MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న యాంకర్ రష్మీ.. మేకప్ లెస్ లుక్ వైరల్!

ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న యాంకర్ రష్మీ.. మేకప్ లెస్ లుక్ వైరల్!

యాంకర్ రష్మీ గౌతమ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంది. బిజీ లైఫ్ కి కొంచెం విరామం ప్రకటించి సేద తీరుతుంది. రష్మీ మేకప్ లెస్ లుక్ వైరల్ అవుతుంది 

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 07 2023, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Rashmi Gautam

Rashmi Gautam

హీరోయిన్ గా రష్మీ కెరీర్ నెమ్మదించింది. వరుస ప్లాప్స్ ప్రతికూల ప్రభావం చూపాయి. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్.  ఏళ్ల తరబడి విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని గత ఏడాది విడుదల చేశారు. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ కమర్షియల్ గా ఆడలేదు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Rashmi Gautam

Rashmi Gautam

రష్మీ లీడ్ హీరోయిన్ గా ఆఫర్స్ ఆగిపోయాయి. దీంతో ఆమె పూర్తి దృష్టి బుల్లితెర మీద పెట్టారు.అక్కడ దూసుకుపోతుంది. పదేళ్లుగా రాణిస్తున్న రష్మీ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ కొన్నారు. ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆమె సంపాదన కోట్లకు చేరింది. 

 

37
Rashmi Gautam

Rashmi Gautam

మల్లెమాల సంస్థలో సందడి మొత్తం రష్మీదే.  ఈటీవీలో ఆమె హవా నడుస్తుంది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అనసూయ లేని లోటు రష్మీ  భర్తీ చేస్తుంది. 

47
Rashmi Gautam

Rashmi Gautam

కాగా కొత్త యాంకర్ రావడంతో  జబర్దస్త్ షో చేజారింది. అనసూయ స్థానంలో సౌమ్యరావు అనే కన్నడ సీరియల్ నటి  వచ్చారు. అయితే పండుగలకు, పబ్బాలకు మల్లెమాల రూపొందించే స్పెషల్ ఈవెంట్స్ లో రష్మీ సందడి చేస్తున్నారు. యాంకర్ గా ఆమెకు తిరుగులేదని చెప్పాలి. 



 

57

ఓ దశలో రష్మీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేశారు. ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దీంతో మెల్లగా రష్మీకి ఆఫర్స్ తగ్గాయి. ఒక నిర్మాతతో రష్మీ గొడవపడ్డారని కూడా సమాచారం. ఆ వివాదం ఆమె కెరీర్ పై నెగిటివ్ ప్రభావం చూపింది.చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే. బిగినింగ్ లో ఆమె చిన్న చిన్న పాత్రలు చేశారు. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో యాంకర్ గా మారారు. 

67

జబర్దస్త్ ప్రారంభంలో యాంకర్ గా వ్యవహరించిన అనసూయ వ్యక్తిగత కారణాలతో షో నుండి తప్పుకున్నారు. దాంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. జబర్దస్త్ ఛాన్స్ రష్మీ దశ మార్చేసింది. 

 

77

ఇక రష్మీ పెళ్లి ఎప్పుడనేది ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ గా ఉంది. దానికి ఇంకా సమయం ఉందని ఆమె చెప్పుకొస్తున్నారు. చెప్పాలంటే ఇప్పటికే రష్మిక ఏజ్ బార్ బ్యాచ్ లర్స్ లిస్ట్ లో చేరిపోయింది. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ని రష్మీ ప్రేమిస్తున్నారనే వాదన చాలా కాలంగా ఉంది. ఆన్ స్క్రీన్ లో నాన్ స్టాప్ రొమాన్స్  కురిపించిన నేపథ్యంలో రష్మీ, సుధీర్ నిజమైన ప్రేమికులే అని పలువురు నమ్ముతున్నారు. రష్మీ, సుధీర్ మాత్రం అది బుల్లితెర వరకే, ఆఫ్ స్క్రీన్ లో మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు.

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Recommended image2
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు
Recommended image3
Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved