నాకు సంబంధం ఉన్నా లేకున్నా పేరు వాడేస్తున్నారు... మళ్ళీ ఫైర్ అయిన అనసూయ!
వివాదాలతో సావాసం చేస్తుంది అనసూయ. ఆమెను వద్దన్నా గొడవలు వెంటాడుతున్నాయి. తాజాగా ఆమె మరోసారి అసహనం ప్రదర్శించారు. తనకు సంబంధం లేని విషయాల్లోకి కూడా లాగుతున్నారని ట్వీట్ చేశారు.

Anasuya Bharadwaj
అనసూయకు ఫేమ్ వచ్చినప్పటి నుండి వివాదాలే. జబర్దస్త్ షోలో అనసూయ డ్రెస్సింగ్ వివాదాస్పదమైంది. అప్పటి వరకు తెలుగు యాంకరింగ్ కి ఉన్న పద్ధతులు అనసూయ బ్రేక్ చేసింది. ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ వెనక్కి తగ్గలేదు. నా బట్టలు నా ఇష్టం. నాకు సౌకర్యం అనిపిస్తే చాలు, జడ్జి చేయడానికి మీరెవరంటూ విమర్శలకు సమాధానం చెప్పింది.
Anasuya Bharadwaj
అప్పుడప్పుడూ ఫెమినిస్ట్ కామెంట్స్ చేసి విమర్శలు పాలైంది. నువ్వు యాంకర్ గా ఉన్న షోల్లో లేడీ క్యారెక్టర్స్ ని అసభ్యంగా మాట్లాడతారు. డబుల్ మీనింగ్ జోకులు.. నువ్వా నీతులు చెప్పేది అంటూ అనసూయను టార్గెట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఇక హీరో విజయ్ దేవరకొండతో గొడవల గురించి చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి మూవీతో మొదలైన ఆ సెగ మొన్నటి వరకు కొనసాగింది. లైగర్ మూవీ పరాజయంపై ట్వీట్ వేసి అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. వాళ్లు ఆంటీ అని ట్రోల్ చేశారు. అనసూయ ఏమాత్రం తగ్గకుండా వాళ్లకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఇటీవల విజయ్ దేవరకొండను మరోసారి గెలికింది. విజయ్ దేవరకొండ పేరు ముందు ది అని పెట్టడాన్ని ఆమె తప్పుబట్టారు. అయితే విజయ్ దేవరకొండ తన మనుషులతో నాపై డబ్బులిచ్చి ట్రోలింగ్ చేయించాడు. అందుకే నేను విజయ్ ని టార్గెట్ చేశానని ఓపెన్ అయ్యింది. అయితే ఇకపై వివాదం కొనసాగించే ఆలోచన లేదని సంధికి వచ్చింది.
Anasuya Bharadwaj
తాజాగా ఏమైందో తెలియదు కానీ తన హేటర్స్ మీద అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. 'వావ్... నేను వాళ్లకు చాలా ముఖ్యం. నా ప్రమేయం ఉన్నా లేకున్నా, నాకు సంబంధం ఉన్నా లేకున్నా... నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్ కూడా జరగదంతే... నాపై అంతా డిపెండ్ అయి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు.. హమ్,' అని కామెంట్ చేశారు.
అనసూయ ఈ ట్వీట్లో ఎవరి పేరూ ప్రస్తావించలేదు. దాంతో మళ్ళీ వివాదం ఎవరితో? మిమ్మల్ని ఎవరేమన్నారు? అని నెటిజెన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ అమెరికాలో ఉన్నారు. ఆమె న్యూజెర్సీలో ఉన్నట్లు సమాచారం.