పెళ్ళికి ముందు లేచిపోదామనుకున్న అనసూయ... బయటకు గెంటేసిన తండ్రి!
స్టార్ యాంకర్ అనసూయ లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్ట్స్ ఉన్నాయి. తండ్రి బయటకు గెంటేస్తే... 9 ఏళ్ళు పోరాటం చేసి ప్రియుడిని భర్తగా తెచ్చుకుంది. ఆమె లవ్ స్టోరీ ఏమిటో చూద్దాం..
అనసూయ భరద్వాజ్... ఈ పేరుకు ఓ ఇమేజ్, క్రేజ్ ఉంది. జబర్దస్త్ వేదికగా అనసూయ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు బుల్లితెరపై మొదటి గ్లామరస్ యాంకర్. ట్రెండ్ సెట్టర్. అనసూయకు హీరోయిన్స్ కి తగ్గని ఫాలోయింగ్ ఉంది.
అనసూయ ముక్కుసూటితనం కలిగిన అమ్మాయి. విమర్శలు పట్టించుకోదు. నచ్చినట్లు జీవించాలి అంటుంది. అలాగే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. అంత మొండిది కాబట్టే కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది.
Anasuya bharadwaj
అనసూయ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో ఎన్ సీ సీ క్యాంపుకి వెళ్లిందట. అక్కడ సుశాంక్ భరద్వాజ్ పరిచయం అయ్యాడు. టీనేజ్ లో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అది ఏళ్ల తరబడి సాగింది. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని సుశాంక్... అనసూయను అడిగాడట. వెంటనే వర్షం వచ్చిందట.
Anasuya Bharadwaj
అనసూయ-సుశాంత్ పీకల్లోతు ప్రేమలో ఉండగా... పెళ్లి సంబంధం వచ్చిందట. అనసూయ తండ్రి ఆమె కోసం ఒక పైలెట్ ని తెచ్చాడట. మంచి ఉద్యోగం, ఆస్తిపరుడు చేసుకుంటే సుఖపడతావని చెప్పాడట. ఆల్మోస్ట్ సంబంధం ఓకే అయిపోగా... అనసూయ తన ప్రేమ విషయం తల్లి ద్వారా చెప్పించిందట.
Anasuya Bharadwaj
అగ్గిమీద గుగ్గిలం అయిన అనసూయ తండ్రి... సూట్ కేస్ బయటకు విసిరి, అనసూయను గెంటేశాడట. ఏళ్ళు గడుస్తున్నా అనసూయ తండ్రి మనసు మారలేదట. దాంతో అనసూయ మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అందట. సుశాంక్ అందుకు ఒప్పుకోలేదట.
Anasuya Bharadwaj
పెద్దలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే గౌరవం ఉండదు. మనం వేచి చూద్దాం. ఆయన మనసు మారవచ్చని పలుమార్లు సర్ది చెప్పాడట. ఎంతకీ అనసూయ మాట వినకపోవడంతో చేసేది లేక తండ్రి సుశాంక్ తో పెళ్లికి ఓకే చేశాడట.
Anasuya Bharadwaj
అన్యమనస్కంగానే సుశాంక్ ని అనసూయ తండ్రి అల్లుడిగా ఒప్పుకున్నాడట. పెళ్ళై పిల్లలు పుట్టాక ఆయన అభిప్రాయం మారిపోయిందట. కూతురు, అల్లుడితో కలిసిపోయాడట. సుశాంక్ భర్తగా రావడం వలనే ఈ స్థాయిలో ఉన్నాను. నాకు ప్రతి విషయంలో ప్రోత్సాహం అందించాడని అనసూయ గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది...