Anchor Anasuya: చిన్న పిల్లైపోయిన యాంకర్ అనసూయ... తప్పుగా అనుకోవద్దంటూ కామెంట్!
యాంకర్ అనసూయ కుటుంబ సభ్యులతో పాటు హోలీ వేడుకలు జరుపుకున్నారు. తన హోలీ వేడుకల ఫోటోలు అనసూయ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Anasuya Bharadwaj Holi Celebrations
హోలీ పండుగ అందరికీ ప్రత్యేకమే. ఆ రోజు అందరూ చిన్న పిల్లలైపోతారు. తారతమ్యాలు వదిలేసి రంగుల్లో మునిగితేలుతారు. ఆహ్లాదంగా గడుపుతారు. యాంకర్ అనసూయ సైతం హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పండగ వేళ సంతోషంగా గడిపారు.
Anasuya Bharadwaj Holi Celebrations
శరీరం నిండా రంగులతో అనసూయ గుర్తు పట్టలేనంతగా తయారయ్యారు. అనసూయ రంగులతో భర్త భరద్వాజ్ అవతారం మార్చేశారు. హోలీ సెలబ్రేషన్ ఫోటోలు షేర్ చేసిన అనసూయ 'తప్పుగా అనుకోవద్దు' అంటూ కామెంట్ పెట్టారు. హోలీ పండుగ వేళ పసిపాపలా మారిన అనసూయ అభిమానులను అలరిస్తున్నారు.
Anasuya Bharadwaj Holi Celebrations
మరోవైపు అనసూయ కెరీర్ ఉచ్చ స్థితిలో ఉంది. ఏడాదికి ఐదారు సినిమాల్లో అనసూయ నటిస్తున్నారు. అనసూయ ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నారు. హైదరాబాద్ లో అనసూయకు లగ్జరీ హౌస్ ఉంది. ఇప్పుడు అనసూయకు యాంకరింగ్ చేయాల్సిన అవసరం లేదు.
Anasuya Bharadwaj Holi Celebrations
ఒక దశాబ్దం పాటు అనసూయ యాంకరింగ్ ప్రస్థానం సాగింది. జబర్దస్త్ ఆమె దశ తిరిగేలా చేసింది. తన టాలెంట్, గ్లామర్ తో యాంకరింగ్ కి కొత్త భాష్యం చెప్పింది. అనసూయ అనతికాలంలో ఎదిగారు. స్టార్ యాంకర్ గా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. అయితే తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ మీద అనసూయ తీవ్ర ఆరోపణలు చేశారు.
Anasuya Bharadwaj Holi Celebrations
జబర్దస్త్ మేకర్స్ టీఆర్పీ కోసం చెత్త స్టంట్స్ వేస్తున్నారంటూ... కామెంట్ చేశారు. గత ఏడాది అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకున్నారు. అనంతరం ఇతర షోలకు కూడా గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం నటనపైనే. ఆమెకు విలక్షణ పాత్రలు దక్కుతున్నాయి. పుష్ప, ఖిలాడి, దర్జా, మైఖేల్ చిత్రాల్లో ఆమె పాత్రలు నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు చేశారు.
Anasuya Bharadwaj Holi Celebrations
త్వరలో కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ మూవీ విడుదల కానుంది. ఈ మూవీ నుండి ఆమె లుక్ షేర్ చేసింది అనసూయ. ఆమె ప్రెగ్నెంట్ ఉమన్ గా నటిస్తున్నట్లు సదరు ఫొటోలతో ద్వారా అర్థమైంది. అనసూయ లుక్ చూశాక రంగమార్తాండ చిత్రాల్లో ఆమె రోల్ పై ఆసక్తి పెరిగింది.
Anasuya Bharadwaj Holi Celebrations
ప్రసుత్తం హైదరాబాద్ లో పుష్ప 2 షూట్ జరుగుతుంది. ఈ చిత్ర షూట్లో ఆమె జాయిన్ కానున్నారు. పుష్ప 2 లో అనసూయ దాక్షాయణిగా నెగిటివ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప 2, రంగమార్తాండ చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్లు సెట్స్ పై ఉన్నాయి. నటిగా అనసూయ మంచి రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
Anasuya Bharadwaj Holi Celebrations
యాంకర్ అనసూయ కుటుంబ సభ్యులతో పాటు హోలీ వేడుకలు జరుపుకున్నారు. తన హోలీ వేడుకల ఫోటోలు అనసూయ సోషల్ మీడియాలో పంచుకున్నారు.