రేణు దేశాయ్‌ మళ్లీ కమ్ బ్యాక్‌ అవుతుంది. తాజాగా ఆమె `బ్యాడ్‌ గాళ్స్` చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. నలుగురు అమ్మాయిల కథని తెలియజేసేలా ఈ మూవీ ఉండబోతుందట. 

DID YOU
KNOW
?
రేణు దేశాయ్‌ తొలి మూవీ
రేణు దేశాయ్‌ తెలుగులోకి `బద్రి` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ హీరో కావడం విశేషం.

రేణు దేశాయ్‌ నటిగా కమ్‌ బ్యాక్‌

రేణు దేశాయ్‌ సినిమాలు మానేసి చాలా కాలమే అయ్యింది. చాలా గ్యాప్‌తో ఆమె రవితేజ హీరోగా వచ్చిన `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. కాసేపే కనిపించినా ఆకట్టుకుంది. ఈ సినిమా ఆడకపోవడంతో రేణు దేశాయ్‌ పాత్ర ఇంపాక్ట్ పెద్దగా లేదు. మళ్లీ కొంత గ్యాప్‌తో ఇప్పుడు కమ్‌ బ్యాక్‌ అవుతుందట. `బ్యాడ్‌ గాళ్స్` చిత్రంలో ఆమె నటించబోతుందని తెలుస్తుంది. తాజాగా `బ్యాడ్‌ గాళ్స్` డైరెక్టర్‌ మున్నా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో రేణు దేశాయ్‌ గెస్ట్ రోల్‌లో కనిపించబోతుందని సమాచారం.

`30 రోజుల్లో ప్రేమించడం ఎలా` డైరెక్టర్‌ మున్నా రూపొందిస్తున్న `బ్యాడ్‌ గాళ్స్`

 ఈ సినిమా విశేషాలు చూస్తే, `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి ఇప్పుడు `బ్యాడ్ గాళ్స్` పేరుతో సినిమాని తెరకెక్కిస్తున్నారు. . దీనికి `కానీ చాలా మంచోళ్లు’` అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ మోషన్ పోస్టర్‌ను ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్‌మీట్‌లో దర్శకులు చందూ మొండేటి, శివ నిర్వాణ, కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొని రివీల్ చేశారు.

మున్నా కష్టానికి తగిన ఫలితం రావాలి

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కృష్ణచైతన్య మాట్లాడుతూ..`మున్నా చాలా సరదాగా ఉంటాడు. చాలా కొద్ది మంది దర్శకులే కొత్తవాళ్లని పెట్టుకుని సినిమా చేస్తారు. నా మిత్రుడు మున్నా కష్టానికి తగిన ఫలితం రావాలి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. చంద్రబోస్ పేరు ఉంటే చాలు. మొయిన్ 15 ఏళ్ల క్రితమే హీరో అవుతా అని చెప్పాడు. డైరెక్టర్ పవన్‌కి అప్పగించి నటుడిని చేశా. అక్కడి నుంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాడు. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్` అని అన్నారు.

నలుగురు కొత్త అమ్మాయిలతో సినిమా అంటే సాహసమే

శివ నిర్వాణ మాట్లాడుతూ, `నలుగురు కొత్త అమ్మాయిలను పెట్టి సినిమా చేయడం నిజంగా సాహసమే. ఇంత యంగ్ టాలెంట్‌తో కాన్సెప్ట్ ఫిల్మ్‌ను తీస్తున్న మున్నా ముక్కుసూటి మనిషి. ఈ సినిమా అతడికి మంచి విజయాన్ని అందిస్తుంది. నిర్మాతలందరికీ మంచి డబ్బులు రావాలి. ఈ సినిమాకు రెండు మెయిన్ పిల్లర్స్ అనూప్, చంద్రబోస్ గారు. నీలి నీలి ఆకాశం ఎంతగానో వైరల్ అయింది. అలాంటి పాట ఈ సినిమాలో కూడా ఒకటి ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి` అని తెలిపారు.

అనూప్‌ రూబెన్స్ నాకు చేయందించాడు..

డైరెక్టర్ మున్నా మాట్లాడుతూ, ``బాహుబలి`లో బిడ్డను కాపాడే చేయిలా నాకు చేయందించింది మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం చంద్రబోస్, అనూప్. చంద్రబోస్ రాలేకపోయారు. ఆ పాట పేరుతోనే నేను బ్యానర్ పెట్టుకున్నా. నేను ఎప్పుడు సినిమాలు చేసినా వీళ్లిద్దరితోనే చేస్తా. మా కాంబినేషన్‌లో మళ్లీ అలాంటి పాట రాబోతోంది. 10 రోజుల్లో సాంగ్ రిలీజ్ చేస్తాం. అదొక మంచి ప్రీవెడ్డింగ్ సాంగ్ అవుతుంది. నాలైఫ్‌లో అనూప్ ఇంకొక మంచి గిఫ్ట్ ఇచ్చారు. 

లిఫ్ట్ అడిగితే చార్మినార్‌ తీసుకెళ్లి టీ తాగించింది

ఈ స్టోరీకి ఎంతోమంది అమ్మాయిల కథలు స్ఫూర్తినిచ్చాయి. నేను ఒకరోజు ఉదయం 4 గంటలకు హైదరాబాద్‌లో రోడ్డుపై లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక అమ్మాయి బండి ఆపి చార్మినర్ దగ్గరకు వెళ్లి చాయ్ తాగుదామా అని అడిగింది. తను పెళ్లి తర్వాత ఫ్రీడం ఉండదని అలా లాస్ట్ రోజు ఎంజాయ్ చేయడానికి వచ్చానని చెప్పింది. అమ్మాయిలకు పెళ్లి ముందు ఉండే ఫ్రీడం పెళ్లి తర్వాత ఉండదు. అలాంటి చాలా మంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశా. ఈ కథను ఐదారుగురు పెద్ద నిర్మాతలకు చెప్పాను. కొత్త అమ్మాయిలతో మార్కెట్ అవుతుందా అని అడిగారు. అందుకే నేను, నా క్లాస్‌మేట్స్ డబ్బులు పెట్టి ఈ సినిమా తీశాం. 

అమ్మాయిలను అమ్మోరులా పెంచాలనే చెప్పే కథ

బాగా చదువుకున్నవాళ్ల కథ ఇది. అమ్మాయిలను పేరెంట్స్ భయంతో పెంచుతాం. అమ్మాయిలను భయంతో కాదు ధైర్యంతో పెంచాలి అని చెప్పే కథ ఇది. అమ్మాయిలను అమ్మోరులా పెంచాలి. స్కూల్లో అమ్మాయిలను తమను తాము కాపాడుకునే సెల్ఫ్ డిఫెన్స్ ఒక సబ్జెక్ట్‌లా పెట్టాలి. మా మూవీ టీమ్ నుంచి అన్ని రాష్ట్రాల సీఎంలకు, కేంద్రప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ బ్యానర్ పెట్టడానికి కారణం డైరెక్టర్ మారుతి గారు. వాళ్ల స్ఫూర్తితోనే బ్యానర్ పెట్టాం. ట్రైలర్, సాంగ్స్ నచ్చితేనే మా సినిమా చూడండి. నీలినీలి ఆకాశంలాంటి సాంగ్ ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబుకు ఈ కథ చెబితే ఇది చిన్న సినిమా కాదు చాలా మంచి సినిమా అవుతుందని ప్రోత్సహించాడు. సుకుమార్ కి టైటిల్ చెబితే అదిరిపోయిందన్నారు. ఈ నలుగురు అమ్మాయిలను లైఫ్‌లో మర్చిపోలేను. రేణూ దేశాయ్ ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. నెక్ట్స్ ఈవెంట్స్‌లో ఆమె పాల్గొంటారు. అందరికీ థ్యాంక్యూ` అని అన్నారు.