మేకప్ లేకపోతే అమ్మమ్మలా ఉన్నావ్.. అనసూయ ఫోటోపై నెటిజన్ల పోస్ట్ లు వైరల్..
హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో అనేకసార్లు విమర్శలకు, ట్రోల్స్ కి గురయ్యింది. ట్రోలర్స్ పై ఆమె గట్టిగా రియాక్ట్ అయ్యింది. ఆంటీ అన్నవారికి ఏకంగా జైల్లోనూ పెట్టింది.

యాంకర్ అనసూయ ఇప్పుడు టీవీ షోస్ మానేసి సినిమాలు చేస్తుంది. టీవీ షోస్‌కి దూరంగా ఉంటుంది. సినిమాలతో రాణించాలని బలంగా నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకుపైగా సినిమాలున్నాయి. తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తుంది. నటిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది అనసూయ. గ్లామర్ పరంగా టీవీలో ఓపెన్ అయ్యింది. సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
ఇక సినిమాల్లో నటిగానే నిరూపించకోవాలనుకుంటున్నట్టు తెలిపింది. దీనికితోడు తన పిల్లలు పెద్దగా అవుతున్నారు. వారికి తనపై వచ్చే కామెంట్లు, ట్రోల్స్ అర్థమవుతున్నాయనే ఉద్దేశ్యంతో తాను టీవీ నుంచి తప్పుకున్నట్టు తెలిపింది అనసూయ. దీనికితోడు గ్లామర్ ఫోటో షూట్లు కూడా తగ్గించింది. అడపాదడపా చాలా తక్కువగానే ఫోటో షూట్ పిక్స్ పంచుకుంటుంది.
తాజాగా అనసూయ మేకప్ లేకుండా ఓ ఫోటోని పంచుకుంది. క్లోజప్ షాట్‌లో తన ఫేస్ వరకే కవర్ అయిన పిక్‌ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సందర్భంగా అనసూయ చెబుతూ, రెండు నెలల ఆధ్యాత్మికపరమైన వర్కౌట్స్ తర్వాత తన కాన్ఫిడెన్స్ లెవల్` అంటూ ఈ ఫోటోని షేర్ చేసింది అనసూయ. నో ఫిల్టర్ అనే యాష్ ట్యాగ్‌ని కూడా షేర్ చేసింది. దీని కారణంగా తన కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగినట్టు ఆమె పేర్కొంది.
అనసూయ ఫోటోపై, ఆమె పోస్ట్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేచురల్ బ్యూటీ అని, మేకప్ లేకపోయినా అందంగా ఉన్నావని, నీ కాన్ఫిడెన్స్ ఈ లుక్‌లో తెలుస్తుందని, అందానికి మారుపేరు అనసూయ అని, లుకింగ్ బ్యూటీఫుల్ అని, అనసూయ బ్రైట్, వైబ్రెంట్, ఆల్వేస్ పవర్ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ఫోటోని వైరల్ చేస్తున్నారు.
మరికొందరు నెటిజన్లు మాత్రం సెటైర్లు పేలుస్తున్నారు. మేకప్ లేకపోతే అసలు ఏజ్ కనిపిస్తుందని, ముడతలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంకొందరు కొంటె నెటిజన్లు మాత్రం మేకప్ లేకపోతే అమ్మమ్మలా ఉన్నావని పోస్ట్ లు చేయడం గమనార్హం. మేకప్ లేకపోతే ఏజ్ ఎక్కువ కనిపిస్తుందని అంటున్నారు. అంతా బాగుంది కానీ ఈ కామెంట్లే కాస్త హర్ట్ అయ్యేలా ఉన్నాయి. మరి దీనిపై అనసూయ రియాక్ట్ అవుతుందా? అనేది చూడాలి.
Anasuya Bharadwaj
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చెబుతూ, ఇకపై ఇలాంటి కామెంట్లని పెద్దగా పట్టించుకోనని చెప్పింది. అయితే అనసూయకి నెటిజన్ల నుంచి సపోర్ట్ లభిస్తుంది. మీరు ఇంతటి అందం, ఫిట్‌నెస్ మెయింటేన్ చేయడం ఎంత కష్టమో తెలుసు అని, మిమ్మల్ని కామెంట్ చేసే వారికి అవి తెలియదని పేర్కొంది. మీరు స్ట్రాంగ్ లేడీ అని, ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెబుతూ అనసూయకి అండగా నిలుస్తున్నారు.