అందరూ ఆమాట అడుగుతున్నారు, వింటున్నారా... సుక్కూని నిలదీసిన అనసూయ!
చావు కబురు చల్లగా విడుదల నేపథ్యంలో గత రాత్రి చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన అనసూయ వేదికపై మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
19

కెరీర్ లో మొదటిసారి ఐటెం సాంగ్ చేశారు అనసూయ. 'పైన పటారం లోన లొటారం' అంటూ సాగే ఐటెం నంబర్ లో కార్తికేయతో పాటు స్టెప్స్ వేశారు.

29
చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ వేడుకకు విచ్చేసిన అనసూయ.. ఆ సాంగ్ లో నటించడానికి జానీ మాస్టర్ తో పాటు పాట రాసిన సనారే, కారణం అన్నారు. చిన్నవాడైన సనారే జీవిత అనుభవసారం ఈ తరానికి అర్థం అయ్యేలా.. బాగా రాశారు అన్నారు.

39
హీరో కార్తికేయ చాలా హంబుల్ అండ్ సింపుల్ అంటూ పొగిడిన అనసూయ, దర్శకుడు కౌశిక్ పై కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బన్నీతో త్వరగా నటించాలని ఉందని అనసూయ చెప్పడం విశేషం.

49
పనిలో పనిగా తన మనసులో దర్శకుడు సుకుమార్ పై ఉన్న అసహనాన్ని బయటపెట్టారు. ఈ వేడుకకు వచ్చిన నన్ను, చాలా మంది పుష్ప మూవీలో మీ పాత్ర ఏమిటని అడిగారని అనసూయ అన్నారు.

59
పుష్ప సినిమా కోసం నన్ను ఎవరూ అడగలేదని చెప్పడానికి బాధేసింది.. సుక్కూ సర్ మీకు వినబడుతుందా అంటూ అందరి ముందు నిలదీశారు. పుష్ప మూవీలో తనకు పాత్ర ఇవ్వలేదని ఆమె పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు.

69
రంగస్థలం మూవీలో చేసిన రంగంమత్త పాత్ర తరువాత చావు కబురు చల్లగా మూవీలో ఈ సాంగ్ లో నటించడం బాగుందని అన్నారు. రంగస్థలం మూవీ తన కెరీర్ కి ఎంతో ఉపయోగపడిందన్న విషయం ఆమె గుర్తు చేసుకున్నారు.

79
ఇక పుష్ప మూవీలో అనసూయకు ఎటువంటి రోల్ లేదన్న విషయం ఆమె లేటెస్ట్ కామెంట్స్ తో తెలిసిపోయింది.

89
అయితే భవిష్యత్ లో తనకు పాత్ర ఖచ్చితంగా ఇవ్వాలని సుకుమార్, బన్నీలకు అనసూయ సందేశం చేరవేశారు.

99
యాంకర్ గా కంటే కూడా నటిగానే బిజీగా ఉన్నారు అనసూయ. తెలుగు, తమిళ మరియు మలయాళ బాషలలో కలిపి అరడజను సినిమాల వరకు అనసూయ చేస్తున్నారు.

Latest Videos