- Home
- Entertainment
- వెంకటేష్ తో ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.. చంద్రబాబు పగలబడి నవ్వేలా చేశాడు, అతడి ట్యాలెంటే వేరు
వెంకటేష్ తో ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.. చంద్రబాబు పగలబడి నవ్వేలా చేశాడు, అతడి ట్యాలెంటే వేరు
Anil Ravipudi and Chandrababu: ప్రస్తుతం టాలీవుడ్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు మారుమోగుతోంది. సీనియర్ హీరోల చిత్రాలు 200 కోట్ల గ్రాస్ సాధించడమే కష్టం అనుకుంటే ఏకంగా వెంకటేష్ ని హీరోగా పెట్టి 300 కోట్లు రాబట్టాడు ఈ దర్శకుడు.

Venkatesh, Chandrababu
Anil Ravipudi and Chandrababu:ప్రస్తుతం టాలీవుడ్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు మారుమోగుతోంది. సీనియర్ హీరోల చిత్రాలు 200 కోట్ల గ్రాస్ సాధించడమే కష్టం అనుకుంటే ఏకంగా వెంకటేష్ ని హీరోగా పెట్టి 300 కోట్లు రాబట్టాడు ఈ దర్శకుడు. ఇంతవరకు పరాజయమే ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి.
Sankranthiki Vasthunam
సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించగానే అందరూ మంచి చిత్రం అవుతుందని భావించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఒక్కరు కూడా ఈ రేంజ్ వసూళ్లు ఊహించలేదు. దీనితో ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సాధిస్తున్న రికార్డులు చూసి టాలీవుడ్ మొత్తం షాక్ కి గురవుతోంది. అసలు ఆ సినిమా జోనర్ ఏంటి.. ఆ చిత్రం సాధిస్తున్న వసూళ్లు ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం హవా ఎంతలా సాగింది అంటే రీజినల్ చిత్రాల్లో ఇండస్ట్రీ హిట్ అయ్యేంతలా అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇది కంప్లీట్ గా అనిల్ రావిపూడి మ్యాజిక్ అని అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.
Anil Ravipudi
సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా అనిల్ రావిపూడి మరో పని కూడా చేశారు. ఇది కూడా అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేశారు. సీఎం చంద్రబాబు నవ్వడం చాలా రేర్. ఆయన ఎప్పుడూ సీరియస్ గా కనిపిస్తారు. అలాంటి చంద్రబాబుని అనిల్ రావిపూడి పగలబడి నవ్వేలా చేశారు. నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డుకి ఎంపికైన సందర్భంగా నారా భువనేశ్వరి పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి చంద్రబాబు తో పాటు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. బాలయ్యతో సినిమాలు చేసిన దర్శకులు కూడా హాజరయ్యారు. అనిల్ రావిపూడి బాలయ్యతో భగవంత్ కేసరి చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
Venkatesh
అనిల్ రావిపూడి ఈ పార్టీలో మాట్లాడుతూ చంద్రబాబు, నారా భువనేశ్వరి గురించి ఫన్నీ కామెంట్స్ చేశారు. భువనమ్మ గారు ఏవండీ ఒకసారి పైకి రండి అని పిలిస్తే.. చంద్రబాబు గారు సామాన్యుడిలా వచ్చారు. భువనమ్మగారు ఆయనకి కండిషన్ కూడా పెట్టారు.. ఇది రాజకీయ సభ కాదు కేవలం 5 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి అని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను, డైరెక్టర్ బాబీ అనుకున్నాం.. ఈ ఈవెంట్ కి మనం మన భార్యలతో రాలేదు సేఫ్ అని లేకుంటే.. మాకు చంద్రబాబు గారిని ఉదాహరణగా చూపించేవారు అని అనిల్ రావిపూడి ఫన్నీ కామెంట్స్ చేశారు.