దిల్ రాజు బాధలో లేరు, హ్యాపీగానే ఉన్నారు.. ఐటీ రైడ్స్ పై అనిల్ రావిపూడి కామెంట్స్
అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 2025 సంక్రాంతి సీజన్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి విజయఢంకా మోగించింది. వెంకటేష్ కెరీర్ లో తొలి 200 కోట్ల గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది.

అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 2025 సంక్రాంతి సీజన్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి విజయఢంకా మోగించింది. వెంకటేష్ కెరీర్ లో తొలి 200 కోట్ల గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది. ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు సంక్రాంతికి వస్తున్నాం చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ మీడియా సమావేశంలో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, భీమ్స్ పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు దిల్ రాజుపై జరుగుతున్న ఐటీ రైడ్స్ గురించి ప్రశ్నించారు. మీ నిర్మాత దిల్ రాజు గారు బాధలో ఉంటే మీరు మాత్రం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఉన్నారు అని ప్రశ్నించారు. అనిల్ రావిపూడి సమాధానం ఇస్తూ ఆయన బాధలో లేరు. హ్యాపీగానే ఉన్నారు. సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది. కాబట్టి మీరు జనాల్లోకి వెళ్ళండి అయి ఆయనే ప్రోత్సహించినట్లు అనిల్ రావిపూడి తెలిపారు.
Dil Raju
ఇక ఐటీ దాడులు అనేది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. రెండేళ్లకో మూడేళ్లకో జరుగుతూనే ఉంటాయి. ఇండస్ట్రీ ప్రముఖులు, వ్యాపారవేత్తలపై ఐటీ రైడ్స్ జరగడం సహజమే అని అనిల్ రావిపూడి తెలిపారు. సుకుమార్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి కదా మీపై కూడా జరుగుతాయని భావిస్తున్నారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా..అనిల్ రావిపూడి ఫన్నీగా సమాధానం ఇచ్చారు. సుకుమార్ ఇంటి పక్కన మా ఇల్లు లేదు. మా ఇల్లు దూరం. సుకుమార్ ఇంటి పక్కకి త్వరలోనే షిఫ్ట్ అవుతాం. అప్పుడు రైడ్స్ జరుగుతాయేమో అని ఫన్నీగా తెలిపారు.