- Home
- Entertainment
- Tripti dimri : ‘నా భర్త ఇలా ఉండాలి’... పెళ్లిపై ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి డిమ్రి క్లారిటీ!
Tripti dimri : ‘నా భర్త ఇలా ఉండాలి’... పెళ్లిపై ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి డిమ్రి క్లారిటీ!
‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి డిమ్రి Tripti Dimri తాజాగా తనకు కాబోయే భర్తపై స్పందించారు. పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్లపై తాజాగా క్లారిటీ ఇచ్చిందీ నేషనల్ క్రష్.. ఇంతకీ రూమర్లు ఎందుకొచ్చాయంటే..

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ యానిమల్ (Animal The Film). ఈ చిత్రంలో రష్మిక మందన్నతో పాటు మరో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి కూడా నటించిన విషయం తెలిసిందే.
రణబీర్ తో బెడ్ సీన్ చేసి ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది. సినిమాలతో తను కొద్దిసేపే ఉన్నా... బోల్డ్ పెర్పామెన్స్ తో ఆకట్టుకుంది. దెబ్బకు ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోయిన్ గా మారిపోయింది.
అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. ఇక తాజాగా త్రిప్తి డిమ్రి పెళ్లి చేసుకోబోతోందంటూ రూమర్లు వ్యాప్తి చెందాయి. దీనిపై తాజాగా క్రేజీ బ్యూటీ త్రిప్తి స్పందించారు. రూమర్లకు చెడ్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు.
‘ఇప్పుడు పెళ్లి గురించి నాకు ఎలాంటి ఆలోచన లేదు. కెరీర్ పైనే ఫోకస్ పెట్టాను. కాబోయే భర్త మాత్రం మంచి వ్యక్తి అయితే చాలు.. నేను అంతే కోరుకుంటున్నాను. మంచితముంటే డబ్బు, పేరు వాటంతటవే వస్తాయి.’ అని చెప్పింది.
ఇక ఈ ముద్దుగుమ్మ కర్నేశ్ శర్మ అనే వ్యక్తితో ప్రేమలో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. నిన్న రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ బర్త్ డే ను కూడా సెలబ్రేట్ చేసింది.
యానిమల్ క్రేజ్ తో త్రిప్తికి అనేక ఆఫర్లు వస్తున్నాయి, ఆమె ఇప్పటికే హిందీలో కొన్ని ప్రాజెక్ట్‌లకు సంతకం చేసిందని తెలుస్తోంది. త్వరలో ఆ చిత్రాలను అధికారికంగా ప్రకటించనున్నారు.