Anasuya Bharadwaj: అనసూయ ఇలా మారిపోయిందేంటి... ఇకపై అలా చూడలేమా! షాకింగ్ లుక్ వైరల్!
అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె తనలో ఎన్నడూ చూడని కోణం పరిచయం చేసింది. దీంతో ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.
Anasuya Bharadwaj
అనసూయ వెరీ బోల్డ్. అదే సమయంలో కుటుంబ విలువలు, సాంప్రదాయాలు పాటిస్తుంది. బిజీ షెడ్యూల్స్ మధ్య ఫ్యామిలీకి సమయం కేటాయిస్తుంది. పిల్లల బర్త్ డేలు, మ్యారేజ్ యానివర్సరీలు క్రమం తప్పకుండా సెలబ్రేట్ చేస్తుంది. తరచుగా టూర్స్ కి వెళుతుంటారు.
ఎంత సంపాదించినా కుటుంబం కోసమే అంటుంది. ఫ్యామిలీ సంతోషమే తన సంతోషం అన్నట్లు జీవిస్తుంది. ఇక తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తన ఎమోషన్ ఏదైనా అభిమానులకు చెప్పేస్తుంది. అనసూయ పోస్ట్స్ ని ట్రోల్ చేసే వారు ఉన్నారు. అయినా ఆమె పట్టించుకోదు.
ఇక అనసూయకు భక్తి కూడా ఎక్కువే. హిందూ పండుగలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంది. పూజలు పునస్కారాలు ఆచరిస్తుంది. తాజాగా ఆమె కార్తీక పౌర్ణమి జరుపుకుంది. కార్తీక పౌర్ణమి నాడు పూజ నిర్వహించింది.
Anasuya Bharadwaj
భక్తి పారవశ్యంలో మునిగిపోయిన అనసూయ... తన పూజా లుక్ షేర్ చేసింది. అడ్డ నామాలతో శివ భక్తురాలిగా అనసూయ అవతారం కొత్తగా ఉంది. ఎప్పుడూ హాట్ డ్రెస్ లలో హీటు పుట్టించే అనసూయలోని కొత్తకోణం ఆకర్షించింది.
Anasuya Bharadwaj
పూజతో బాగా అలసిపోయాను. కానీ సంతృప్తిగా ఉన్నాను. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ క్షణాల్లో వైరల్ గా మారింది. అభిమానులు తిరిగి ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.
అనసూయ నటిగా బిజీగా ఉన్నారు. ఈ ఏడాది అనసూయ నటించిన మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం పుష్ప 2లో అనసూయ నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
యాంకరింగ్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేసిన అనసూయ నటన పైనే పూర్తి దృష్టి పెట్టింది. ఈ క్రమంలో బుల్లితెర ఆడియన్స్ ఆమెను బాగా మిస్ అవుతున్నారు. అనసూయ జబర్దస్త్ వేదికగా ఫేమ్ తెచ్చుకుంది. ఆ కామెడీ షో అనసూయను స్టార్ చేసింది.
Payal Rajput: ఆ బ్రా నాది కాదు, వాళ్ళిచ్చారు... లోదుస్తులపై పాయల్ ఓపెన్ కామెంట్!