గ్రాండ్ అవుతుండడంతో ఆల్రెడీ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. మరి ఈ చిత్రం సమ్మర్ కి కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అలరిస్తుందా లేదా అనేది చూద్దాం.
ఈ చిత్రం మెటర్నటీ ఆసుపత్రిలో కథ మొదలవుతుంది. నరేష్, రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. కుటుంబాల్లో సంతోష్, మాళవిక స్నేహితులుగా ఉంటారు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. సినిమా బిగినింగ్ ఫన్ మూమెంట్స్ పడ్డాయి. కానీ అలాగే కొన్ని ఎంగేజింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.
అయితే ఇంటర్వెల్ వరకు ఆ టెంపో కొనసాగలేదు. అక్కడక్కడా కొన్ని బోరింగ్ సీన్స్ కూడా పడ్డాయి. నందిని రెడ్డి తన రచన దర్శకత్వంలో తన బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసారు కానీ పూర్తిగా అది 100 శాతం ఫలించలేదు. మల్టిఫ్లెక్స్ ఆడియన్స్ స్టైల్ లో ఈ చిత్రం ఉంటుంది. చిన్న చిన్న ఫన్ డైలాగులు, ఎమోషన్స్ ని హీరో సంతోష్ శోభన్ బాగా క్యారీ చేశాడు.
ఈ చిత్రంలో సన్నివేశాలు సాగుతూ ఉంటాయి కానీ బలమైన కథ కనిపించదు. ఫస్ట్ హాఫ్ మొత్తం యావరేజ్ స్టఫ్ అన్నట్లుగా సాగుతుంది. బిజియం, పాటలు కూడా హైలైట్ కాలేదు. అవి కూడా యావరేజ్. నందిని రెడ్డి అన్నీ మంచి శకునములే అంటూ సింపుల్ ఫ్యామిలీ డ్రామాని ప్రజెంట్ చేయాలనుకున్నారు. అయితే ఆమె రాసుకున్న కథ తడబాటుకు గురైంది.
సంతోష్ శోభన్ కామెడీ టైమింగ్ మాత్రం సూపర్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. మరో పాజిటివ్ అంశం ఈ చిత్రంలో అంత పెద్ద కాస్టింగ్ ని కూడా నందిని రెడ్డి బాగా హ్యాండిల్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా బావుంది అంటూ ప్రీమియర్స్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి.
ఓవరాల్ గా అన్నీ మంచి శకునములే చిత్రం మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ వరకు డీసెంట్ మూవీనే అని అంటున్నారు. కానీ మిగిలిన వారికి యావరేజ్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ చిత్రంలో హై మూమెంట్స్ లేకపోవడం మైనస్. మరి సమ్మర్ లో ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.