బాంబు పేల్చిన సుమ, యాంకరింగ్ కి దూరం కాబోతోందా.. కంటతడి పెట్టుకుంటూ..
పండుగలు, ప్రత్యేక సందర్భాలు ఏమొచ్చినా జబర్దస్త్ టీం, బుల్లితెర నటులు స్పెషల్ ఈవెంట్స్ తో రెడీ అయిపోతారు. త్వరలో న్యూ ఇయర్ సందర్భంగా వీరంతా అదిరిపోయే స్పెషల్ ఈవెంట్ తో వచ్చేస్తున్నారు.
పండుగలు, ప్రత్యేక సందర్భాలు ఏమొచ్చినా జబర్దస్త్ టీం, బుల్లితెర నటులు స్పెషల్ ఈవెంట్స్ తో రెడీ అయిపోతారు. త్వరలో న్యూ ఇయర్ సందర్భంగా వీరంతా అదిరిపోయే స్పెషల్ ఈవెంట్ తో వచ్చేస్తున్నారు. ఈ ఈవెంట్ పేరు 'వేర్ ఈజ్ ది పార్టీ'. సుమ ఈ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. క్యాష్ షోలో ఇలా మార్చి న్యూ ఇయర్ కోసం ముస్తాబు చేశారు. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ , నరేష్, కొత్త జంట యాదమ్మ రాజు -స్టెల్లా, ఇతర బుల్లితెర నటీనటులు ఈ షోలో సందడి చేశారు.
మౌన పోరాటం టివి సీరియల్ లో నటిస్తున్న సీనియర్ హీరోయిన్ యమున కూడా హాజరయ్యారు. న్యూ ఇయర్ సంబరాల్లో భాగంగా డిసెంబర్ 31న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో ఆసక్తిని పెంచేస్తోంది. సుమ ఎప్పటిలాగే కామెడీ పంచ్ లు వేస్తూ హుషారెత్తించేలా యాంకరింగ్ చేస్తోంది.
మా మౌన పోరాటం లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చెప్పండి అని యమున.. సుమని అడిగింది. దీనితో నేను కూడా మౌన పోరాటం అని సుమ చెప్పడంతో నవ్వులు విరిశాయి. సుమ, హైపర్ ఆది మధ్య జరిగే సంభాషణ హాస్యం పండిస్తోంది. బిగ్ బాస్ విశ్వ తన భార్యతో కలసి అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.
యాదమ్మరాజు, స్టెల్లా వివాహంపై హైపర్ ఆది వేసిన సెటైర్లు వేశాడు. యాదమ్మ రాజు కోటు ధరించి తన భార్యతో హాజరయ్యాడు. పెళ్ళిలో కూడా ఇదే కోటు వేసుకున్నావు కదా.. ఈ కోటు వేసుకుని పెళ్ళిలో నిలబడి ఉంటే నిన్నే ఎవరో కూల్ డ్రింక్స్ అడిగారు అంట కదా అని హైపర్ ఆది అడిగాడు.. దీనితో అందరి ముఖాల్లో నవ్వులు కనిపించాయి.
కిమ్, డోనాల్డ్ ట్రంప్ గెటప్పులో చేసిన స్కిట్ ఆకట్టుకునేలా ఉంది. అలాగే అదిరిపోయే మ్యాజిక్ షో కూడా ఆకట్టుకుంది. మ్యాజిక్ షోలో అబ్బురపరిచే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇక చివర్లో బుల్లితెర నటీనటులు, జబర్దస్త్ టీం యాంకర్ సుమని సన్మానించడం విశేషం.
ఈ సందర్భంగా సుమ మరోసారి తన జీవితాన్ని గుర్తు చేసుకుంది. మలయాళీగా పుట్టిన నేను ఇక్కడ ఈ స్థాయికి చేరుకున్నాను అంటే కేవలం తెలుగువారి అభిమానం, ప్రేమ వల్లే అని సుమ తెలిపింది. మీ ప్రేమాభిమానాలు లేకపోతే నేను లేను అంటూ సుమ ఎమోషనల్ అయింది. కానీ కొంత విరామం తీసుకోవాలని అనుకుంటున్నాను అంటూ బాంబు పేల్చింది. కంటతడి పెట్టుకుంటూ ఈ బాంబుల లాంటి వార్తని చెప్పింది.
దీనితో సుమ యాంకరింగ్ కి దూరం కాబోతోందా అనే అనుమానాలు మొదలయ్యాయి. సుమ దశాబ్దానికి పైగా నిర్విరామంగా సినిమా ఈవెంట్స్, బుల్లితెర షోలకు యాంకరింగ్ చేస్తూనే ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో వేడుకలు, సక్సెస్ మీట్స్ అంటే ఎక్కువగా కనిపించేది సుమనే. దీనితో అలసిపోయి కాస్త విరామం కోరుకుంటోందా అనేది తెలియాల్సి ఉంది. డిసెంబర్ 31న ప్రసారం కానున్న ఈ షోలో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.