తనలో ఎన్నడూ చూడని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తున్న యాంకర్ సుమ!
యాంకర్ సుమ సైతం గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా తనలోని కొత్త కోణం ఆవిష్కరిస్తున్నారు. సుమ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Suma Kanakala
సుమ కనకాల సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి తనలోని తెలియని కోణం పరిచయం చేస్తుంది. తాజాగా వైట్ డిజైనర్ వేర్లో అరిపించింది. ఇక ఫ్యాన్స్ మీరు అద్భుతంగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Suma Kanakala
యాంకర్ గా బుల్లితెర మీద సుం చెరగని ముద్ర వేశారు. ఆమె ఘన చరిత్ర ఎవరు అందుకోలేనిది. ఆమె సై అంటే నిర్మాతలు పలు షోలను ఆమె సారథ్యంలో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఏళ్ళ తరబడి ఒకే పని చేయడంతో బోర్ కొట్టిందేమో కానీ సుమ షోలు తగ్గించింది. ప్రస్తుతం సుమ అడ్డా, అమ్మ ఆవకాయ్ వంటి రెండు షోలు మాత్రమే చేసింది.
Suma Kanakala
1996లో నటిగా సుమ ప్రస్థానం మొదలైంది. దాసరి దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. మరో రెండు మూడు మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. బ్రేక్ రాలేదు. దీంతో యాంకర్ అవతారం ఎత్తారు. తిరుగులేని ఆధిపత్యం సాధించారు.
Suma Kanakala
గత పాతికేళ్లుగా సుమ స్టార్ యాంకర్ హోదాలో కొనసాగుతున్నారు. సుమ షోలో ఉన్నారంటే వినోదం పరుగులు పెడుతుంది. ఆమె టైమింగ్ పంచ్లు షోకి హైలెట్ గా నిలుస్తాయి. అందుకే దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం సాగుతుంది. నాలుగైదు భాషలు సుమ అనర్గళంగా మాట్లాడుతుంది.
సుమ రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవ ఆమె రాజీవ్ కనకాలతో విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ విడివిడిగా ఉంటున్న నేపథ్యంలో మనస్పర్థలు తలెత్తాయంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను రాజీవ్ కనకాల ఖండించారు. ఇక సుమకు ఓ అబ్బాయి, అమ్మాయి సంతానం. అబ్బాయిని హీరో చేసే ప్రయత్నాల్లో ఆమె ఉన్నారు.