రాహుల్ సిప్లిగంజ్ నవ్వు, కేరింగ్ బాగుంటాయట.. బిగ్‌బాస్3 విన్నర్‌కి యాంకర్ సుజాత కూడా పడిపోయిందా?
బిగ్‌బాస్3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌కి బిగ్‌బాస్ 4 ఫేమ్, యాంకర్ సుజాత పడిపోయింది. తాజాగా ఫ్యాన్స్ తో ఛాట్‌లో ఆయన గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది సుజాత. చూడబోతే పడిపోయినట్టే ఉంది.
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్‌లో సింగర్‌గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్3 విన్నర్‌గా నిలవడంతో మరింతగా పాపులారిటీని పొందాడు.
ఇదీ కాదని, అందులో నటి పునర్నవి భూపాలంతో ప్రేమ వ్యవహారాలు నడిపించి మరింత ఫేమస్ అయ్యాడు. వీరిద్దరు బయట కూడా చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఇద్దరు ఘాటు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి.
అంతగా రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి బిగ్‌బాస్ 3 షో తర్వాత కూడా తిరిగారు. హాట్ టాపిక్‌గా మారారు. కానీ ఇటీవల పునర్నవి.. రాహుల్ హ్యాండిచ్చినట్టు తెలుస్తుంది.
ఎందుకంటే రాహుల్.. ఆ మధ్య మరో బిగ్‌బాస్3 భామ, జూ. సమంత ఆషురెడ్డితో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. పలు ఇంటర్వ్యూల్లోనూ ఇద్దరూ ఒకరిపై ఒకరి ఇంట్రెస్ట్ ని కేరింగ్, వారి మధ్య ఉన్న రిలేషన్‌ని తెలిపారు.
బయటకు చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ప్రస్తుతం ఆషురెడ్డితో రాహుల్ డేటింగ్‌లో ఉన్నారని ఇప్పటికీ వార్తలొస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా రాహుల్‌కి పడిపోయిన వారి జాబితాలో యాంకర్ సుజాత పేరు కూడా వినిపిస్తుంది. తాజాగా సుజాత ఫ్యాన్స్ తో ముచ్చటించింది. వాళ్లడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పింది.
మమ్మల్ని పెళ్ళి చేసుకుంటావా అంటూ ప్రపోజల్స్ కూడా వచ్చాయని తన స్టైల్లో సమాధానం చెప్పింది సుజాత. లాస్య, నోయల్, రాహుల్ సిప్లిగంజ్ గురించి కూడా సుజాతను ప్రశ్నించారు. లాస్య నా బంగారు కోడిపెట్ట అని, నోయల్‌ను `శంకర్ దాదా ఎంబీబీఎస్` అంటూ సంబోధించారు.
ఇక చివరిగా రాహుల్ గురించి చెబుతూ, రాహుల్ నవ్వు చాలా బాగుంటుందని చెప్పింది. అంతేకాదు ఆయన మాట్లాడటం మరింత బాగుంటుందట. ఆయన మాటలు ఆకట్టుకుంటాయని చెప్పింది. దీంతోపాటు ఆయనకు కేరింగ్ అంటే చాలా ఎక్కువని చెప్పుకొచ్చింది.
రాహుల్ గురించి స్పెషల్‌గా మెన్షన్ చేయడం, పైగా ఆయన గురించి అంతగా చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పునర్నవి, ఆషురెడ్డి లాగా సుజాత కూడా పడిపోయిందా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు, సెటైర్లు కురిపిస్తున్నారు. మరి దీనిపై సుజాత ఎలా స్పందిస్తుందో చూడాలి.
బిగ్‌బాస్4 సీజన్‌లో పాల్గొని సందడి చేసింది సుజాత. తెలంగాణ యాసలో అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు నాగార్జునని బిట్టు అని పిలిచి పలు వివాదాలకు నెలవైంది. దీంతోపాటు ప్రతిదానికీ నవ్వడం, పైగా ఫేక్ నవ్వు అంటూ విమర్శలెదుర్కొంది.