Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Animal : ‘యానిమల్’ ఫస్ట్ హీరోయిన్ రష్మిక కాదు..? బాలీవుడ్ బ్యూటీకి సారీ చెప్పిన సందీప్ వంగా!

Animal : ‘యానిమల్’ ఫస్ట్ హీరోయిన్ రష్మిక కాదు..? బాలీవుడ్ బ్యూటీకి సారీ చెప్పిన సందీప్ వంగా!

‘యానిమల్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. మరోవైపు రన్బీర్, రష్మిక మందన్నల పెర్ఫామెన్స్ కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ను రివీల్ చేశారు. 

Sreeharsha Gopagani | Published : Dec 06 2023, 09:51 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ (Ranbir Kapoor)  - సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)  కాంబోలో ‘యానిమల్’ వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ డ్రామా  Animal The Film డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. తొలిరోజే చిత్రానికి మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. 
 

26
Asianet Image

ముఖ్యంగా ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna)  పెర్ఫామెన్స్ చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంతో బోల్డ్ సీన్లలోనూ మతులు పోగొట్టింది. రన్బీర్ తో కలిసి రొమాన్స్ లో రెచ్చిపోయింది. 
 

36
Asianet Image

రష్మిక మందన్న పేరు నెట్టింట మార్మోగుతోంది. ఆమె పెర్ఫామెన్స్ కు ఆడియెన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ షాకింగ్ న్యూస్ రివీల్ చేశారు. ఈ సినిమా కోసంమొదట రష్మిక మందనన్నను ఎంపిక చేయలేదని బాంబ్ పేల్చారు. ఆ అవకాశం ఫస్ట్ ఎవరికి వచ్చింది? ఎందుకు తప్పించారనేది కూడా చెప్పుకొచ్చారు. 

46
Asianet Image

రీసెంట్ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి ‘యానిమల్’ ఫస్ట్ హీరోయిన్ గురించి మాట్లాడారు. తొలుత బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా (Parineeti Chopra)ను సెలెక్ట్ చేశారంట. సినిమా ప్రారంభానికి ఏడాదిన్నర ముందే  ఆమె కూడా సైన్ చేసిందట. కానీ చివర్లో ఆమెను మార్చాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. 

56
Asianet Image

షూటింగ్ కు 12 రోజుల సమయం ఉండగా ఈ షాకింగ్ డిసీషన్ తీసుకున్నారంట. గీతాంజలి పాత్రలో పరిణితీ ఫిట్ కాకపోవడంతోనే ఆమెకు బదులు రష్మికను ఎంపిక చేశారంట. పరిణితీ ఉత్తమ నటి అయినప్పటికీ పాత్ర తాలుకూ డిమాండ్ మూలంగా మార్చేసినట్టు చెప్పారు.

66
Asianet Image

ఈ సందర్భంగా పరిణితీ ఎంత ఫీల్ అయ్యి ఉంటుందో తెలుసునని, అందుకే ఆమెకు క్షమాపణలు చెప్తున్నానని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద స్టన్నింగ్ కలెక్షన్లను రాబడుతోంది. నాలుగు రోజుల్లో 424.25 కోట్లు సాధించింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేశారు. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
బాలీవుడ్
సందీప్ రెడ్డి వంగా
 
Recommended Stories
Top Stories