హీరోలందరూ లైన్ వేయడానికే, అందుకే అవైడ్ చేశాను... అనసూయక షాకింగ్ కామెంట్స్!
వివాదాలకు మారుపేరు అనసూయ. ఆమె డ్రెస్సింగ్ నుండి విజయ్ దేవరకొండతో గొడవల వరకు అనేక వివాదాలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Anasuya bharadwaj
అనసూయ లేటెస్ట్ ఇంటర్వ్యూలో కెరీర్ బిగినింగ్ నుండి చోటు చేసుకున్న పలు విషయాలపై స్పందించారు. సినీ జర్నలిస్ట్ రాజేష్ మన్నె ఆమెను ఇంటర్వ్యూ చేశారు. అనసూయ నాగ మూవీలో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించింది. సిల్వర్ స్క్రీన్ పై బ్రేక్ రాకపోవడంతో యాంకర్ గా మారారనే వాదన ఉంది. అది నిజం కాదని అనసూయ అన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ గా స్ట్రగులై జబర్దస్త్ షోతో బ్రేక్ వచ్చిందని అనుకుంటారు కానీ అది నిజం కాదని ఆమె అన్నారు.
Anasuya Bharadwaj
దర్శకుడు సుకుమార్ తనను ఆర్య 2లో ఓ పాత్ర కోసం అడిగితే నో చెప్పారట. ఇప్పటికీ ఆయన నువ్వు నాకు నో చెప్పావని అంటారట. గతంలో హీరోలు అందరూ లైన్ వేయడానికే ఉంటారని తెగ ఫీలయ్యే దాన్ని అని అనసూయ అన్నారు. అత్తారింటికి దారేది చిత్రంలో ఐటెం సాంగ్ రిజెక్ట్ చేయడానికి గల కారణాలు కూడా అనసూయ చెప్పారు.
Anasuya Bharadwaj
రంగస్థలం చిత్రం తర్వాత నాలుగేళ్లు అవకాశాలు రాలేదని అనసూయ అన్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్ పై కూడా అనసూయ స్పందించారు. మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా బీచ్ కి వెళ్లిన అనసూయ బికినీ వేశారు. ఆప్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇవి ట్రోలింగ్ కి గురయ్యాయి.
హేటర్స్ ని రెచ్చగొట్టేందుకే అనసూయ అలాంటి ఫోటోలు షేర్ చేశారనే వాదన వినిపించింది. ఈ కామెంట్స్ కి అనసూయ సమాధానం చెప్పారు. అది మా పెళ్లి రోజు. మేము వెకేషన్ కి వెళ్ళాము. ప్రేమించుకున్నాము. నేను ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెడితే మీకు ఇబ్బంది ఏంటని అనసూయ అన్నారు. పరోక్షంగా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
Anasuya Bharadwaj
ఆంటీ అంటే కోపం ఎందుకు? పుష్ప 2లో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది వంటి అనేక విషయాలు అనసూయ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అనసూయ ఇంటర్వ్యూ ప్రోమో మాత్రమే విడుదలైంది. పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయితే కానీ వివరాలు బయటకు రావు.
Anasuya Bharadwaj
మరోవైపు అనసూయ నటిగా ఫుల్ బిజీ. ఈ ఏడాది ఆమె నటించిన రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాల్లో అనసూయ భిన్నమైన పాత్రలు చేసింది. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.