Anchor Udaya Bhanu Re entry: : ఫామ్ లోకి వచ్చిన యాంకర్ .. రీ ఎంట్రీతో రచ్చ...
యాంకర్ ఉదయ భాను రీ ఎంట్రీతో రచ్చ చేస్తుంది. తెలుగులో ఫస్ట్ స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగి .. కనుమరుగైన భాను.. ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఒకప్పుడు తెలుగులో స్టార్ యాంకర్ అంటే ఉదయ భాను మాత్రమే కనిపించేది. ఆమెకనిపిస్తే చాలు కుర్ర కారు ఉర్రూతలూగేవారు. అప్పట్లోనే హాట్ హాట్ గా స్పైసీ గా డ్రెస్ లు వేసుకుంటూ యాంకరింగ్ చేసి.. షోస్ ను తన ఇమేజ్ తో సక్సెస్ చేసేది ఉదయ భాను. ఇప్పుడంటే మనం స్టార్ యాంకర్ గా సుమను ఆకాశానికి ఎత్తుతున్నాం కాని.. ఒకప్పుడు బుల్లి తెరను ఏలియన మహారాణి మాత్రం ఉదయభానునే. స్మాల్ స్క్రీన్ కు గ్లామర్ షో అద్దిన ఉదయ భాను కోసమే షోలను చూసేవారు అంటే ఆమె ఎంత పాపులారిటీ సంపాధించుకుందో తెలుస్తుంది.
రాను రాను కెరీర్ లో ఒడిదుడుకులు. ఫ్యామిలీ ప్రోబ్లమ్స్.. పెళ్ళి.. పిల్లలు.. ఇలా రకరకాల కారణాలతో కెరీర్ కు దూరమయ్యింది ఉదయభాను. చాలా కాలం స్క్రీన్ కు దూరంగా ఉన్న ఈస్టార్ యాంకర్.. ఇఫ్పుడిప్పుడే మళ్లీ కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ చేసింది. ఆఫర్ల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది ఉదయ భాను.
ఒకప్పుడు ఉదయ భానుకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేవి కాని ఇప్పుడు ఆమె అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తోంది. వచ్చిన అవకాశాలతో సర్ధుకుపోతోంది. ఈమధ్య స్క్రీన్ మీద ఆమె ఎక్కువగానే కనిపిస్తోంది. చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటూ.. పెద్ద ప్రోగ్రామ్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంది.
ఈ మధ్య మళ్లీ చిన్న చిన్న ఈవెంట్స్ లో కనిపిస్తుంది ఉదయభాను. కానీ గుర్తు పెట్టుకునే ఈవెంట్ ఒక్కటి కూడా చేయలేదు. ఇలాంటి సమయంలో మొన్న రిలీజైన బాలయ్య అఖండ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ టీమ్‌తో కూడా స్పెషల్ చిట్‌చాట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది.
ఇక తిరుపతిలో జరిగిన పుష్ప సినిమా సక్సెస్ మీట్ కూడా ఉదయభాను యాంకరింగ్ చేసింది. వయస్సు పెరిగినా క్రేజ్ మాత్రం తగ్గదు అని ఈమె స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ప్రేక్షకుల అరుపులు చూస్తే అర్థమవుతుంది. 50 ఏళ్లకు రెండు అడుగులు దూరంలో ఉన్న ఉదయ భాను మళ్ళీ స్క్రీన్ పై స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోగలదా లేదా చూడాలి.