- Home
- Entertainment
- Sudigaali Sudheer: హీరోగా ఛాన్సుల కోసం వెళ్లి చేతులు కాల్చుకున్న సుధీర్.. చివరికి కాళ్ళు పట్టుకుని..
Sudigaali Sudheer: హీరోగా ఛాన్సుల కోసం వెళ్లి చేతులు కాల్చుకున్న సుధీర్.. చివరికి కాళ్ళు పట్టుకుని..
జబర్దస్త్ అంటే సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది లాంటి వాళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచ్ లతో వీళ్ళు అదరగొడుతుంటారు.

Sudigali Sudheer
జబర్దస్త్ అంటే సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది లాంటి వాళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచ్ లతో వీళ్ళు అదరగొడుతుంటారు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ స్కిట్ పడిందంటే మిలియన్ల కొద్దీ వ్యూస్ రావలసిందే. తాజాగా సుధీర్, రాంప్రసాద్, ఇమ్మాన్యూల్ ఇతర కమెడియన్లు కలసి చేసిన స్కిట్ వైరల్ గా మారింది.
Sudigali Sudheer
చాలా స్కిట్ లలో సుధీర్ తన రియల్ లైఫ్ లో తానే కామెడీ పంచ్ లు వేసుకుంటుంటారు. ప్రస్తుతం సుధీర్ కి జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ వల్ల హీరోగా ఛాన్సులు కూడా వస్తున్నాయి. దీనిపై ఈ స్కిట్ లో బాగా కామెడీ చేశారు. స్కిట్ లో భాగంగా ఇమ్మాన్యూల్ సుధీర్ కి ఒక లైన్ చెబుతాడు. అది సుధీర్ కి నచ్చదు. దీనితో సుధీరే వాళ్ళకి మరో లైన్ చెబుతాడు.
Sudigali Sudheer
ఈ స్కిట్ చేసే సమయంలో పెర్ఫామెన్స్ నచ్చి పూర్ణ తన బుగ్గ కొరుకుతుంది అని అంటాడు. ఆమె కొరకకపోతే నేనే ఆమె బుగ్గ కొరుకుతా అని సుధీర్ అంటాడు. ఇంతలో రాంప్రసాద్ కి ఫోన్ కాల్ వస్తుంది. తాను రాసిన 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని చెబుతారు. సుధీర్ కి కూడా ఫోన్ వస్తుంది. తాను నటించిన గాలోడు, కాలింగ్ సహస్ర చిత్రాలు పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి అని అంటాడు. దీనితో సుధీర్ పక్కనే ఉన్న వ్యక్తి.. ఊరుకో అన్నా.. టీజరే బాగాలేదు అని బాంబు పేల్చుతాడు.
Sudigali Sudheer
ఇక్కడ ఉంటే లాభం లేదని.. గుర్తింపు దక్కాలంటే ఇండస్ట్రీకి వెళ్లాలని సుధీర్, రాంప్రసాద్ డిసైడ్ అవుతారు. ఒక సంవత్సరం తర్వాత అంతా తారుమారు అవుతుంది. సినిమాల్లో వాళ్ళిద్దరికీ ఒక్క ఛాన్స్ కూడా రాదు. ఇటు జబర్దస్త్ ని కూడా వదిలేయడంతో ఒకరు సోడా బండి, మరొకరు మొక్కజొన్న బండి పెట్టుకుని వీధిన పడతారు.
Sudigali Sudheer
సోడా తాగేందుకు, మొక్కజొన్న తినేందుకు అక్కడికి ఇమ్మాన్యూల్, ఇతర కమెడియన్లు వెళతారు. అక్కడ డిఫెరెంట్ గెటప్స్ లో ఉన్న సుధీర్, రాంప్రసాద్ లని గుర్తు పడతారు. తమబాధని వాళ్లతో చెప్పుకుంటారు.
Sudigali Sudheer
ఈ సంగతి ఎక్కడా చెప్పొద్దు అంటూ సుధీర్, ఆటో రాంప్రసాద్ ఇమ్మాన్యూల్ కాళ్ళు పట్టుకోవడం కొసమెరుపు. కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావు.. ఏ విషయంలో అయినా నువ్వు దొరికిపోయావా అంటూ సుధీర్ పైనే ఇమ్మాన్యూల్ పంచ్ లు వేస్తాడు.