రోడ్ ట్రిప్ ప్లాన్ చేసిన అనసూయ... కారులో పాటలు, డాన్సులు వ్యవహారం మామూలుగా లేదుగా!
యాంకర్ అనసూయ రోడ్ ట్రిప్ ప్లాన్ చేశారు. భర్త, పిల్లలతో కారులో టూర్ కి వెళుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది.

షూటింగ్స్, మీటింగ్స్ తో బిజీగా ఉండే అనసూయ వెకేషన్ కి వెళుతున్నారు. కారులో ఫ్యామిలీ సందడి చేస్తూ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. అన్ స్టాపబుల్ సాంగ్ పెట్టిన అనసూయ డాన్సులు వేస్తూ కారులో పిచ్చ ఎంజాయ్ చేస్తున్నారు. భర్త సుశాంక్ కారు స్వయంగా డ్రైవ్ చేస్తుంటే, అనసూయ ఆమె కొడుకులు సందడి చేస్తున్నారు.
ఇటీవల అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య యుద్ధం నడిచింది. అనసూయను వాళ్ళు ట్రోల్ చేశారు. అనసూయ ఏమాత్రం తగ్గలేదు. నేనేమిటో చూపిస్తానంటూ సవాల్ విసిరారు.
నటిగా సక్సెస్ఫుల్ కెరీర్ లీడ్ చేస్తున్న అనసూయకు ఈ వివాదాలు అవసరమా అని పలువురు హితవు పలుకుతున్నారు. ఇటీవల విడుదలైన రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేశారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అనసూయ పాత్రకు ప్రశంసలు దక్కాయి.ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది. విమానం టైటిల్ తో ఓ మూవీ అనసూయ చేస్తున్నారు.
గత ఏడాది అనసూయ తమిళ, మలయాళ చిత్రాలు కూడా చేశారు. అనసూయ ఒక్కో కాల్షీట్ కి మూడు లక్షల రూపాయలకు పైనే తీసుకుంటున్నారట. జబర్దస్త్ యాంకర్ గా నాలుగు వారాలు పని చేస్తే ఇచ్చేది కూడా ఇంతే. యాంకర్ గా వచ్చే ఆదాయంతో పోల్చితే నటిగా పెద్ద మొత్తం రాబట్టవచ్చు. అనసూయ నిర్ణయానికి ఇది కూడా కారణం.
మరోవైపు అనసూయను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. అనసూయకు యాంకరింగ్ మీద పుట్టిందట. మేకర్స్ టీఆర్పీ కోసం ప్లే చేస్తున్న ట్రిక్స్ తనకు నచ్చడం లేదట. అందుకే యాంకరింగ్ మానేశానని ఆమె వెల్లడించారు. అనసూయకు కెరీర్ ఇచ్చింది ఆ బుల్లితెరే. జబర్దస్త్ షో ఆమెను షో స్టార్ ని చేసింది. ఇప్పుడు అనుభవిస్తున్న స్టార్డమ్ మొత్తం జబర్దస్త్ పుణ్యమే. జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక అనసూయ ఆరోపణలు చేయడం కొసమెరుపు. కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని ఆమె అన్నారు.