మహానటికి నివాళులు అర్పించిన అనసూయపై దారుణంగా ట్రోలింగ్.. అంతా డ్యాన్స్ వల్లే
అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. మొన్నటివరకు సినిమాలకు మాత్రమే పరిమితం అయిన అనసూయ తిరిగి బుల్లితెరపై సందడి మొదలు పెట్టింది.

అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. మొన్నటివరకు సినిమాలకు మాత్రమే పరిమితం అయిన అనసూయ తిరిగి బుల్లితెరపై సందడి మొదలు పెట్టింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే షోలో అనసూయ సందడి చేస్తోంది. అనసూయని ఎప్పుడూ వివాదాలు వెంటాడుతూనే ఉంటాయి.
నెటిజన్లు అనసూయని ఏదో ఒక అంశంలో ట్రోల్ చేస్తుంటారు. అనసూయ వెనక్కి తగ్గకుండా అంతే ధీటుగా సమాధానాలు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఎప్పుడో కొన్నేళ్ల క్రితం వీడియో బయటకి తీసి అనసూయని ట్రోల్ చేస్తున్నారు. అనసూయ నాళేలుగేళ్ల క్రితం మహానటి సావిత్రికి నివాళులు అర్పిస్తూ ఒక షోలో డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేసింది.
సావిత్రి ఎదుర్కొన్న కష్టాలు గుర్తుకు వచ్చేలా అనసూయ ఎమోషనల్ గా ఏడుస్తూ ఈ పెర్ఫామెన్స్ చేసింది. అయితే అనసూయ డాన్స్ పెర్ఫామెన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. ఆమె ధరించిన గెటప్ కూడా దారుణంగా ఉంది. ముఖ్యంగా కొన్ని సెకండ్ల వీడియోలో ఆమె పెర్ఫామెన్స్ ఫన్నీగా ఉండడంతో కొందరు నెటిజన్లు ఆ వీడియో ఇప్పుడు బయటకి తీశారు.
దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది గమనించిన అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను ఇలాంటి విషయాలకు దూరంగా ప్రశాంతంగా ఉండాలనుకున్నా. కానీ దీనికి మాత్రం స్పందించకుండా ఉండలేకున్నా. నాలుగేళ్ళ క్రితం ఒక ఫెస్టివల్ సందర్భంగా జీ టివిలో జరిగిన షో అది. అందులో మహానటి సావిత్రమ్మకి నివాళిగా ఆ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చాను.
కానీ మీరు చాలా దారుణంగా అవమానకరంగా ట్రోల్ చేస్తున్నారు. అగౌరవపరచకుండా విమర్శిస్తే నాకేం ఇబ్బంది లేదు. విమర్శలని నేను తీసుకుంటాను. కానీ ఈ విధంగా ట్రోల్ చేసి అవమానించడం కరెక్ట్ కాదు. నన్ను ఎంతైనా తిట్టండి.. నాకు ఇబ్బంది లేదు.
కానీ అది సావిత్రమ్మకి నివాళిగా చేసిన పెర్ఫామెన్స్. ఈ విధంగా అవమానించొద్దు. మీరు మొత్తం వీడియో చూస్తే నా పెర్ఫామెన్స్ నచ్చుతుంది. అప్పటికి నచ్చకపోతే గౌరవప్రదంగా విమర్శించండి. నన్ను తిట్టండి. కానీ సావిత్రమ్మ కోసం చేసిన పెర్ఫామెన్స్ ని అవమానించొద్దు అని రిక్వస్ట్ చేసింది.