భోరున ఏడ్చుకుంటూ అనసూయ పోస్ట్.. ఏమి జరిగిందంటూ అభిమానుల ఆందోళన..
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనసూయ తరచూ వివాదాల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతుంది. హాట్ పోస్ట్ లతో రచ్చ చేస్తుంది. ఇంటర్నెట్‌కి మాత్రం మంచి స్టఫ్ ఇస్తుంది. కానీ తాజాగా ఆమె భోరున విలపిస్తూ షాకిచ్చింది.

photo credit-anasuya insta
యాంకరింగ్ మానేసి నటిగా ఫిక్స్ అయ్యింది అనసూయ. సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ రాణిస్తుంది. పెద్దతెరపై నటిగా మెప్పించే ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియాలో గ్లామర్ పోస్ట్ లతో ఆకట్టుకుంటుంది. ఎప్పుడూ సందడిగా ఉండే అనసూయ ఒక్కసారిగా షాక్‌కి గురి చేస్తుంది.
ఇందులో భోరున విలపించింది అనసూయ. తన ఏదో బాధపడుతూ ఆమె కంటిన్యూగా కన్నీళ్లు పెట్టుకుంది. ఎప్పుడూ లేని విధంగా అనసూయ ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ పోస్ట్ పెట్టడం అందరిని షాక్‌కి గురి చేస్తుంది. పైగా తన లైఫ్‌లోనూ ఇలాంటి సంఘటనలు ఉంటాయని, ఉన్నాయని చెబుతూ, వాటిని ఫేస్ చేశానని, తన లైఫ్‌లో బాధలను, కన్నీళ్లని ఎదుర్కొన్నానని చెబుతూ ఆమె పోస్ట్ పెట్టడం గమనార్హం.
ప్రపంచంలో ఎంత గొప్పవాళ్లైనా, మామూలు వ్యక్తులైనా అందరికి బాధలు ఉంటాయి. అందరి జీవితాల్లో కష్టాలుంటాయి. జీవితం అన్నాక కష్టాలు అందరికి కామనే. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. బాధని వ్యక్తం చేసేలా గట్టిగా ఏడ్వడంలో తప్పులేదు, బాగా ఏడ్చి, ఆ బాధనంతా బయటకు పంపేసి తిరిగి మళ్లీ మామూలు స్థితికి రావాలి. మళ్లీ స్ట్రాంగ్‌గా కమ్ బ్యాక్ కావాలి. బాధని వదిలేసేందుకు ఏడ్వడంలో తప్పులేదని చెబుతుంది అనసూయ. అదే సమయంలో బాధలు, కన్నీళ్లు ఉన్నాయని అధైర్యపడవద్దని ఆమె వెల్లడించారు.
మొదట తన పోస్ట్ ని చూసి అంతా కన్‌ఫ్యూజ్ అవుతారని తనకు తెలుసు అని, కానీ సోషల్ మీడియా అనేది ఒకరితో ఒకరు రిలేషన్ పెంచుకోవాలని, ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ప్రదేశంగా మార్చాలని, ఒకరికొకరు అందగా నిలవాలని, సమాచారాన్ని పంచుకోవాలని, జీవనశైలి, సంస్కృతులను పంచుకునేందుకు ఉన్నాయి. మరి అదే జరుగుతుందా? అనేది తన ప్రశ్న అని చెప్పింది. తన పోస్ట్ ఉద్దేశ్యం ఏంటంటే ఫోటో షూట్లు, పోజులు, క్యాండీడ్స్, చిరునవ్వులు, డాన్సులు, బలమైన కౌంటర్లు, పునరాగమనాలు అన్నీ తన జీవితంలో భాగమే అని తెలిపింది.
Anasuya Bharadwaj
`మీరు కూడా అలానే ఉన్నారు. కాబట్టి నేను అదంతా మీతో పంచుకుంటాను. ఇలాగే నా జీవితంలో కొన్ని దశలో అంత బలంగా లేను, చాలా వీక్‌గానూ ఉన్నాను. విచ్చిన్నాలున్నాయి. ఆ విషయాలను మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ఇది అనివార్యమైన విషయం, ఇందులో ప్రతిదీ నిజం. నేను స్ట్రాంగ్‌గా, తటస్థ భావాలతో, యాటిట్యూడ్‌తో ఉంటాననే భావన అందరిలో ఉంటుంది. కానీ కష్టాలు అందరికి ఉంటాయి. అవి ఉన్నప్పుడు రెండు మూడు రోజులు బాగా ఏడ్చి మళ్లీ మామూలు జీవితాన్ని ప్రారంభించాలి. ఎప్పుడూ సవాళ్ల నుంచి నిష్క్రమించవద్దు. తిరిగి మరింత బలంగా కమ్ బ్యాక్ కావాలని కోరుకుంటున్నా అంటూ తన భావాలను షేర్ చేసుకుంది అనసూయ. తాను అదే చేస్తానని ఇందులో పేర్కొంది. ఈ వీడియో ఐదు రోజుల క్రితంది అని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్టు చెప్పింది అనసూయ.
అయితే ఆమె ఏడుస్తూ ఈ పోస్ట్ పెట్టడమే కాస్త విచిత్రంగా ఉంది. అనసూయకి ఏదో బాధ వచ్చిందని, ఆమె పర్సనల్ లైఫ్‌లో ఏమైనా విభేదాలు వచ్చాయా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అదే సమయంలో లైఫ్ గురించి చెప్పడానికి నిజంగానే అంతగా ఏడవాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కూడా అతి చేయాలా అంటున్నారు. తమదైన స్టయిల్లో కౌంటర్లిస్తున్నారు. మొత్తానికి మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది అనసూయ.