`విజయ్ దేవరకొండ లాంటి మొగుడొస్తాడు`.. మీరు ఆ పనిచేయడం లేదంటూ మీడియాపై అనసూయ ఫైర్..
అనసూయ మళ్లీ విజయ్ దేవరకొండ వివాదంపై స్పందించింది. విజయ్ లాంటి మొగుడు వస్తాడనే డైలాగ్ రచ్చగా మారిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది.
అనసూయ మీడియా ముందుకు వచ్చిందంటే సోషల్ మీడియాకి ఫుల్ కంటెంట్. ఆమె సమాధానాలు అలానే ఉంటాయి. కౌంటర్లు అలానే ఉంటాయి. ఆమె టచ్ చేసే విషయాలు అలానే ఉంటాయి. మీడియా సైతం దాన్నే హైలైట్ చేస్తుంది. దీంతో మొత్తం రచ్చ రచ్చ అవుతుంది. రెండు మూడు రోజులు అదే చర్చ నడుస్తుంది. ఇటీవల ఆమె సైలైంట్‌గా ఉంది. ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ అవుతుంది. `అర్జున్ రెడ్డి` నుంచి విజయ్ దేవరకొండతో ఏదో విషయంలో వివాదం నడుస్తూనే ఉంది. ఆయనపై అనసూయ కామెంట్లు వివాదంగా మారుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ మధ్య ఇలాంటి కామెంట్లకి దూరంగా ఉండాలని, దానిపై స్పందించకూడదని చెప్పింది అనసూయ. ఇప్పుడు మళ్లీ ఓపెన్ అయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో `సింబా` సినిమా రూపొందుతుంది. తాజాగా బుధవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో `మీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు మేడం` అంటూ అనసూయ స్కూటీ తుడుస్తుంటాడు ఓవ్యక్తి. ఆ డైలాగ్ బాగా పేలింది. ట్రైలర్ లో హైలైట్ అయ్యింది.
దీనిపై ఆమెకి ప్రశ్న ఎదురయ్యింది. విజయ్ దేవరకొండతో వివాదం ముగిసినట్టేనా? అనే ప్రశ్నకి అనసూయ మాట్లాడుతూ, ఇప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవడం లేదు. సినిమా ద్వారా ఏదైతే సందేశం ఇవ్వాలనుకున్నానో, అప్పుడు కూడా జనాలకు మెసేజ్ ఇవ్వాలను రియాక్ట్ అయ్యాను. మనం ఫోకస్ అవుతున్నప్పుడు పద్ధతిగా ఉండాలి, కానీ మితిమీరితే అది అందరికి తెలుస్తుంది. నిజానికి ఆ టైమ్‌లో మీకు ఎందుకు తప్పు అనిపించలేదు, మీరు ఎందుకు అడగలేదు? మీరంతా మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది.
అది ముమ్మాటికి మీ తప్పే, మళ్లీ మీరే నన్ను ఉల్టా బదనాం చేస్తున్నారు. దాని మూలంగా నేను ఎవరినీ హేట్ చేయడం లేదు. ఇది సరైన పద్ధతి, గౌరవం కాదు అని మాతమే చెప్పాను. దాన్నుంచి మనం అంతా నేర్చుకోవాలి. ఆ విషయం ద్వారా నేనూ నేర్చుకున్నాను. ఓరకంగా చెప్పాల్సింది, మరోరకంగా చెప్పాను. ఆ విషయంలో నేనూ నేర్చుకున్నాను` అని చెప్పింది అనసూయ.
`సింబా` ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ లాంటి మొగుడు రావాలనే డైలాగ్‌పై స్పందిస్తూ, అది దర్శకుడు అడిగాడు. నేను ఓకే అన్నాను. నాకు పర్సనల్‌గా ఎలాంటి సమస్య లేదు. అది చూసి అంతా నవ్వుకుంటారు. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని చేశాను` అని చెప్పింది అనసూయ. మొత్తంగా ఈ సారి చాలా కూల్‌గా డీల్ చేసే ప్రయత్నం చేసింది. మరి దీనిపై ఇంకా ఎలాంటి రచ్చ జరుగుతుందో చూడాలి.
`సింబా` సినిమా గురించి చెబుతూ, ప్రకృతి గురించి సందేశం ఇచ్చే చిత్రమని, అలాగని, డైరెక్ట్ సందేశం ఉండదు, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కోణంలో సాగుతుందని, థ్రిల్లింగ్ ఎలిమెంట్లు ఉంటాయని చెప్పింది అనసూయ. తనకు ఫారెస్ట్ అంటే ఇష్టమని పేర్కొంది. ఇందులో నెగటివ్ రోల్‌లో అనసూయ కనిపిస్తుంది. దీనిపై ఆమెని స్పందిస్తూ, తాను ఎలాంటి పాత్ర అయినా చేస్తాను, కాకపోతే అది తన గురించి మాట్లాడుకునేలా ఉండాలి, అరే అనసూయ భలే చేసిందని మాట్లాడుకోవాలి, తన పాత్రకి పేరు రావాలి అలాంటి ఏ పాత్ర అయినా, ఎంత నిడివి ఉన్నదైనా చేసేందుకు రెడీ అని తెలిపింది అనసూయ. ఈ సినిమా ఆగస్ట్ 9న విడుదల కాబోతుంది. ఇందులో జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.