రష్మిని గర్ల్ ఫ్రెండ్‌గా ప్రకటించిన బుల్లెట్ భాస్కర్.. సుధీర్ ఎవడంటూ సంచలన వ్యాఖ్యలు.. ఇదెక్కడి షాక్!
యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ లవ్‌స్టోరీ నడుస్తున్న విసయం తెలిసిందే. కానీ పెద్ద బాంబ్ పెల్చాడు బుల్లెట్ భాస్కర్. రష్మి కి సంబంధించి పెద్ద సీక్రెట్ బయటపెట్టాడు.
photo credit-ETV Balagam Promo
టీవీ షోస్‌లో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి లవ్ కపుల్‌గా ప్రచారం పొందుతున్నారు. ఈ ఇద్దరి జోడీకి చాలా క్రేజ్ ఉంది. స్టేజ్‌లపై డ్యూయెట్లు పాడుతూ అలరించారు. అయితే గతేడాది నుంచి ఈ ఇద్దరికి గ్యాప్ వచ్చింది. సుధీర్ జబర్దస్త్ ని వదిలేయడంతో రష్మికి, ఆయనకు దూరం పెరిగింది. కానీ ఎప్పుడు ఆ ప్రస్తావన వచ్చినా తన మనసులో తన మనసులో ఆయనది ప్రత్యేక స్థానం అని ఆమె, తాము మంచిస్నేహితులమని సుధీర్ చెబుతూ వచ్చారు.
ప్రస్తుతం సుడిగాలి సుధీర్.. హీరోగా బిజీ అయ్యాడు. ఆయన నటించిన `కాలింగ్ సహాస్ర` మూవీ విడుదలకు రెడీ అవుతుంది. మరో రెండు సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇక రష్మి `జబర్దస్త్` యాంకర్‌గా రాణిస్తుంది. దీంతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా చేస్తుంది. ఎవరికి వాళ్లు తమ ప్రాజెక్ట్ లతో బిజీ ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా బుల్లట్ భాస్కర్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. పెద్ద చర్చనీయాంశం అవుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న బుల్లెట్ భాస్కర్ లవ్ స్టోరీస్ ఉన్నాయా? అని యాంకర్ అడగ్గా.. అందరి ముందు స్టేజ్‌పైనే యాంకర్ రష్మి తన గర్ల్ ఫ్రెండ్ అని ప్రకటించారు. దీంతో అంతా షాక్ అయ్యారు. రష్మి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
రష్మి సుధీర్‌తో ప్రేమలో ఉందని, మరి సుధీర్ రష్మి అని ప్రశ్నించగా.. ఎవడీ సుధీర్ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు భాస్కర్. దీంతో జబర్దస్త్ షో నిర్వహకులు మొత్తం నోరెళ్లబెట్టారు. అటు యాంకర్, ఇటు జడ్జ్ లు కృష్ణభగవాన్, ఖుష్బులు సైతం తమ ఆశ్చర్యాన్ని తెలిపారు. అంతటితో ఆగలేదు.. రీసెంట్‌గా `భోళా శంకర్` మూవీలో ప్రసాద్ అంకుల్ తో తాను మాట్లాడి రష్మిని పెట్టించినట్టు తెలిపారు భాస్కర్.
ఈ వ్యాఖ్యలు జబర్దస్త్ లో దుమారం రేపుతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రచ్చచేస్తున్నాయి. అయితే ఇదంతా `ఎక్స్ ట్రా జబర్దస్త్` లేటెస్ట్ ప్రోమోలోని క్లిప్పులు కావడం విశేషం. విడుదలైన ప్రోమో వైరల్ అవుతుంది. కామెడీ కోసం భాస్కర్ ఈ సారి యాంకర్ రష్మి, సుధీర్ లవ్ ట్రాక్‌ని వాడుకున్నారు. దీంతో ఇది హైలైట్‌గా నిలిచింది.
Read more: అత్తారింటికి వెళ్తా అమ్మా అన్నది.. ఆత్మహత్య చేసుకుంటుందనుకోలేః నటి అన్నపూర్ణ కన్నీళ్లు..