‘నేను చేసే పాత్రలు అలానే ఉంటాయి’.. అనసూయ కామెంట్స్.. పట్టుచీరలో కట్టిపడేస్తున్న స్టార్ బ్యూటీ
యాంకర్ నుంచి నటిగా ప్రయాణం కొనసాగిస్తున్న అనసూయ భరద్వాజ్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో ఆకట్టుకుంటుంటారు. ఇక సినిమాల్లో తను చేసే పాత్రలపై తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపింది.
బుల్లితెరపై యాంకర్ గా అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ యాంకరింగ్ కు, అందాల ఒళకబోతకూ టీవీ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తక్కువ సమయంలోనే తన ప్రతిభతో ఎక్కువ క్రేజ్ దక్కించుకుంది.
యాంకర్ గా కొనసాగుతున్న సమయంలోనే అనసూయ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వచ్చింది. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా ఎదుర్కొంది. యాంకర్ నుంచి నటిగా ప్రస్తుతం వెండితెరపై సందడి చేస్తున్న ఈ స్టార్ బ్యూటీ తన సక్సెస్ తో విమర్శకుల నోళ్లు మూయించింది.
ఇప్పటికీ అనసూయ పోస్టులు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంటాయి. అలాగే ఆమె కామెంట్స్ కూడా ఆసక్తికరంగా మారుతుంటాయి. ఈ క్రమంలో తను సినిమాల్లో చేసే పాత్రలపై అనసూయ ఎప్పుడో ఓ కీలక నిర్ణయం తీసుకుందంట.
ఆ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రంగస్థలం, పుష్ప చిత్రాల్లోని తన పాత్రలపై యాంకర్ ప్రసావించిన సమయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తను చేసే సినిమాల విషయంలో ఎప్పుడూ ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. నటిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి అనసూయ ఇప్పటి వరకు విభిన్న పాత్రలు చేస్తూ వస్తోంది. ఎప్పుడూ రిపీటెడ్ పాత్రల్లో కనిపించ లేదు. ఇందుకు కారణం ఆమె తీసుకున్న డిసీషనే. ముందుగానే అనసూయ చేసిన పాత్రలు మళ్లీ చేయకూడదని ఫిక్స్ అయ్యిందంట.
విభిన్న పాత్రల ద్వారా అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు తాను ఎప్పుడూ కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. ఎలాంటి పాత్రకైనా తను న్యాయం చేయగలననే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. అలాగే రంగస్థలం, పుష్పలపైనా స్పందించింది.
సుకుమార్ దర్శకత్వంలోని ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర చేసిన తర్వాత ‘పుష్ప2’లో దాక్షాయణిగా అలరించింది. ఈ రోల్ కోసం లుక్ టెస్ట్ చేసినప్పుడు రంగమ్మత్త లాంటి హైప్ కోరుకోవద్దని చెప్పాడంట. కానీ దాక్షయణిగా అనసూయ ఇచ్చిన పెర్ఫామెన్స్ కు మరింత రెస్పాన్స్ దక్కింది. దాంతర్వాత తను నటిగా ఇంకా బెస్ట్ రోల్స్ లో నటించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. Pushpa 2లో తనపాత్ర ఇంకా ఆకట్టుకుందని చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తున్న అనసూయ బ్యూటీఫుల్ శారీ లుక్ లో అదరగొడుతున్నారు. తాజాగా పట్టుచీరలో పద్ధతిగా మెరిసింది. చీరకట్టుకే అందం తెచ్చింది. బ్యూటీఫుల్ స్టిల్స్ తో కట్టిపడేసింది. మత్తు చూపులతో, రూపసౌందర్యంతో మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.