- Home
- Entertainment
- థండర్ థై చూపిస్తూ భలే కవర్ చేసిన అనసూయ.. ట్రోల్స్ పై క్రేజీ కామెంట్స్.. ఇలా మారిపోయిందేంటి?
థండర్ థై చూపిస్తూ భలే కవర్ చేసిన అనసూయ.. ట్రోల్స్ పై క్రేజీ కామెంట్స్.. ఇలా మారిపోయిందేంటి?
అనసూయ హాట్ యాంకర్‌గా రాణిస్తుంది. ఆమె యాంకరింగ్ వదిలేసి సినిమాలు చేసుకుంటుంది. దీంతో సోషల్ మీడియాలో తక్కువగా ఉంటోంది. అయితే నెటిజన్లతో ముచ్చటించింది. ట్రోల్స్‌పై స్పందించింది. అలాగే థైస్ చూపిస్తూ విచిత్రమైన పోస్ట్ పెట్టింది.

అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో థైస్‌ని చూపించింది. పొట్టి షాట్ వేసుకుని తన హాట్ థై ని ఫోల్డ్ చేస్తూ, బారున చాచుతూ ఉన్న వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో అనసూయ విచిత్రమైన పోస్ట్ పెట్టింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
అనసూయ పెట్టిన పోస్ట్ షాకింగ్‌లా ఉంది. బిగ్‌వైన షాట్‌తో తన థైస్ చూపిస్తూ ఇది లెగ్ డే అంటూ పోస్ట్ పెట్టడం ఓ విశేషమైతే, జిమ్‌లో శ్రమిస్తుంటే చాలా బాధగా ఉందట. కానీ సెక్సీగా బూమరాంగ్ చేస్తూ కవర్ చేసుకుంటున్నా అని పేర్కొంది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. నెటిజన్లు పిచ్చెక్కించే పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా నెట్టింట రచ్చ చేస్తున్నారు.
మరోవైపు మెచ్యూరిటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు అనసూయ. `మెచ్యూరిటీ అంటే మీకు హాని చేసిన వారిని నాశనం చేయగల శక్తి మీకు ఉన్నా, మీరు ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా మీ దారిలో మీరు వెళ్లిపోతే, అదే వారి జీవితానికి హెచ్చరికలా, వారిలైఫ్ జాగ్రత్త పడేలా చేస్తుంది` అని ఓ ఇంగ్లీష్ కవి కోట్స్ ని పోస్ట్ చేసింది.
మరోవైపు ట్రోల్స్ పై మరోసారి స్పందించింది అనసూయ. తాజాగా ఆమె అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించింది. ఆస్క్ అనసూయ యాష్ ట్యాగ్ ద్వారా ఆమె నెటిజన్లతో మాట్లాడుతూ, మరోసారి ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యింది. తాను వాటిని ట్రోల్స్ గా భావించనని తెలిపింది.
`ఫస్ట్ నేను ఆయా విషయాలనే(ట్రోల్స్)నే గుర్తించను. మీకు అవి దెబ్బ తగలడానికి అనుమతిస్తే తప్ప వాటికి ఉనికి లేదు. ట్రోలర్స్ కి నన్ను అణచివేసే శక్తి ఎప్పటికీ ఉండదు. అవి నన్ను మరింత బలమైన వ్యక్తిగా మారుస్తాయి. నన్ను ఇంకా ఎక్కువగా నటనపై ఫోకస్ చేసేలా చేస్తాయి, అది వారిని మరింత మోటివేట్ చేస్తుంది` అని పేర్కొంది. దీని పట్ల ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉంటే ఈ ఛాటింగ్‌లో ఆమె ఎలాంటి ప్రశ్నకైనా చాలా కూల్‌గా సమాధానం చెబుతుండటం విశేషం. అనసూయలో మార్పుకి ఇది కారణంగా చెప్పొచ్చు అంటున్నారు ఫ్యాన్స్.
ఇక నటిగా ఇప్పుడు బిజీగా ఉంది అనసూయ. ఆమె చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. `పుష్ప2` చిత్రీకరణ జరుపుకుంటోంది. అలాగే `సింబా` అనే మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే `విమానం` అనే మరో సినిమాని తాజాగా ప్రకటించారు. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నారు. మలయాళంలోనూ నటిస్తున్నట్టు తెలుస్తుంది.