- Home
- Entertainment
- ఆసుపత్రి పాలైన యాంకర్ రష్మి, అసలు సమస్య ఇదే.. మళ్లీ తిరిగి షోస్ చేసేది ఎప్పుడంటే?
ఆసుపత్రి పాలైన యాంకర్ రష్మి, అసలు సమస్య ఇదే.. మళ్లీ తిరిగి షోస్ చేసేది ఎప్పుడంటే?
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ సడెన్‌గా వార్తల్లో నిలిచింది. ఆమె అనారోగ్యం కారణంగా వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ ఆమె విషయంలో ఆందోళన చెందుతున్నారు. `జబర్దస్త్` కామెడీ షో, `శ్రీదేవి డ్రామా కంపెనీ`లతో సందడి చేసే రష్మి ఇలా అనూహ్యంగా ఆసుపత్రి పాలు కావడం ఆశ్చర్యపరుస్తుంది. మరి ఇంతకి రష్మి గౌతమ్‌కి ఏమైంది? ఎందుకు ఆసుపత్రిలో ఉందనేది చూస్తే.

rashmi gautam
`జబర్దస్త్` కామెడీ షోతో పాపులర్ అయ్యింది రష్మి గౌతమ్. ఈ షో పేరునే ఇంటిపేరుగా మార్చుకుంది. దాదాపు పదేళ్లుగా ఆమె ఈ షోకి యాంకర్‌గా చేస్తూనే ఉంది. అదే కమిట్‌మెంట్‌తో అలరిస్తూనే ఉంది.
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ప్రేమ వ్యవహారం నడిపించి వార్తల్లో నిలిచింది. వీరి జోడీ ఎప్పుడూ క్రేజీగా ఉండేది. టీవీ ఆడియెన్స్ ని అలరించేది. కానీ రెండేళ్లుగా వీరిద్దరు దూరం అయ్యారు. విడిగా షోస్ చేస్తున్నారు.
rashmi gautam
ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ రష్మి పెట్టిన పోస్ట్ తో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇందులో ఆమె తన ఆసుపత్రిలోని ఫోటోలను పంచుకుంది. తాను అనారోగ్యానికి గురైనట్టు అభిమానులతో చెప్పింది. తనకు హిమోగ్లోబిన్ లెవల్స్ పడిపోయినట్టు తెలిపింది.
ఐదు రోజుల్లోనే 9కి పడిపోయినట్టు వెల్లడించింది. అంతేకాదు చాలా కాలంగా భుజం నొప్పితో బాధపడుతుందట. అదే సమయంలో రక్తస్రావం జరిగిందట. దీంతో చాలా వీక్ అయిపోయినట్టు చెప్పింది రష్మి.
rashmi gautam
డాక్టర్లని సంప్రదించగా, మొదట దేనికి ట్రీట్‌మెంట్ చేయించుకోవాలో అర్థం కాలేదని, మార్చి 29 నుంచి బాగా నీరసించిపోయినట్టు చెప్పింది రష్మి. వర్క్ పరమైన కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తి చేసిన తర్వాత ఏప్రిల్ 18న ఆపరేషన్ జరిగిందని చెప్పింది.
ఇప్పుడు తాను బాగానే ఉన్నట్టు వెల్లడించిన రష్మి, మరో మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపినట్టు చెప్పింది. ఇక మూడు వారాల తర్వాత మళ్లీ తను వర్క్ ప్రారంభించబోతున్నట్టు చెప్పింది.
rashmi gautam
దీంతో మళ్లీ రష్మి టీవీ షోస్‌లో కనిపించాలంటే మరో మూడు వారాలు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే తన షోస్ కూడా రష్మి ముందుగానే ఫినీష్ చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో తాను లేని లోటు తెలియదు, ఎందుకంటే ఇప్పటికే ఆయా ఎపిసోడ్లని రష్మి పూర్తి చేసింది.
పెళ్లి కాని అమ్మాయిలు, ఇలా సినిమా రంగంలో ఉండే సెలబ్రిటీలు వెయిట్ పెరగకుండా ఉండేందుకు లిమిట్ ఫుడ్ తీసుకుంటారు. అన్ని రకాల పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడం కష్టం. ఈ క్రమంలో ఇలాంటి రక్త హీనత సమస్యలు తలెత్తుతాయి. రష్మి గౌతమ్ విషయంలో కూడా అదే జరిగినట్టు తెలుస్తుంది.
rashmi gautam
రష్మి గౌతమ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతిదీ నెటిజన్లతో పంచుకుంటుంది. గ్లామర్ ఫోటోలతోనూ అలరిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు తన హెల్త్ ఇష్యూని కూడా ఆమె పంచుకోవడం విశేషం. ఇక ఇది చూసిన నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని అంటున్నారు.