Anasuya: ఇలా అయితే అనసూయ కెరీర్ ముగిసినట్లే... రష్మీ కూడా ఇలాంటి తప్పులే చేసి!
అవకాశాలు వస్తున్నాయి కదా అని ఎడా పెడా చేసుకుంటూ పోతే ప్రయోజనం ఉండదు. పైగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. సినిమాల ఎంపికలో తడబడి వరుస పరాజయాలు ఎదుర్కొంటే కెరీర్ ముగిసినట్లే. అనసూయ అలాంటి తప్పే చేస్తున్నారనిపిస్తుంది.

అనసూయ(Anasuya Bharadwaj) కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. యాంకర్ గా కంటే కూడా నటిగా ఆమె ఫుల్ బిజీ. స్టార్స్ చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న అనసూయ, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. చేతి నిండా చిత్రాలలో ఆమె డైరీ ఫుల్ గా ఉంటుంది. వెండితెరపై విరివిగా అవకాశాలు రావడంతో బుల్లితెర షోస్ కూడా తగ్గించినట్లు సమాచారం.
ఆమెకు నేమ్ ఫేమ్ తెచ్చిపెట్టిన జబర్దస్త్(Jabardasth) కూడా అనసూయ వదిలేశారు. ఇకపై ఆమె ఆ షోలో కనిపించారనేది గట్టిగా వినిపిస్తున్న టాక్. ఇతర షోస్ తో పాటు సినిమా అవకాశాల కారణంగా అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేశారట. ఓకే ఎవరైనా లైఫ్ లో బెటర్మెంట్ కోరుకుంటారు. అనసూయ కూడా అదే చేస్తున్నారు.
అయితే సినిమాలు ఎంపిక విషయంలో ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదనిపిస్తుంది. ముఖ్యంగా అనసూయ చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలేవీ ప్రభావం చూపడం లేదు. కనీస ఆదరణ ఆమె చిత్రాలకు కరువవుతుంది. అనసూయ ప్రధాన పాత్రలో నటించిన కథనం, థాంక్ యూ బ్రదర్, దర్జా(Darja) ప్లాప్ ఖాతాలో చేరాయి.
ఆమె లేటెస్ట్ రిలీజ్ దర్జా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. లేడీ గ్యాంగ్ స్టర్ గా అనసూయ ఆకట్టుకోలేకపోయారన్న మాట వినిపిస్తుంది. దర్జా మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడం ఖాయం అంటున్నారు. దర్జా రూపంలో అనసూయకు మరో ప్లాప్ పడినట్లే.
అనసూయకు ఉన్న ఇమేజ్ రీత్యా తక్కువ బడ్జెట్ తో మూవీ పూర్తి చేసి మార్కెట్ చేసుకోవడం బెటర్ అని నిర్మాతల ఆలోచన కావచ్చు. సినిమా అటూ ఇటూ అయినా వాళ్ళు నష్టపోయేది పెద్దగా ఉండదు. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మంచి లాభాలు దక్కుతున్నాయి. కానీ అనసూయకు హిట్ కావడం అవసరం. వరుసగా ఆమె చిత్రాలు ఫెయిల్ అయితే ఆఫర్స్ పూర్తిగా ఆగిపోతాయి.
దానికి రష్మీ(Rashmi Gautam) కెరీరే ఉదాహరణ. జబర్దస్త్ షోతో విపరీతమైన పాపులారిటీ ఇచ్చుకున్న రష్మీ అప్పట్లో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించారు. కథ, కథనాలతో సంబంధం లేకుండా అవకాశం వచ్చిందే తడవుగా చేసుకుంటూ పోయింది. రష్మీ హీరోయిన్ గా నటించిన ఒక్క మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. దీనితో రష్మీకి వెండితెర అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి.
అనసూయ మేలుకొని సినిమాల ఎంపిక జాగ్రత్త వహించకపోతే ఆమె కెరీర్ కూడా రష్మీ మాదిరే చతికలబడుతుంది. కేవలం బుల్లితెర షోస్ కి పరిమితం కావాల్సి వస్తుంది. తెలివిగా ప్లాన్ చేసుకుంటే హీరోయిన్ గా ఓ స్థాయికి చేరవచ్చు.