అలా నో చెప్పడం నా తప్పే, త్రివిక్రమ్ కి సారీ చెప్పా..అందుకే హీరోయిన్ గా ఆఫర్స్ రాలేదు, అనసూయ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చిందని అనసూయ తెలిపింది. కానీ ఆ సాంగ్ కి నో చెప్పాను. ఎందుకంటే ఆ సాంగ్ లో ఆల్రెడీ చాలా మంది హీరోయిన్లు ఉన్నారు.
బుల్లితెరపై అనసూయ టాప్ యాంగర్ గా చాలా కాలం వెలుగు వెలిగింది. కానీ అక్కడ చేసే టీఆర్పీ స్టంట్స్ నచ్చడం లేదు అంటూ అనసూయ యాంకరింగ్ కి దూరం అయింది. కానీ వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది.
రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. వాస్తవానికి అనసూయ సినిమాలలో ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడం వల్లే బుల్లితెరకి దూరం అయింది అనే ప్రచారం కూడా ఉంది.
ఇదిలా ఉండగా తన కెరీర్ పై, వస్తున్న ఆఫర్స్ పై, గతంలో జరిగిన వివాదాలపై అనసూయ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చిందని అనసూయ తెలిపింది. కానీ ఆ సాంగ్ కి నో చెప్పాను.
ఎందుకంటే ఆ సాంగ్ లో ఆల్రెడీ చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. గుంపులో ఒకరిగా నటించడం నాకు నచ్చలేదు అందుకే నో చెప్పా. ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నప్పుడు నన్ను చాలా మంది విమర్శించారు, ట్రోల్ చేశారు. కానీ నేను నో చెప్పడం తప్పు కాదు. నేను చెప్పిన విధానం తప్పని ఆ తర్వాత తెలిసింది. దీనితో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సారీ చెప్పా అని అనసూయ పేర్కొన్నారు.
ఆలాగే తనకి హీరోయిన్ గా అవకాశాలు ఎందుకు రాలేదో కూడా అనసూయ కారణం చెప్పింది. సినిమా పూర్తయ్యాక జరిగే పార్టీలకు నేను వెళ్ళను. ఆ అలవాటు నాకు లేదు. పార్టీలకు వెళ్లి హైలైట్ అయ్యే ఉద్దేశం నాకు లేదు. అలా చేస్తేనే హీరోయిన్ గా ఆఫర్ వస్తుందంటే అది నాకు వద్దు అని అనసూయ పేర్కొంది.
అనసూయ పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కానీ ఆమెకి క్షణం, రంగస్థలం లాంటి చిత్రాలు నటిగా గుర్తింపు పెంచాయి. పార్టీలకు వెళ్లి గ్లామర్ ప్రదర్శిస్తేనే అవకాశాలు వస్తాయి అనేది అనసూయ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సారాంశం అని అంటున్నారు.