- Home
- Entertainment
- ఎర్రచీరలో కత్తిలాగా తయారై టీచర్ అవతారమెత్తిన యాంకర్ రష్మి.. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో బ్యాక్ అందంతో రచ్చ
ఎర్రచీరలో కత్తిలాగా తయారై టీచర్ అవతారమెత్తిన యాంకర్ రష్మి.. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో బ్యాక్ అందంతో రచ్చ
యాంకర్ రష్మి గౌతమ్.. జబర్దస్త్ షోతోనే అలరించింది. అడపాదడపా సినిమాల్లోనూ మెరుస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ హాట్ బ్యూటీ `బాయ్స్ హాస్టల్` అనే చిత్రంతో రచ్చ చేసిన విషయం తెలిసిందే.

హాట్ యాంకర్ రష్మి తాజాగా ఎర్రచీరలో మెరిసింది. అంతేకాదు స్లీవ్ లెస్ బ్లాక్ బ్లౌజ్ వేసుకుంది. మరోవైపు రెడ్ శారీ కట్టి కత్తిలాగా ముస్తాబైంది. పైట పక్కకు జరిపి పరువాల విందు వడ్డిస్తుంది. అంతటితో ఆగలేదు కాలేజ్‌కి వచ్చి పాఠాలు చెబుతుంది. ఇంతటి సెక్సీ టీచర్ పాఠలు చెబుతే ఎలా ఉంటుంది.. రచ్చ రంభోలా అనేలా ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. మరి ఇంతకి కథేంటంటే..
`జబర్దస్త్` యాంకర్‌గానే రష్మి గౌతమ్ పాపులర్. అదే ఈ బ్యూటీ క్రేజ్‌ని, స్టార్ యాంకర్ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. ఈ షోతో బుల్లితెర అభిమానులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది. నెట్టింట తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న ఈ భామ అడపాదడపా సినిమాలు చేస్తుంది.
రష్మి గౌతమ్ గతంలో చాలా సినిమాల్లో నటించింది. కానీ `గుంటూరు టాకీస్` హిట్‌కావడంతో పేరొచ్చింది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి మంచి ప్రాజెక్ట్ లు రాలేదు. ఒకటి రెండు సినిమాలు చేసినా అవి వర్కౌట్ కాలేదు. దీంతో సినిమాలకు గ్యాపిచ్చి యాంకరింగ్‌పైనే ఫోకస్ పెట్టింది.
మధ్యలో `బొమ్మ బ్లాక్ బస్టర్` చిత్రంలో నటించింది. అది సక్సెస్ కాలేదు. మళ్లీ ఇప్పుడు `బాయ్స్ హాస్టల్` అనే చిత్రంలో నటించింది. ఇది కన్నడ మూవీ. అక్కడ హిట్ కావడంతో తెలుగులో రిలీజ్ చేశారు. రష్మి పార్ట్ సీన్లని యాడ్ చేశారు. రష్మితో షూట్ చేయించారు. అలా `బాయ్స్ హాస్టర్` ద్వారా తెలుగు ఆడియెన్స్ ని అలరించింది రష్మి.
ఇందులో టీచర్‌గా చేసింది రష్మి. మామూలు టీచర్‌గా కాదు, సెక్సీ టీచర్‌గా కనిపించింది. రెడ్ శారీ కట్టి రచ్చ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది. స్టూడెంట్స్ కి మైండ్ బ్లాక్ చేస్తుంది. దీంతో ఈ బ్యూటీ సీన్లు సినిమాలో బాగా పేలాయి. దానికి తగ్గట్టు రష్మి కనిపించి తీరు అదిరిపోయింది.
సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలోని తన సీన్లకి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది రష్మి గౌతమ్. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్లని మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ముఖ్యంగా రష్మి చీరలో యమసెక్సీగా ఉంది. దీంతో పిచ్చెక్కిపోతున్నారు.
దీనిపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి టీచర్‌గానీ, లెక్చరర్ గానీ ఏ కాలేజ్, స్కూల్‌లో ఉన్నా ఇక అటెండెన్స్ వంద శాతం ఉంటుందని అంటున్నారు. రష్మి పాఠాలు అదిరిపోయాయని, ఇంత హాట్‌గా పాఠాలు చెబితే బుర్ర ఖరాబే అంటున్నారు.
యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉంది రష్మి గౌతమ్. ఆమె `జబర్దస్త్` షోకి యాంకరింగ్ చేస్తుంది. దీంతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా వ్యవహరిస్తుంది. మధ్య మధ్యలో స్పెషల్ షోస్ కూడా చేస్తుంది. ఇలా సినిమాలతో బిజీ కావాలనుకుంటుంది. ఈ షోస్‌కి సంబంధించిన ఫోటో షూట్లతో నెటిజన్లని అలరిస్తుంది.