- Home
- Entertainment
- Anasuya: షాకింగ్ డెసిషన్.. జబర్దస్త్ నుంచి అనసూయ అవుట్, సడెన్ గా ఎందుకిలా.. వైరల్ అవుతున్న కామెంట్స్
Anasuya: షాకింగ్ డెసిషన్.. జబర్దస్త్ నుంచి అనసూయ అవుట్, సడెన్ గా ఎందుకిలా.. వైరల్ అవుతున్న కామెంట్స్
బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది.

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అనసూయ బులితెరపై గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడంలో, ఎంటర్టైన్ చేయడంలో తన వంతు కృషి చేస్తుంది. చాలా కాలంగా అనసూయ జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్స్ తమ స్కిట్స్ తో నవ్వులు పూయిస్తుంటే.. అనసూయ గ్లామర్ తో ఆకట్టుకుంటూ వచ్చింది.
అటు జబర్దస్త్ నుంచి ఇటు ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను ఇప్పటికే జబర్దస్త్ ని వీడారు. నాగబాబు, రోజా కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు. తాజాగా అనసూయ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనసూయ జబర్దస్త్ కి దూరమైనట్లు తెలుస్తోంది.
చాలా రోజుల నుంచి అనుకుంటున్నప్పటికీ సడన్ గా తన డెసిషన్ ని అనసూయ ఈ రోజు అప్లై చేసిందట. దీనికి సంబంధించి అనసూయ పరోక్షంగా కామెంట్స్ చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నా కెరీర్ లో నేను చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నా. చాలా మెమొరీస్ నాతో తీసుకువెళుతున్నా. అందులో ఎక్కువగా గుడ్ మెమొరీస్ ఉన్నాయి. కొన్ని బ్యాడ్ మెమొరీస్ కూడా ఉన్నాయి. ఎప్పటిలాగే మీ ఆదరణ నాకు ఉంటుందని భావిస్తున్నా అంటూ అనసూయ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
జబర్దస్త్ నుంచి విడిచి వెళ్ళుతుండడంతో అనసూయ ఈ కామెంట్స్ పోస్ట్ చేసిందని అంటున్నారు. ఇతర షోలలో అవకాశాలు రావడం.. సినిమా కెరీర్ పై ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది.