MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీముఖి ఇన్నాళ్లు తాను పెళ్లి చేసుకోకపోవడానికి రహస్యం బయట పెడుతూ షాక్‌.. అందరి ముందు గాలితీసిన ఫైమా

శ్రీముఖి ఇన్నాళ్లు తాను పెళ్లి చేసుకోకపోవడానికి రహస్యం బయట పెడుతూ షాక్‌.. అందరి ముందు గాలితీసిన ఫైమా

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ముడున్నర దశాబ్దాల వయసుకు చేరుకున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆ ఊసే లేదు. తాజాగా పెద్ద రహస్యం బయటపెట్టింది. పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదో ఓపెన అయ్యిందీ హాట్‌ యాంకర్.  

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 09 2023, 08:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

శ్రీముఖి ప్రస్తుతం తెలుగు టీవీ రంగంలో అత్యంత బిజీ యాంకర్‌గా రాణిస్తుంది. ఒకప్పుడు సుమ అయితే ఇప్పుడు శ్రీముఖి అనేలా గుర్తింపు తెచ్చుకుంది. తనదైన చలాకీతనంతో, కొంటెతనంతో, చురుకుతనంతో, స్పాంటినిటీ, డామినేటింగ్‌ పర్సనాలిటీతో అలరిస్తుంది. బుల్లితెర ఆడియెన్స్ ని అలరిస్తుంది. మరోవైపు హాట్‌ హాట్‌ అందాలను వేడి వేడిగా వడ్డిస్తూ సోషల్‌ మీడియాలో యమ క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది శ్రీముఖి. 
 

28

భారీ అందాల భామ శ్రీముఖి.. ఇప్పుడు ఓ పెద్ద రహస్యాన్ని బయటపెట్టింది. వయసు పరంగా మూడు పదులు దాటి నాలుగు పదుల్లోకి అడుగుపెడుతున్న శ్రీముఖి ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడూ పెళ్లి ఊసే ఎత్తలేదు. అప్పుడప్పుడు లవర్‌ ఉన్నాడంటూ చెబుతుంది. కానీ తాను సింగిల్‌గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఏజ్‌ ముదురుతున్నా ఇంకా పెళ్లి ఊసెత్తని శ్రీముఖి.. తాజాగా పెద్ద సీక్రెట్‌ బయటపెట్టింది. ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో చెప్పింది. తాను యాంకర్‌గా చేస్తున్న `స్టార్‌ మా పరివార్‌` షోలో వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.

38

ఆదివారం ప్రసారమయ్యే ఈ షోలో ప్రోమోలో `మొగుడ్స్ వర్సెస్‌ పెళ్లామ్స్` అనే షోలో టీవీ ఆర్టిస్టులు అర్జున్‌, చెర్రీ, హరి, రిషి, యాష్‌, పార్థు, వారి భార్యలు పాల్గొన్నారు. భార్యా భర్తల మధ్య పోటీ, ఎవరు గొప్ప అనే పోటీలు నిర్వహించారు. ఆద్యంతం నవ్వులు పూయించేలా ఈ షో సాగింది. అదే సమయంలో తమ భార్యలతో ఎలాంటి కిరికిరి ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తన పెళ్లి మ్యాటర్‌ ఓపెన్‌ అయ్యింది శ్రీముఖి. పక్కనే ఉన్న ఫైమాతో రహస్యాన్ని బయటపెట్టింది. 

48

గెస్ట్ లుగా వచ్చిన వారంతా భార్యలతో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా చూసిన శ్రీముఖి.. నేను పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా, పెళ్లైతే ఇన్ని ఉంటాయని చేసుకోవడం లేదు అర్థమైందా నీకు అంటూ ఫైమాతో చెప్పింది శ్రీముఖి. దీంతో వెంటనే ఫైమా అందుకుంది. అందరి ముందు శ్రీముఖి గాలి తీసింది. నేనింకా.. నీకు ఎవరు రావడం లేదేమో అనుకుంటున్నా అంటూ ముఖం మీదే చెప్పేసింది. దీంతో శ్రీముఖి ముఖం మాడిపోయింది. షోలో ఇది ఆద్యంతం నవ్వులు పూయించింది. 
 

58

`జులాయి` చిత్రంతో నటిగా కెరీర్‌ని ప్రారంభించింది శ్రీముఖి. అందులో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత వరుసగా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వస్తుంది. కానీ బ్రేక్‌ దక్కలేదు. `ప్రేమ ఇష్క్ కాదల్‌` చిత్రంతో హీరోయిన్‌గానూ మారిపోయింది. ఆ తర్వాత తమిళం, కన్నడలోనూ సినిమాలు చేసింది. `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌`, `నేను శైలజ`, `సావిత్రి`, `జెంటిల్‌మ్యాన్‌`, `మనలో ఒకడు`, `బాబు బాగా బిజీ`, `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` చిత్రాల్లో నటించింది.చిన్న చిన్న పాత్రలతో మెరిసింది. ఫర్వాలేదనిపించింది. 

68

ఈ క్రమంలో `క్రేజీ అంకుల్స్` లో ఫీమేల్ లీడ్‌గా చేసింది. గ్లామర్‌ బ్యూటీగా అలరించింది. స్వీటీ పాత్రలో నవ్వులు పూయించడంతోపాటు గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అయ్యింది. అంకుల్స్ కి హీటు పుట్టిస్తూ రచ్చ రచ్చ చేసింది. ఈ సినిమా పోయింది కానీ, శ్రీముఖికి మాత్రం బాగా పాపులర్‌ అయ్యింది. ఆ తర్వాత `మ్యాస్ట్రో` చిత్రంలో ఇన్నోసెంట్‌ ఇల్లాలుగా ఆకట్టుకుంది. నవ్వులు పూయించింది. 
 

78

ఇప్పుడు `భోళాశంకర్‌` చిత్రంలో చిరంజీవితో కలిసి నటిస్తుంది. ఓ కీలక పాత్ర, నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలో కనిపించబోతుంది శ్రీముఖి. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్‌ అయి తన పాత్ర బాగా పేలితే సినిమాల్లో బిజీ నటిగా మారిపోతానని కలలు కంటోందీ బొద్దుగుమ్మ. మరి చిరంజీవి అయినా ఈ బుల్లితెర రాములమ్మకి బ్రేక్‌ ఇస్తాడేమో చూడాలి. 
 

88

`అదుర్స్` షోతో యాంకర్‌గా మారిన శ్రీముఖి అప్పట్నుంచి అలరిస్తూనే ఉంది. చాలా ఇంప్రూవ్‌ అయ్యింది. వరుసగా షోస్‌ చేసుకుంటూ వస్తుంది. `పటాస్‌` ఆమెకి మంచి గుర్తింపు తెచ్చింది. `సూపర్‌ సింగర్స్` సింగింగ్‌ షో, అలాగే `బిగ్‌ బాస్‌ 3`, `బొమ్మ అదిరింది` షోకి యాంకర్‌గా, ఇటీవల `కామెడీ స్టార్స్`, `సరిగమప` సింగింగ్‌, `డాన్సు ఐకాన్‌`, `ఆదివారం స్టార్‌ మా పరివారం`, `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌`, `సారంగ దరియా` వంటి షోస్‌కి యాంకర్‌గా చేస్తూ రాణిస్తుంది. బుల్లితెరపై రచ్చ రచ్చ చేస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: బాలకృష్ణ నటించిన ఆ మూవీని పవన్ కళ్యాణ్ 100 సార్లు చూశారట.. ఇంతకీ అదేంటంటే.?
Recommended image2
Bollywood Holi: ఈ 7గురు స్టార్స్‌కి హోలీ నచ్చదట! ఒకరి కారణం కన్నీళ్లు పెట్టిస్తుంది
Recommended image3
Yogi Babu: చనిపోయిన డైరెక్టర్ కూతురికి స్టార్ కమెడియన్ సాయం..రియల్ హీరో అంటూ ప్రశంసల వెల్లువ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved