MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ మధ్య మరోసారి చిచ్చు పెట్టిన యాంకర్ సుమ.. ఈ సారి రాజమౌళిని గట్టిగా ఇరికించేసిందిగా..!

ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ మధ్య మరోసారి చిచ్చు పెట్టిన యాంకర్ సుమ.. ఈ సారి రాజమౌళిని గట్టిగా ఇరికించేసిందిగా..!

`ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటించిన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనేది ప్రారంభం నుంచి అందరిని వెంటాడుతున్న, చర్చనీయాంశంగా మారిన ప్రశ్న. తాజాగా ఇదే ప్రశ్న రాజమౌళికి ఎదురైతే. అవును జక్కన్నని గట్టిగా ఇరికించింది యాంకర్‌ సుమ. మరి రాజమౌళి ఏం చెప్పాడంటే..  

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 06 2022, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
RRR Movie

RRR Movie

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. సుమారు 1200కోట్లు వసూలు చేసిందీ చిత్రం. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ ల అద్భుతమైన నటన, డాన్సులతో అదరగొట్టారు. దీనికితోడు కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, యాక్షన్‌ సన్నివేశాలు వెరసి సినిమాకి తిరుగులేని విజయాన్ని అందించాయి. ఈ సినిమా రిలీజ్‌ అయిన ఆరు నెలలవుతున్నా, అంతర్జాతీయంగా దీనిపై ఇంకా చర్చ జరుగుతుండటం విశేషం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అంతేకాదు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్‌ మేకర్స్, యాక్టర్స్ సైతం వారి నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అయితే అంతర్జాతీయంగా ఎన్టీఆర్‌కి ప్రశంసలు దక్కుతుండటం విశేషం. ఆయనకు ఆస్కార్‌ అవార్డు పక్కా అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మొన్న క్యాష్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న అన్నపూర్ణమ్మ సైతం సుమ అడిగిన ప్రశ్నకి `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఎన్టీఆర్‌ నటనే తనకు బాగా నచ్చిందని చెప్పింది. 

37

తాజాగా రాజమౌళికి పెద్ద షాకిచ్చింది యాంకర్‌ సుమ. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లో ఎవరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకి ఎక్కడ.. ఏం జరిగిందంటే.. `బ్రహ్మాస్త్ర` యూనిట్‌ `క్యాష్‌` షోలో పాల్గొంది. హీరోహీరోయిన్లు రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌తోపాటు తెలుగులో ప్రజెంట్‌ చేస్తున్న రాజమౌళి సైతం క్యాష్‌ షోలో పాల్గొన్నారు. 

47

తాజాగా ఈ షో ప్రోమో విడుదలైంది. ఇప్పటి వరకు తన ఏ సినిమాకి క్యాష్‌ ప్రోగ్రామ్‌కి రాని రాజమౌళి ఈ షోకి రావడం నమ్మలేకపోతున్నానని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది యాంకర్‌ సుమ. ఇందులో రణ్‌బీర్‌, అలియాభట్‌, రాజమౌళి లతో ఓ రేంజ్‌లో ఆడుకుంది. తనదైన స్టయిల్‌లో పంచ్‌లతో రెచ్చిపోయింది. ఈ షో ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. కానీ చివర్లో మాత్రం రాజమౌళికి సుమ పెద్ద షాకివ్వడం విశేషం.

57

ఇందులో `ఆర్‌ఆర్‌ఆర్‌` ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లలో ఎవరు బాగా యాక్ట్ చేశారని మీరు అనుకుంటున్నారని స్టేజ్‌ పైనే, అందరి ముందు జక్కన్నని ప్రశ్నించింది సుమ. దీంతో ఒక్కసారిగా రాజమౌళి ముఖం మారిపోయింది. ప్రోమో అంతటితోనే కట్‌ చేశారు. మరి జక్కన్న ఏం చెప్పబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శనివారం ప్రసారం కాబోయే పూర్తి షోలో రాజమౌళి స్పందన తెలిసే అవకాశం ఉంది. 
 

67

అయితే `క్యాష్‌` షో వేదికగా రాజమౌళిని గట్టిగా ఇరికించింది సుమ. ఆయన ఎలా స్పందిస్తారనే దానికోసం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ ఆసక్తికరంగా వెయిట్‌ చేస్తున్నారు. అదే సమయంలో మరోసారి ఇద్దరి హీరోల అభిమానుల మధ్య పెద్ద చిచ్చే పెట్టింది సుమ. ఇప్పటికే సినిమా విడుదలైనప్పట్నుంచి మా హీరో బాగా చేశాడంటే మా హీరో బాగా చేశాడని, డాన్సులు, ఎక్స్ ప్రెషన్స్ తో సహా ట్రోల్స్ చేసుకున్నారు తారక్‌, చరణ్‌ ఫ్యాన్స్. ఒకానొక దశలో వీరి మధ్య పెద్ద సోషల్‌ మీడియా వారే జరిగింది. 

77

అంతేకాదు మా హీరోకి నేషనల్‌ అవార్డు పక్కా అంటే, మా హీరోకి నేషనల్‌ అవార్డు పక్కా అంటూ పోస్టులు పెడుతూ దుమారం రేపారు. ఇద్దరి అభిమానులు తమ ఈగోకి పోయి ఇతర హీరోలపై అక్కసు వెళ్లగక్కారు. కానీ నెమ్మదిగా ఫ్యాన్స్ కూడా సైలెంట్‌ అయిపోయారు. ఇప్పుడు దీనిపై డిస్కషన్‌ ఆగిపోయింది. అంతా మర్చిపోయారనకునే సమయంలో సుమ ఇప్పుడు మరోసారి దాన్ని కదిలించి ఫ్యాన్స్ మధ్య మరోసారి చిచ్చు పెట్టిందని అంటున్నారు నెటిజన్లు. మరి ఈ చిచ్చు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, ఇద్దరి అభిమానులు  ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved