- Home
- Entertainment
- చేయిపట్టుకుని లాగి.. డ్రెస్ విప్పమన్నాడు.. డైరెక్టర్ పై యాంకర్ వర్షిణి కామెంట్స్ వైరల్
చేయిపట్టుకుని లాగి.. డ్రెస్ విప్పమన్నాడు.. డైరెక్టర్ పై యాంకర్ వర్షిణి కామెంట్స్ వైరల్
కాస్టింగ్ కౌచ్ పై బ్లాస్టింగ్ కామెంట్స్ చేసింది యాంకర్ వర్షిణి. తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని వెల్లడించిన ఈబ్యూటీ.. ఓ డైరెక్టర్ తనపై చేయి వేయబోయిన విషయం వెల్లడించింది. ఇంతకీ ఆమె ఏమన్నదంటే..?

Varshini Sounderajan
టాలీవుడ్ బుల్లితెరపై ఎంతో మంది యాకర్లు పాపులర్ అయ్యారు. అలాంటివారిలో పాపులర్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది వర్షిణి. చిన్నా చితకా ప్రోగ్రామ్స్ చేసుకునే వర్షిణికి ఢీ షో మంచి క్రేజ్ ను తీసుకువచ్చింది అని చెప్పాలి. ఈ ఢీ షోతో హాటెస్ట్ యాంకర్ గా బుల్లితెరపై వర్షిణి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
అంతే కాదు.. బుల్లితెరపై అవకాశాలకోసం.. సోషల్ మీడియాలో వర్షిణీ చేసే హాట్ ఫోటోషూట్లకు కుర్రాళ్ళ మతులు పోవడంతో పాటు..ఆమెకు ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగింది. పొట్టి బట్టల్లో.. అందాలతో మెస్మరైజ్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది బ్యూటీ. అటు వెండితెర అవకాశాల కోసం ఎదురుచూస్తూ.. అద్భుతం చేస్తుంటుంది. నెటిజన్లను తన అందాల జడిలో ముంచి తేల్చుతుంటుంది.
Varshini Sounderajan
అటు సోషల్ మీడియాలో.. ఇటు బుల్లితెరపై వర్షిణి అందాలకు ఫిదా అవ్వని కుర్రాళ్లు ఉండరేమో అనిపిస్తుంటుంది. అటువంటిది ఆమె వెండితెర ప్రయత్నాలతో పాటు.. వెబ్ సిరీస్ లలో కూడా నటించడానికి ప్రయత్నిస్తుంటుంది. అవకాశాలు వెతుక్కుంటూ.. ఆడిషన్స్ కు కూడా వెళ్తుంటుంది. అటువంటి టైమ్ లో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకుంది బ్యూటీ.
Varshini Sounderajan
బుల్లితెరపై బాగా పాపులర్ అయిన వర్షిణి తాజాగా ఓ ఇంటర్వ్యూ కు హాజరై కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వివరించింది. తను అనుభవించిన బాధను వివరించే ప్రయత్నం చేసింది. ఆమె మాట్లాడుతూ.. నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలనే... లాక్ డౌన్ కు ముందు తనకు ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చింది.. ఒక డైరెక్టర్ అడిషన్స్ కోసం హోటల్‌కు రమ్మని అంటే వెళ్లాను.. ఆడిషన్ అయిపోయిన తరువాత అంతా సూపర్ అని అన్నారు.
Varshini Sounderajan
వెంటనే ఆ దర్శకుడు నువ్వు బాగున్నావు.. ఈ వెబ్ సిరీస్ కు బాగా సూట్ అవుతావు అని చెప్పడంతో ఇకఅందులో నటించవచ్చు అనుకున్నాను. కాని ఆతరువాత అతను తనతో పాటు గదిలోకి రమ్మని.. అక్కడ నా చేయి పట్టుకుని బెడ్ పైకి లాగే ప్రయత్నం చేశాడు. నా డ్రెస్ విప్పమని అడిగాడు.. అని షాకింత్ కామెంట్స్ చేసింది వర్షిణి.
నేను వెంటనే భయపడి.. అతన్ని విడిపించుకుని.. బయటకు వచ్చేశాను.. జరిగింది తలుచుకుని చాలాసేపు ఏడ్చాను.. నా జీవితంలో అది చీకటి రోజు.. నా జీవితంలో ఎదురైన.. అతి భయంకరమైన చేదు అనుభవం అంటే ఇదొక్కటే అంటూ వర్షిణి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వర్షిణి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.