MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాజల్‌ చేసిన పనికి అనీ మాస్టర్ ఫ్రస్టేషన్‌.. అంతా షాక్‌‌.. లోబో ముందు రెస్ట్ రూమ్‌లో సన్నీ, మానస్‌ భావోద్వేగం

కాజల్‌ చేసిన పనికి అనీ మాస్టర్ ఫ్రస్టేషన్‌.. అంతా షాక్‌‌.. లోబో ముందు రెస్ట్ రూమ్‌లో సన్నీ, మానస్‌ భావోద్వేగం

బిగ్‌బాస్‌5 తెలుగు శుక్రవారం ఎపిసోడ్‌ అనేక ఎమోషన్స్ మేళవింపుగా సాగింది. ఫస్ట్ టైమ్‌ సన్నీ, మానస్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు కాజల్‌పై ఉన్న కోపాన్ని అనీ మాస్టర్‌ తట్టుకోలేకపోయారు. తన ముఖంపైనే మూడు గ్లాసుల నీళ్లు కొట్టుకున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 09 2021, 12:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ మిశ్రమ స్పందనని రాబట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా అదే మిశ్రమ ఫీలింగ్స్ తో సాగింది. ప్రారంభం నిన్నటి వాటర్‌ ట్యాంక్‌ ఎపిసోడ్‌ కొనసాగింది. ఇందులో కెప్టెన్సీ పోటీలో యాంకర్‌ రవి, ప్రియా, అనీ మాస్టర్‌, శ్వేత ఉన్నారు. తమకి కేటాయించిన వాటర్‌ ట్యాంకుల నుంచి నీళ్లు పోకుండా అడ్డుపెట్టుకోవడంలో యాంకర్ రవి, ప్రియా సక్సెస్‌ అయ్యారు. అనీ మాస్టర్‌, శ్వేతలకు మిగిలిన సభ్యుల మద్దతు లేకపోవడంతో  మధ్యలోనే చేతులెత్తేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బిగ్‌బాస్‌ కేటాయించిన టైమ్‌లో ఇందులో ప్రియా ట్యాంక్‌లో వాటర్‌ ఎక్కువగా ఉండటంతో నెక్ట్స్ వారానికి కెప్టెన్ గా ప్రియా ఎంపికయ్యారు. దీంతో ప్రస్తుత కెప్టెన్‌ శ్రీరామచంద్ర తన కెప్టెన్సీ బ్యాడ్జ్ ని ప్రియా చేతికి కట్టారు. అయితే ఓ వైపు ప్రియా ఆనందంలో మునిగి తేలుతుంటే మరోవైపు సన్నీ, మానస్‌ రెస్ట్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టుకోవడం ఇంట్రెస్ట్‌గా మారింది. తాను గెలవలేనప్పుడు ఫ్రెండ్‌ కోసం సహాయం చేయడం కూడా ఫ్రెండ్‌షిప్‌ అని చెప్పిన డైలాగ్‌కి ఆనీ మాస్టర్‌ ఎమోషన్‌ అయ్యింది. సన్నీపై మండి పడింది.

36

మరోవైపు ఈ టాస్క్ లో తనకు నచ్చని వారి నుంచి వాటర్‌ని తీసేయలేకపోయానని, తనకి నచ్చిన వారికి హెల్ప్ చేయలేకపోయానని రెస్ట్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా ఎమోషన్స్ తో ఆడుకోవడం ఏంట్రా అంటూ విలపించాడు సన్నీ. సన్నీ లాగే మానస్‌ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము ఏం చేయలేకపోయిన స్థితి పట్ల వాళ్లు భావోద్వేగానికి గురి కాగా, లోబో, అలాగే విశ్వ వారిని ఓదార్చారు. దిగాలుగా ఉన్న మాసన్‌ కోసం స్పెషల్‌గా ఫుడ్‌ వండుకొని తెచ్చింది ప్రియాంక. కానీ దాన్ని ఆయన తిరస్కరించారు. తనకు ఇంకా ఏం తేకు, తన కోసం ఏం చేయోద్దన్నారు. దీంతో ప్రియాంక సైతం కన్నీళ్లు పెట్టుకుంది. 

46

ఇంట్లో ఏనాడు వంటలు చేయని, ఇంట్లో పనులు చేయని షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ 5 హౌజ్‌లో మాత్రం అన్ని పనులు చేయాల్సి వచ్చిందంట. కిచెన్‌లో చపాతి చేస్తూ తన ఇళ్లుని గుర్తు చేసుకుంటూ తనపైనే తాను సెటైర్లు వేసుకున్నాడు షణ్ముఖ్‌. దీనికి సిరి సైతం మాట కలిపి సరదాగా మార్చింది. ఎప్పటిలాగే షణ్ముఖ్‌, సిరి, జెస్సీ ఇతర సభ్యులతో కలవడం లేదు. ముగ్గురు ఓ గ్రూపుగానే ఉంటున్నారు. 

56

ఇంతలో వరస్ట్ పర్ ఫెర్మెర్‌ని ఎంచుకొని దోషిగా నిలబెట్టాలని బిగ్‌బాస్‌ ఆదేశించారు. ఒక్కోక్కరు బోనులో తలపెట్టించి వారు చేసిన తప్పులను చెప్పి ముఖంపై నీళ్లు కొట్టాల్సి ఉంటుంది. ఇందులో చాలా వరకు కాజల్‌ పేరుని దోషిగా తేల్చారు. స్వేత, హమీద, శ్రీరామ్‌, అనీ మాస్టర్‌, లోబో, రవి, విశ్వ ఇలా ఏడుగురు కాజల్‌ని దోషిగా తేల్చారు. అయితే అనీ మాస్టర్‌ మాత్రం తీవ్రంగా మండిపడింది. ఆమె ఫేక్‌గా ఆడుతుందని, ఆమెతో కలవాలని కోరుకుంటున్నప్పటికీ తన నుంచి పాజిటివ్‌ వైబ్స్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాజల్‌పై ఉన్న కోపం ఇది అంటూ మూడు గ్లాసుల నీళ్లని తన ముఖంపైనే కొట్టుకుంది అనీ మాస్టర్‌.

66

మొత్తంగా మెజారిటీగా కాజల్‌ని దోషిగా తేల్చడంతో ఆమెని జైల్లో పెట్టి తాళం వేశారు. జైల్లోకి వెళ్లిన కాజల్‌ సింపతికి ట్రై చేసింది. ఎమోషనల్‌ అయ్యింది. తనని అందరు టార్గెట్‌ చేయడంపై ఆవేదన వ్యక్తం చేయగా, జెస్సీ, షణ్ముఖ్‌, సిరీ ఓదార్చే ప్రయత్నం చేశారు. మరోవైపు చివర్లో సెంచరీ మాట్రెస్‌ బెడ్స్ కి సంబంధించి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టాడు. ఏ, బీ టీములు ఆ సెంచరీ మాట్రెస్‌పై ఎక్కువ సేపు మోచేతులపై పడుకుని ఉండాల్సి ఉంటుంది. ఇందులో `ఏ` టీమ్‌ ఎక్కువ సేపు ఉండి, విన్నర్‌గా నిలిచారు. సెంచరీ మాట్రెస్‌ గిఫ్ట్ లను అందుకున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Recommended image2
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image3
CM Vijay: కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్ కి హాజరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved