MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • ఆ లేడీ యాంకర్‌ నాపై చేతబడి చేయించింది.. ఫ్యూజులు ఎగిరిపోయే విషయాలు బయటపెట్టిన యాంకర్‌ రవి

ఆ లేడీ యాంకర్‌ నాపై చేతబడి చేయించింది.. ఫ్యూజులు ఎగిరిపోయే విషయాలు బయటపెట్టిన యాంకర్‌ రవి

యాంకర్‌ రవి ఒకప్పుడు బుల్లితెర యాంకర్‌గా రాణించారు. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు బిజీ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఓ లేడీ యాంకర్‌ చేతబడి చేయించిందన్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 07 2025, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్టార్‌ యాంకర్‌గా బుల్లితెరని ఊపేసిన యాంకర్‌ రవి
Image Credit : Youtube print shot/Social post tv

స్టార్‌ యాంకర్‌గా బుల్లితెరని ఊపేసిన యాంకర్‌ రవి

యాంకర్‌ రవి ఒకప్పుడు స్టార్‌ యాంకర్‌గా రాణించారు. లాస్యతో కలిసి ఆయన చేసిన టీవీ షోస్‌ మంచి ఆదరణ పొందాయి. వందల ఎపిసోడ్లు నడిచాయి. బుల్లితెర ఆడియెన్స్ ని ఆద్యంతం ఆకట్టుకున్నాయి. అదే సమయంలో వీరు హోస్ట్ గా చేసిన షోస్‌ అత్యధిక రేటింగ్‌ సాధించాయి. యాంకర్లుగా లాస్య, రవిలకు మంచి క్రేజ్‌, ఇమేజ్‌ ఏర్పడింది. వీరి మధ్య కెమిస్ట్రీ కూడా అంతే బాగా పండింది. `సంథింగ్‌ స్పెషల్‌`, `పటాస్‌`, `ఆడాళ్ల మజాకా`, `ఆడాళ్లు మీకు జోహార్లు` వంటి షోస్‌ వీరి కాంబినేషన్‌లోనే వచ్చిన విషయం తెలిసిందే.

DID YOU
KNOW
?
యాంకర్‌ రవి హీరోగా తోటబావి
బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా రాణించిన యాంకర్‌ రవి.. హీరోగా మారి `తోటబావి` అనే సినిమాలో నటించారు. ఇది ఆరేళ్ల క్రితం విడుదలైంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
లాస్యతో యాంకర్‌ రవి గొడవ కారణం ఇదేనా?
Image Credit : our own

లాస్యతో యాంకర్‌ రవి గొడవ కారణం ఇదేనా?

కానీ ఏం జరిగిందో ఏమో ఇద్దరు విడిపోయారు. ఒకరిపై ఒకరు దారుణమైన ఆరోపణలు చేశారు. యాంకర్‌ రవి తన వెంటపడ్డాడని, తాను ఒప్పుకుంటే తన భార్యని కూడా వదిలేసేందుకు రెడీ అయ్యాడని, తనపై ఒత్తిడి తెచ్చాడని లాస్య ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో వీరి మధ్య గొడవ తారాస్థాయికి వెళ్లింది. ఆ తర్వాత కొంతకాలం ఇద్దరూ సైలెంట్‌ అయ్యారు. మళ్లీ ఇప్పుడు కలిసిపోయారు. తమ మధ్య కేవలం ఈగో సమస్యలే అని ఒప్పుకున్నారు. ఇప్పుడు లాస్య తనతో బాగానే ఉందని చెప్పారు యాంకర్‌ రవి.

Related Articles

Related image1
అనసూయ, రష్మీ మధ్య గొడవలు? జబర్దస్త్ స్టేజ్ పై బయటపడ్డ నిజాలు, ఎమోషనల్ గా ఏడ్చేసిన స్టార్ యాంకర్లు
Related image2
Renu Desai: రేణు దేశాయ్‌ `బ్యాడ్‌ గాళ్స్`తో కమ్‌ బ్యాక్‌.. అమ్మాయిలను అమ్మోరులా పెంచాలి
36
లాస్య, నేను ఇప్పుడు మళ్లీ కలిసిపోయాంః రవి
Image Credit : Youtube print shot/Social post tv

లాస్య, నేను ఇప్పుడు మళ్లీ కలిసిపోయాంః రవి

``ఓ షోలో ఇద్దరు యాంకర్లు ఉన్నారంటే.. ఆ షో పెద్ద హిట్ అయ్యిందంటే.. నా వల్ల, కాదు నా వల్లే అనే క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తుంటాయి. మా మధ్య కూడా అలాంటివే వచ్చాయి. ఈగో ఇష్యూస్ వల్ల మేం కొన్నేళ్లు మాట్లాడుకోలేదు. అవన్నీ చిన్న పిల్లల గొడవలు. ఇప్పుడు మళ్లీ కలిసిపోయాం. మళ్లీ మమ్మల్ని స్టార్ మానే పిలిచింది. ఇద్దరం కలిసి స్టార్ మాలోనే షోలు చేశాం. ఇప్పుడంతా కూల్` అని వెల్లడించారు యాంకర్‌ రవి. తమ మధ్య ఇప్పుడు ఏ గొడవ లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. 

46
ఆ యాంకర్‌ చేతబడి చేయించింది
Image Credit : Youtube print shot/Social post tv

ఆ యాంకర్‌ చేతబడి చేయించింది

అదే సమయంలో ఓ షాకింగ్‌ విషయాన్ని ఆయన బయటపెట్టారు. సోషల్‌ పోస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మతిపోయే విషయాన్ని వెల్లడించారు. ఓ యాంకర్‌ తనపై చేతబడి చేయించిందన్నారు రవి. తాను ఇండస్ట్రీలోకి వచ్చే ముందే అన్ని రకాలుగానూ ప్రిపేర్‌ అయి వచ్చానని తెలిపారు రవి. పేరు, గుర్తింపు వస్తుందంటే, వాటితోపాటే ఇంకా చాలా వస్తుంటాయని, చాలా జరుగుతుంటాయి, వాటన్నింటిని తట్టుకోవాలనేది ఫిక్స్ అయ్యే వచ్చినట్టు చెప్పారు రవి. ఇక్కడే మరో అసలు విషయాన్ని ఓపెన్‌గా చెప్పారు. తమ బ్యాచ్‌లోనే ఓ యాంకర్‌ తనపై పూజలు చేయించిందన్నారు.

56
నేను నాశనం కావాలని ఆ యాంకర్‌ కోరుకుంది
Image Credit : Youtube print shot/Social post tv

నేను నాశనం కావాలని ఆ యాంకర్‌ కోరుకుంది

`మా బ్యాచ్‌లోనే ఒక యాంకర్‌ నాపై పూజలు చేయించింది. అవి కూడా మామూలు పూజలు కాదు. లేటెస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న స్వామి దగ్గరకు వెళ్లి ఆ పూజలు చేయించింది. చేతబడి అంటారు కదా అలాంటిదే. నేను నాశనం అయిపోవాలని ఆ పూజలు చేయించింది. నాకు ఆ విషయం తర్వాత సాలిడ్‌ సోర్స్ ద్వారా తెలిసింది. నేనూ స్వయంగా చూశాను. అలాంటి క్షుద్ర పూజల్ని నేను నమ్మను కాబట్టి పెద్దగా భయపడలేదు` అని వెల్లడించారు యాంకర్‌ రవి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

66
రవి ఆరోపణలు చేసిన ఆ లేడీ యాంకర్‌ వీరిలో ఎవరు?
Image Credit : Youtube print shot/Social post tv

రవి ఆరోపణలు చేసిన ఆ లేడీ యాంకర్‌ వీరిలో ఎవరు?

మరి యాంకర్‌ రవిపై చేతబడి చేయించిన ఆ లేడీ యాంకర్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం యాంకరింగ్‌లో సుమతోపాటు ప్రదీప్‌, అనసూయ, రష్మి గౌతమ్‌, శ్రీముఖి, సుడిగాలి సుధీర్‌, నందు, లాస్య యాంకర్లుగా రాణిస్తున్నారు. బుల్లితెరపై యాక్టీవ్‌గా ఉన్నది వీరే. మరి వీరిలో ఒకరా? లేక వీరు కాకుండా మరో లేడీ యాంకరా? అనేది క్లారిటీ లేదు. రవి మాత్రం ఆ యాంకర్‌ పేరుని ప్రస్తావించలేదు. ప్రస్తుతం రవి కామెంట్స్ బుల్లితెరపై, ఇండస్ట్రీలోనూ పెద్ద దుమారం రేపుతున్నాయి. అయితే స్వామిజీ మాత్రం వేణు స్వామినే అని అంతా ఫిక్స్ అవుతున్నారు. ఇందులో నిజం ఏంటనేది యాంకర్‌ రవికే తెలియాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రియాలిటీ కార్యక్రమాలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image2
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image3
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Related Stories
Recommended image1
అనసూయ, రష్మీ మధ్య గొడవలు? జబర్దస్త్ స్టేజ్ పై బయటపడ్డ నిజాలు, ఎమోషనల్ గా ఏడ్చేసిన స్టార్ యాంకర్లు
Recommended image2
Renu Desai: రేణు దేశాయ్‌ `బ్యాడ్‌ గాళ్స్`తో కమ్‌ బ్యాక్‌.. అమ్మాయిలను అమ్మోరులా పెంచాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved