- Home
- Entertainment
- నేను సోషల్ మీడియాకి భయపడి ఏడ్చే రకం కాదు.. ఏడుపు వీడియో వెనుక అసలు సంగతి బయటపెట్టిన అనసూయ
నేను సోషల్ మీడియాకి భయపడి ఏడ్చే రకం కాదు.. ఏడుపు వీడియో వెనుక అసలు సంగతి బయటపెట్టిన అనసూయ
అనసూయ శనివారం రోజు ఇంస్టాగ్రామ్లో బోరున విలపిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. అనసూయ అంతలా కన్నీరు మున్నీరుగా ఏడవడం నెటిజన్లు ఎప్పుడూ చూడలేదు. దీనితో అనసూయకి ఏమైంది అని అంతా కంగారు పడ్డారు.

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది.
రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా రంగమార్తాండ చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2,వూల్ఫ్ మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. అయితే అనసూయ శనివారం రోజు ఇంస్టాగ్రామ్లో బోరున విలపిస్తూ ఓ పోస్ట్ పెట్టింది.
అనసూయ అంతలా కన్నీరు మున్నీరుగా ఏడవడం నెటిజన్లు ఎప్పుడూ చూడలేదు. దీనితో అనసూయకి ఏమైంది అని అంతా కంగారు పడ్డారు. ఆ పోస్ట్ లో ఆమె చేసిన కామెంట్స్ ని బట్టి.. సోషల్ మీడియాలో నెగిటివిటికి అనసూయ బాగా ఫీల్ అయినట్లు ఉంది.. అందుకే అందరూ హ్యాపీగా ఆలోచించాలి, నెగిటివ్ కామెంట్స్ వద్దు అని చెబుతున్నట్లుగా అర్థం చేసుకున్నారు.
మరికొంతమంది ఇటీవల అనసూయపై సోషల్ మీడియాలో నెగిటివిటి బాగా పెరిగింది. సింపతీ పొందడం కోసం అనసూయ ఎలా ఎమోషనల్ వీడియోలు పెడుతుందని కూడా ట్రోల్ చేశారు. తన పోస్ట్ రాంగ్ వే లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అనసూయ మరో పోస్ట్ లో తాజాగా క్లారిటీ ఇచ్చింది. తాను ఏడవడం వెనుక అసలు కారణం తెలిపింది.
'అరేయ్ ఏంట్రా మీరంతా..ఆ అంటూ రెండు వీడియోలు పోస్ట్ చేసింది. ఈ వీడియోల్లో అనసూయ మాట్లాడుతూ.. దేవుడా.. ఆ వీడియో పెట్టిన తర్వాత హ్యాపీగా సెలూన్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకున్నా. ఎందుకంటే రేపు సండే నాకు వర్కింగ్ డే. ఆ వీడియోలో చాలా మంది నేను అనుకున్నట్లుగానే అర్థం చేసుకున్నారు. కానీ మిగిలిన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను సోషల్ మీడియా నెగిటివిటి వాళ్ళ ఏడవలేదు.
సోషల్ మీడియా వల్ల నేను ఏడ్చే రకం కాదు. నెగిటివిటి ఉంటే నా ఫీలింగ్ కోపం తో వస్తుంది. ఏడుపుతో కాదు. నా పర్సనల్ లైఫ్ లో ఒక నిర్ణయం తీసుకున్నా. అందువల్ల ఏర్పడిన వీక్ మూమెంట్ లో ఏడ్చాను. సోషల్ మీడియాలో నా లాంటి పబ్లిక్ ఫిగర్ ఏడవడం కరెక్టేనా అని ఆలోచించా. కానీ నేను ఒంటరి కాదు పర్వాలేదు అని భావించే అలా ఏడ్చినా వీడియో పోస్ట్ పెట్టినట్లు అనసూయ పేర్కొంది. ఎందుకు ఎడ్వాల్సి వచ్చిందో అని స్పష్టమైన కారణం మాత్రం అనసూయ రివీల్ చేయలేదు. సోషల్ మీడియా నెగిటివిటి వల్ల అయితే కాదు అని క్లారిటీ ఇచ్చింది.