ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు అంటున్న అనసూయ... చీర కట్టులో మెస్మరైజ్ చేసిందిగా!
అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. ఈసారి నిండైన చీరకట్టులో మెరిసింది. తన ఫోటోలకు ఒక ఆసక్తికర కామెంట్ జోడించింది.

Anasuya Bharadwaj
అనసూయను బుల్లితెర ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. ఆమె పూర్తిగా యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది. 2022లో జబర్దస్త్ నుండి తప్పుకుంది.
Anasuya Bharadwaj
దాదాపు 9 ఏళ్ళు అనసూయ జబర్దస్త్ వేదికగా అభిమానులను అలరించింది. ఆమె గ్లామర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పొట్టిబట్టల్లో నాన్ స్టాప్ గ్లామర్ పంచింది.
Anasuya Bharadwaj
అనసూయ డ్రెస్సింగ్ పలుమార్లు వివాదాస్పదం అయ్యింది. ఆమెను కొందరు విమర్శించారు. అయితే అనసూయ తనను సమర్థించుకుంది. తన బట్టల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని తెగేసి చెప్పింది.
Anasuya Bharadwaj
ప్రస్తుతం సినిమాలకే పరిమితం అవుతుంది. అనసూయ చేతిలో అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2లో అనసూయ నటిస్తుంది.
Anasuya Bharadwaj
దాక్షాయణిగా డీ గ్లామర్ రోల్ లో అలరించనుంది. పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న పుష్ప 2 విడుదల కానుంది.
Anasuya Bharadwaj
ఈ మధ్య పబ్లిక్ లో ఎక్కువగా కనిపిస్తుంది అనసూయ. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తుంది.
Anasuya Bharadwaj
అనసూయ ఎక్కడకు వెళ్లినా ఆమెను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. కుర్రకారులో ఆమెకు ఉన్న క్రేజ్ కి ఇది నిదర్శనం అని చెప్పాలి.
Anasuya Bharadwaj
మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటోలతో సందడి చేస్తుంది. ఈసారి అనసూయ నిండైన చీరలో కనిపించింది.
Anasuya Bharadwaj
నవ్వులు చిందిస్తూ మనసులు దోచేసింది. పరిస్థితులు ఎలాంటివైనా ఆనందంగా ఉండటం మాత్రం మరవకండి.. అని తన ఫోటోలకు కామెంట్ పెట్టింది.
Anasuya Bharadwaj
అనసూయ అందానికి ఫిదా అయిన నెటిజెన్స్ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీరు అద్భుతంగా ఉన్నారని కితాబు ఇస్తున్నారు. అనసూయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.