పెళ్లి కాక ముందు అనసూయ ఇలా ఉండేదా.. అసలు గుర్తు పట్టలేము బాబోయ్!
అనసూయ పాత ఫోటోలు వైరల్ గా మారాయి. అప్పట్లో ఆమె ప్రియుడితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పెళ్లి కాక ముందటి అనసూయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Anasuya Bharadwaj
అనసూయ ఒకప్పటి జబర్దస్త్ యాంకర్. తెలుగు బుల్లితెరకు గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్. 2013లో జబర్దస్త్ ప్రయోగాత్మకంగా మొదలు కాగా అనసూయ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.
Anasuya Bharadwaj
జబర్దస్త్ షోలో అనసూయ గ్లామర్ ఒక ఆకర్షణ. ఆమె పొట్టిబట్టల్లో మైండ్ బ్లాక్ చేసేది. జబర్దస్త్ షోలో అనసూయ డ్రెస్సింగ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా అనసూయ వెనక్కి తగ్గలేదు. పైగా తనను విమర్శించిన వాళ్లకు కౌంటర్లు ఇచ్చింది.
Anasuya Bharadwaj
2022లో అనూహ్యంగా అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. నటిగా బిజీ అయిన అనసూయ యాంకరింగ్ ఇకపై చేయను అన్నారు. అలాగే ఆమెకు షో నిర్వాహకుల టీఆర్పీ స్టంట్స్ నచ్చడం లేదని ఆమె వాపోయారు.
Anasuya Bharadwaj
కాగా అనసూయ ఒకప్పటి ఫోటోలు వైరల్ గా మారాయి. పెళ్ళికి ముందు అనసూయ ఇలా ఉండేదా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. అనసూయ ఒకప్పటి ప్రియుడు, ఇప్పటి భర్తతో దిగిన కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.
Anasuya Bharadwaj
గతంలో అనసూయ చాలా స్లిమ్ అండ్ ఫిట్ గా ఉంది. ఆమెను గుర్తు పట్టడం కొంచెం కష్టమే అని చెప్పాలి. ఇప్పటి అనసూయకు అప్పటి అనసూయకు చాలా తేడా ఉంది. అనసూయ సుశాంక్ భరద్వాజ్ ని ప్రేమ వివాహం చేసుకుంది.
Anasuya Bharadwaj
అనసూయ ప్రేమను వాళ్ళ తండ్రి అంగీకరించలేదట. దాంతో కుటుంబంలో గొడవలు జరిగాయట. ఇంటి నుండి బయటకు వచ్చేసిన అనసూయ చాలా కాలం హాస్టల్ లో ఉందట. ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి ఆమె వివాహం చేసుకున్నారట.
Anasuya Bharadwaj
అనసూయకు ఇద్దరు అబ్బాయిలు సంతానం. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడిపిన ప్రతి క్షణాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇటీవల సమ్మర్ వెకేషన్ కి వెళ్లిన అనసూయ బాగా ఎంజాయ్ చేసింది.
Anasuya Bharadwaj
ఇక అనసూయ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. అలాగే మరి కొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. అనసూయ విలక్షణమైన పాత్రలు చేస్తూ సత్తా చాటుతుంది.