- Home
- Entertainment
- Anasuya New Movie : మరోసారి అత్త అవతారం ఎత్తబోతున్న అనసూయ.. మాస్ మహారాజ్ సినిమాలో..
Anasuya New Movie : మరోసారి అత్త అవతారం ఎత్తబోతున్న అనసూయ.. మాస్ మహారాజ్ సినిమాలో..
అటు బుల్లి తెరమీద యాంకర్ గా.. ఇటు వెండితెర మీద నటిగా దుమ్మురేపుతోంది అనసూయ భరద్వాజ్. రంగమ్మత్తగా ఫుల్ పాపులర్ అయిన నటి.. ఇప్పుడు మరోసారి అత్త అవతారం ఎత్తబోతోంది.

యాంకర్ కమ్ యాక్ట్రస్ అనసూయ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అటు యాంకరింగ్ చేస్తూనే.. నటిగా కూడా బిజీ అవుతుంది. కెరీర్ బిగినింగ్ లో స్పెషల్ సాంగ్స్ వరకే పరిమితం అయిన అనసూయ, ఆతరువాత సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ కు షిప్ట్ అయ్యింది. అనసూయ టాలెంట్ కు మంచి మంచి పాత్రలు వచ్చి చేరుతున్నాయి ఆమె ఖాతాలో.
Anasuya Bharadwaj
సాధ్యమైనంత వరకూ పవర్ఫుల్ పాత్రల్లో కనిపించడానికి ఆమె ఎక్కువగా ఆసక్తిని చూపుతోంది. అటు డైరెక్టర్లు కూడా అనసూయను స్పెషల్ క్యారెక్టర్స్ లో చూపించడానికే ఇష్టపడుతున్నారు. యాంకర్ గా ఆమెకు ఉన్న క్రేజ్ ను బాగా ఉపయోగించుకుంటున్నారు.
గతంలో సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలంలోనే రంగమ్మత్తగా అనసూయ పెర్ఫామెన్స్ మెస్మరైజ్ చేసింది. బ్యూటీ,యాక్టింగ్ తో ఈసినిమాలో అద్భుతంగా నటించింది రంగమ్మత్త. ఇక రీసెంట్ గా మళ్ళీ అదే సుకుమార్ సినిమా పుష్పలో దాక్షాయణి గా... కాస్త గ్లామర్ కు దూరంగా ఉండే పాత్రలో మెరిసింది.
కాని ఈ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుంది సినిమాలో. ఇక ఈసారి గ్లామర్ తో పాటు పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది అనసూయ అది కూడా మాస్ మహారాజ్ రవితేజ నటించి ఖిలాడి సినిమాలో అనసూయ ప్రత్యేక పాత్రలో మెరవబోతున్నట్టు తెలుస్తోంది.
రవితేజ హీరోగా మీనాక్షి చౌదరి , డింపుల్ హయతి హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న సినిమా ఖలాడి. ఈమూవీలో హీరోయిన్లలో ఒక హీరోయిన్ కు తల్లిగా అనసూయ నటించబోతున్నట్టు సమాచారం. ఆ ఇద్దరిలో ఒకరికి తల్లిగా .. అంటే రవితేజకి అత్త పాత్రలో అనసూయ తన జోరు చూపించనుందని అంటున్నారు.
ఈ పాత్ర పేరు చంద్రకళ అని తెలుస్తోంది. ఈ సినిమాకే హైలెట్ అయ్యే చంద్రకళ పాత్ర అనసూయకు బాగా సెట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఈనెల 11న రిలీజ్ చేయబోతున్నారు. రంగమ్మత్తగా, దాక్షాయణిగా అలరించిన అనసూయ.. చంద్రకళగా ఎలా ఉంటుందా అని.. ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
అటు బుల్లితెర... వెండితెర మాత్రమే కాదు. ఇటు సోషల్ మీడియాను కూడా ఒక ఊపు ఊపి వదిలిపెడుతుంది అనసూయ. ప్రతీ వారం... హాట్ హాట్ ఫోటో షూట్ తో ఇన్ స్టా ను శేక్ చేస్తుంటుంది. సోషల్ మీడియో ఆమె అందాల ప్రదర్శనకు లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు కొత్త ఫోటోలు పెడుతుందా అని ఎదురుచూస్తుంటారు.