MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఓటీటీలో అనసూయ మూవీ `సింబా` రికార్డ్ వ్యూస్‌, ప్రిన్స్ `కలి` రిలీజ్‌ అయ్యేది అప్పుడే?

ఓటీటీలో అనసూయ మూవీ `సింబా` రికార్డ్ వ్యూస్‌, ప్రిన్స్ `కలి` రిలీజ్‌ అయ్యేది అప్పుడే?

అనసూయ ప్రధాన పాత్రలో నటించిన `సింబా` మూవీ ఓటీటీలో దుమ్మురేపుతుంది. అలాగే ప్రిన్స్, నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన `కలి` మూవీ రిలీజ్‌ ఫిక్స్ అయ్యింది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 17 2024, 12:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మాజీ జబర్దస్త్ యాంకర్‌ అనసూయ టీవీ వదిలేసి సినిమాల్లో బిజీ అయ్యింది. అందులో భాగంగా ఆమె ఇటీవల `సింబా` అనే చిత్రంలో నటించింది. జగపతిబాబు, వశిష్ట, శ్రీనాథ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు సంపత్‌ నంది కథ అందించడం విశేషం. దర్శ డు మురళీ మనోహర్‌ రూపొందించిన ఈ మూవీ ఆ మధ్య థియేటర్లలో విడుదలైంది. కానీ పెద్దగా ఆదరణ పొందలేదు.
బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

సందేశాత్మక చిత్రం కావడంతో క్రిటికల్‌గా ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్‌గా సత్తా చాటలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం ఇది దుమ్మురేపుతుంది. ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుంది. ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుంది. అనేది రీసెంట్‌గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్థమై ఉంటుంది.

వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత నష్టాన్ని చవి చూశాయో అందరికీ తెలిసిందే. ప్రకృతిని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. చెట్లను పెంచి, చెరువుల్ని కబ్జాలు చేయకుండా ఉంటే ఇలాంటి ప్రకృతి విళయతాండవాలు జరగవు. వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్టుతో `సింబా` సినిమాను తెరకెక్కించారు.

సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన `సింబా` డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా థియేటర్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్‌గా ఆడలేదు. కానీ ఇలాంటి చిత్రాలనే ఓటీటీలో రిలీజ్ చేస్తే టాప్‌లో ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా `సింబా` మూవీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్, ఆహాలో ఈ `సింబా` మూవీ గత పది రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 6లో  ట్రెండ్ అవుతోంది. ప్రకృతి విళయతాండవం చేస్తున్న టైంలో సింబాలోని డైలాగ్స్, సీన్స్ బాగానే వైరల్ అయ్యాయి. చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది సింబాలో చక్కగా చూపించారు.

డైరెక్టర్ మొదటి సినిమాతోనే మంచి మెసెజ్ ఇచ్చే చిత్రాన్ని తీశారు. సంపత్ నంది కథ.. డైరెక్టర్ మురళీ మనోహర్ విజన్, మేకింగ్ ‌కు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. సింబాకి ఓటీటీలో ప్రస్తుతం మంచి ఆదరణ అయితే దక్కుతోంది. ఓటీటీలోకి కొత్త చిత్రాలు వస్తూ ఉన్నా కూడా సింబా ఇప్పటికీ టాప్‌లోనే ట్రెండ్ అవుతోంది.
 

34

రిలీజ్ కు రెడీ అవుతున్న ప్రిన్స్, నరేష్ అగస్త్య `కలి`.. 

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 
 

44

కలి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు. నటీనటులు - ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి తదితరులు. ఈ మూవీకి సంగీతం - జీవన్ బాబు, ఎడిటర్ – విజయ్ కట్స్, సినిమాటోగ్రఫీ – నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి, సమర్పణ – కె. రాఘవేంద్ర రెడ్డి, నిర్మాత - లీలా గౌతమ్ వర్మ
రచన, దర్శకత్వం - శివ శేషు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Recommended image2
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image3
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved