Guppedantha Manasu: గౌతమ్ గురించి ఆరా తీస్తున్న ఏంజెల్.. విశ్వనాథం కోరికకి షాకైన వసుధార, రిషి?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకులు హృదయాలని గెలుచుకుంటుంది. మనస్ఫూర్తిగా ప్రేమించుకొని అనుకోని కారణాలవల్ల విడిపోయిన ఇద్దరు ప్రేమికుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో రిషి చావు బతుకుల్లో ఉంటే తను విశ్వనాథం కలిసి రక్షించిన సంగతి చెప్తుంది ఏంజెల్. ఏంజెల్ చెప్పింది విని ఎమోషనల్ అవుతారు జగతి, వసుధార. చాలా పెద్ద సాయం చేశావు థాంక్యూ అంటూ కన్నీరు పెట్టుకుంటుంది జగతి. వసుధార అయితే ఏంజెల్ ని హగ్ చేసుకుని కృతజ్ఞతలు తెలుపుతుంది. తన గురించి చెప్తే మీ ఇద్దరు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు నాకు అంతా ఆయోమయంగా ఉంది అంటుంది ఏంజెల్.
నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు తన వాళ్ళందరూ నీకెప్పుడూ రుణపడి ఉంటారు అంటుంది జగతి. మరోవైపు గదిలో ఏదో ఆలోచిస్తూ ఉన్న కొడుకు దగ్గరికి వస్తాడు మహేంద్ర. ఈ పూటకి నీ దగ్గరే పడుకుంటాను అని రిక్వెస్ట్ చేస్తాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు మనం ఎప్పుడూ కలిసి ఉండాలి అనుకునే వాళ్లని కానీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే అందుకు కారణం శిష్యులే కదా అంటాడు. మహేంద్ర అంతగా రిక్వెస్ట్ చేయడంతో కాదని లేక తన పక్కన పడుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు రిషి.
అందుకు ఆనందించిన మహేంద్ర నిజం తెలిసినా రిషి కి చెప్పలేక బాధపడతాడు. బాగా ఎమోషనల్ అయ్యి రిషి ని హత్తుకుంటాడు. ఎలాగైనా నీకు నిజం తెలిసేలాగా చేసి నిన్ను ఇంటికి తీసుకువెళ్లాలని అనుకుంటాడు మహేంద్ర. ఇదంతా అనుకోకుండా చూస్తుంది ఏంజెల్. నిజంగానే వీళ్లిద్దరూ ఆత్మీయుల లేక ఏదైనా బంధం ఉందా అని మనసులో అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నేరుగా విశ్వనాథం దగ్గరికి వెళ్లి అదే డౌట్ ని అడుగుతుంది.
వాళ్ళిద్దరి మధ్య ఏ బంధమో లేకపోతే సార్ మేడం గదిలో పడుకోవాలి కానీ రిషి గదిలో ఎందుకు పడుకుంటారు అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ ఆత్మీయులు అంటున్నారు కదా అందుకే అలా చేశారేమో అంటాడు విశ్వనాథం. అంతలోనే అక్కడికి వచ్చిన వసుధార ఏంజెల్ కి అనుమానం వచ్చినట్లుగా ఉంది ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకొని రిషి సార్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయనతో గడపాలని అనుకుంటారు.
మహేంద్ర సార్ కూడా అలాగే అనుకుంటున్నారేమో అంతకుమించి మరి ఏమి అయి ఉండదు అంటుంది వసుధార. నిజమే నేను అంత దూరం ఆలోచించ లేకపోయాను అంటుంది ఏంజెల్. మీరు మేడం వాళ్ళకి ఇచ్చేసావు కదా అందుకే నువ్వు నా రూమ్ లో పడుకో అని వసుధారకి చెప్తుంది ఏంజెల్. ఆ తర్వాత గదిలో ఏదో ఆలోచిస్తున్న వసుధార దగ్గరికి వచ్చి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు మాటలు కలుపుతుంది ఏంజెల్. రిషి గురించిన ప్రస్తావన రావటంతో తను ముందు నుంచి మూడిగానే ఉండేవాడు.
నేను, గౌతమ్,రిషి బెస్ట్ ఫ్రెండ్స్. నాతో కూడా ఫ్రీగా మాట్లాడేవాడు కాదు ఒక్క గౌతమ్ తోనే మాట్లాడేవాడు. రిషి గురించి గౌతమ్ కి తెలిసే ఉంటుంది కానీ గౌతమ్ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర లేదు అంటుంది ఏంజెల్. మహేంద్ర సర్ వాళ్ళు ఆత్మీయులు అంటున్నారు కదా సార్ వాళ్ళని అడుగుతాను అంటుంది. మహేంద్ర సర్ నిజం చెప్పేస్తారు ఏమో అని కంగారుపడిన వసుధార అలా చేస్తే చాటుగా తన గురించి ఎంక్వయిరీ చేసినందుకు రిషి సార్ బాధపడతారు అంటుంది.
నిజమే ఎంక్వయిరీ చేయనులే అంటుంది ఏంజెల్. సరే నీ గురించి చెప్పు నువ్వు ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటుంది ఏంజెల్. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. మంచి టైం కి వచ్చావు మంచి లవ్ టాపిక్ నడుస్తుంది అంటుంది ఏంజెల్. అలాంటి టాపిక్స్ నాకు ఇష్టం లేదు అంటాడు రిషి. ఇంతకీ నీకు గౌతమ్ ఎక్కడ ఉన్నాడో తెలుసా అతని ఫోన్ నెంబర్ ఉందా అని అడుగుతుంది ఏంజెల్. ఆ మాటకి షాకైన రిషి వసుధార వైపు చూస్తాడు. ఏం అడిగినా ఎందుకు తనువైపు చూస్తావు ఏదో మీ ఇద్దరి మధ్య పెద్ద అండర్స్టాండింగ్ ఉన్నట్టు అంటుంది ఏంజెల్.
అలాంటిదేమీ లేదు అయినా గౌతమ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అంటాడు రిషి. సీన్ కట్ చేస్తే కాలేజీలో మీటింగ్ ఏర్పాటు చేసిన విశ్వనాథం మిషన్ ఎడ్యుకేషన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే రిషి వాళ్ళు కూడా వస్తారు. మిషన్ ఎడ్యుకేషన్ మీ ఇద్దరినీ టేకప్ చేయమని మహేంద్ర సార్ వాళ్లు అడుగుతున్నారు అని చెప్తాడు విశ్వనాథం. ఒక్కసారిగా షాక్ అవుతారు రిషి, వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.