- Home
- Entertainment
- Anasuya:కుక్కకాటుకి చెప్పు దెబ్బ.. అమ్మో అనసూయ ట్వీట్ మిస్ ఫైర్... వైరల్ అవుతున్న దారుణమైన మీమ్స్ ఇవే
Anasuya:కుక్కకాటుకి చెప్పు దెబ్బ.. అమ్మో అనసూయ ట్వీట్ మిస్ ఫైర్... వైరల్ అవుతున్న దారుణమైన మీమ్స్ ఇవే
ఉమెన్స్ డే నాడు యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj)ట్వీట్ మిస్ ఫైర్ అయ్యింది. ఆమె ఏదో కొత్తగా విషెష్ చెబుదామనుకుంటే పెద్ద చెత్త క్రియేట్ అయ్యింది. ట్రోలర్స్ పై సెటైర్స్ వేద్దామనుకొని సెల్ఫ్ గోల్ వేసుకుంది. మామూలుగానే ఆమెను ఆడుకునే ఈ ట్రోలర్స్, చేతికి దొరకడంతో మరింతగా ఎత్తేస్తున్నారు.

సమాజంలో మంచి చెడు రెండూ ఉంటాయి. మగాళ్లలో ఆడవాళ్లు అంటే గౌరవం లేని వాళ్ళతో పాటు పూజించే వాళ్ళు కూడా ఉంటారు. అందరినీ ఓ గాటిన కట్టేయకూడదు. ఈ సూత్రం మగాళ్ల పట్ల స్త్రీలకు కూడా వర్తిస్తుంది. మగాళ్లను హింసించే ఆడాళ్లతో పాటు ప్రేమించే ఆడవాళ్లు కూడా ఉంటారు. కాబట్టి ఏక పక్షంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం సరికాదు.
అనసూయ ఇప్పుడు అదే చేసింది మొక్కుబడిగా ఉమెన్స్ డే నాడు ఆడవాళ్ళ మీద గౌరవం నటించకండి అంటూ ట్వీట్ చేసింది. అలాగే మగాళ్లను గుమ్మడికాయ దొంగలు, నా ట్వీట్ కి కామెంట్స్ చేస్తారు చూడండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.అయితే అనసూయ ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయ్యింది. శత్రువుల వైపుకు విసిరిన బాణం తిరిగి అనసూయ వీపున గుచ్చుకుంది.
a
మన చొక్కాకు బొక్కలు పెట్టుకొని ఎదుటోడి చడ్డీకి ఇస్త్రీ లేదని విమర్శించినట్లు ఉంది అనసూయ తీరు అంటున్నారు నెటిజెన్స్. అనసూయ ట్వీట్ కి వాళ్ళు తిరిగి సంధించిన ప్రశ్నలకు అనసూయ వద్ద బహుశా సమాధానం ఉండకపోవచ్చు. అనసూయను నెటిజెన్స్ అడిగిన ప్రశ్నలు ఏమిటో చూద్దాం..
తెలుగులో సుమ, ఉదయభాను, శ్యామల వంటి యాంకర్స్ ఉన్నారు. వారిని ఎప్పుడూ ఎవరూ ట్రోల్ చేయరు. వాళ్ళని చేయని వాళ్ళు మిమ్మల్ని మాత్రమే చేస్తున్నారంటే తప్పు మీదా, మీమర్స్ దా?... నిజానికి రష్మీ గౌతమ్, శ్రీముఖి లాంటి యాంకర్స్ కూడా పొట్టిబట్టలు వేసుకుంటారు. వాళ్ళను కూడా ఎవరూ ట్రోల్ చేయరు. దానికి కారణం వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. అనసూయలా అనవసరమైన వివాదాల్లో తలదూర్చరు.
అలా అని వాళ్లకు బాధ్యత లేదు అనసూయకు మాత్రమే సామాజిక బాధ్యత ఉందనుకుంటే పొరపాటే. అర్జున్ రెడ్డి మూవీలో అమ్మాయిని కొట్టడం, ముద్దులు పెట్టడం పై రచ్చ చేసి టీవీ డిబేట్స్ లో కూర్చున్న అనసూయ... తన షోలో ఆడాళ్ళపై వేసే అడల్ట్ జోక్స్ కి పకా పకా నవ్వుతుంది. లేడీ క్యారెక్టర్స్ ని మగాళ్లు ఎగిరెగిరి తంతుంటే ఎంజాయ్చేస్తుంది. ఏకంగా కుటుంబాలు కలిసి చూసే బుల్లితెర షోలో తనపైనే కొందరు అడల్ట్ జోక్స్ వేస్తూ ఉంటారు.
అనసూయ చెప్పే స్త్రీవాద సిద్ధాంతాన్ని తప్పనడం లేదు. అయితే నీతులు చెప్పే నువ్వే కరెక్ట్ కానప్పుడు సూత్రాలు వల్లించవద్దు అంటున్నారు. అనసూయ పుణ్యమా అని హైపర్ ఆది కూడా బద్నాం అవుతున్నాడు. ఆడ క్యారెక్టర్స్ పై ఆది వేసే జోక్స్ అసభ్యకరంగా, అవమానకరంగా ఉంటాయని పలువురు నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అనసూయ ఉమెన్స్ డే (Womens day)ట్వీట్ పై మీమర్స్ పలు మీమ్స్ క్రియేట్ చేశారు. వాటిలో చాలా అనసూయను పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్నాయి. కొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి.